RRR Trailer: పప్పులో కాలేయబోయిన రాజమౌళి.. తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గిన జక్కన్న

Published : Dec 09, 2021, 12:07 PM IST

ఇండియన్‌ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. థియేటర్‌లో మోత మోగిపోయింది. బాక్సాఫీస్‌ కా బాప్‌ అనేలా ట్రైలర్ ఉండటంతో ఇప్పుడు సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది.   

PREV
115
RRR Trailer: పప్పులో కాలేయబోయిన రాజమౌళి.. తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గిన జక్కన్న

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` ట్రైలర్‌ వచ్చేసింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటించిన ఈ సినిమా ట్రైలర్‌ గురువారం ఉదయం థియేటర్‌లో విడుదలైంది. అభిమానులతో థియేటర్లు
నిండిపోయాయి. పోటెత్తిపోయాయి. ఊహించని స్పందనతో థియేటర్లు మోత మోగిపోయాయి. ట్రైలర్‌ గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఎలివేషన్‌ సీన్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ట్రైలర్‌లోనే ఇలా ఉంటే, ఇక సినిమాలో నభూతో నభవిష్యతి అనేలా ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. RRRR Trailer.

215

ఇదిలా ఉంటే రాజమౌళి ఒక్క విషయంలో పెద్ద బ్లండర్ చేశారు. యూట్యూబ్‌లో రిలీజ్‌ చేయకుండా కేవలం సెలెక్టెడ్‌ థియేటర్‌లోనే విడుదల చేసి తప్పు చేశారు. ఈ విషయంలో జక్కన్న పప్పులో కాలేశాడని చెప్పొచ్చు.

315

ఏకకాలంలో థియేటర్‌, యూట్యూబ్‌లో విడుదల చేస్తే ఆ కిక్కే వేరు. ఆడియెన్స్ నుంచి, అభిమానుల నుంచి వచ్చే స్పందన వేరే లెవెల్‌లో ఉంటుంది. కొంత మంది మాత్రమే థియేటర్‌లో చూడగలుగుతారు. మెజారిటీగా ఆ ఛాన్స్ ఉండదు. దీంతో తీవ్ర నిరాశ ఎదురైంది. అసంతృప్తి జ్వాలలు రగిలాయి. 

415

అయితే తన తప్పుని తెలుసుకున్నాడు, రాబోయే ప్రమాదాన్ని రాజమౌళి వెంటనే ఊహించాడు. వెంటనే ట్రైలర్‌ని యూట్యూబ్‌లో విడుదల చేశాడు. నిజానికి ఆన్‌లైన్‌లో ట్రైలర్‌ని సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నట్టు నిన్న బుధవారం ప్రకటించింది యూనిట్‌. కానీ థియేటర్‌లో ట్రైలర్‌ విడుదల చేసే సందర్బంలో వచ్చిన విమర్శలు నేపథ్యంలో వెంటనే తప్పు తెలుసుకుని తేరుకున్నారు. 

515

దీంతో గంట వ్యవధిలో అంటే ఉదయం 11గంటలకు యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశాడు. `ఆర్‌ఆర్‌ఆర్‌` అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` కోసం వేచి చూస్తున్న అభిమానులంతా ఇప్పుడు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. పోటీ పడి మరీ ఒకటికి పది సార్లు ట్రైలర్‌ని చూస్తుండటం విశేషం. 

615

ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌` ట్రైలర్ సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతుంది. సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. కేవలం గంట వ్యవధిలోనే దీనికి ఒక మిలియన్‌(పది లక్షల) వ్యూస్‌ రావడం విశేషం. ఇంకా మున్ముందు ఈ ట్రైలర్ ఇంకెన్ని సంచలనాలు, రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

715

అయితే ఇదే ట్రైలర్‌ థియేటర్‌తోపాటు విడుదల చేసి ఉంటే ఆ సునామీని ఊహించడం కూడా కష్టంగా ఉండేది, అన్ని రికార్డులు బద్దలయ్యేవని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాన్ని పూడ్చే పనులు చేపట్టారు జక్కన్న టీమ్. 
 

815

ఇక `ఆర్‌ఆర్‌ఆర్‌` ట్రైలర్‌లో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ ఎంట్రీ, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ ఎంట్రీ విజువల్‌ ట్రీట్‌గా ఉంది. ఇద్దరు హీరోల అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రెండు క్యారెక్టర్ల ఎలివేషన్‌ సీన్లు పీక్‌లో ఉండటం విశేషం. 

915

అదే సమయంలో సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఒకానొక దశలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కొట్టుకోవడం, భీకరంగా పోరాడటం వెంట్రుకలు నిక్కపొడిచేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి తమ గెటప్‌లో ఎంట్రీ ఇచ్చే సీన్‌కి మాటల్లేవ్‌, కుంభస్థలాన్ని బద్దలు కొట్టడమే అనే డైలాగ్‌, చివర్లో ఇద్దరు కలిసి పోరాడటం మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. 

1015

ఇందులో విలన్‌ పాత్రని కూడా అంతే ఎలివేటెడ్‌గా చూపించడం విశేషంగా చెప్పుకోవచ్చు. అజయ్‌ దేవగన్‌, శ్రియా, అలియాభట్‌, సముద్రఖని సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉన్నాయి. అలియాభట్‌ని బ్రిటీష్‌ అధికారి తన్నడం, చిన్న పాపని తలపై కొట్టడం హృదయాన్ని కదిలిస్తుంది.

1115

మొత్తంగా ట్రైలర్‌ ఒక విజువల్‌ ఫీస్ట్ లాగా ఉందని చెప్పొచ్చు. థియేటర్‌లో సౌండింగ్‌కి, లావిష్‌ సీన్స్ కి ఆడియెన్స్ మతిపోయేలా ఉంటాయనే విషయాన్ని ట్రైలర్‌ స్పష్టం చేస్తుంది. ట్రైలర్‌ ఈ రేంజ్‌లో ఉంటే, సినిమా మరింత గొప్పగా ఉండబోతుందని తెలుస్తుంది. 
 

1215

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. రామ్‌చరణ్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి అలియాభట్‌, ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోర్రీస్‌ నటిస్తున్నారు. 

1315

 అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ డానయ్య ఏకంగా ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాని నిర్మించారు. ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా పదికిపైగా భాషల్లో విడుదల కానుంది. 

1415

ఇదిలా ఉంటే సినిమాపై టికెట్ల రేట్ల ప్రభావం పడబోతున్నట్టు తెలుస్తుంది. ఏపీలో ప్రభుత్వం టికెట్ల రేట్లు తగ్గించడం కలెక్షన్ల విషయంలో దెబ్బ పడేలా ఉంది. పైగా ఐదు రోజుల వ్యవధిలోనే పవన్‌ కళ్యాణ్‌ `భీమ్లా నాయక్‌`, ఆ తర్వాత ప్రభాస్‌ `రాధేశ్యామ్‌` విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు `ఆర్ఆర్‌ఆర్‌` కలెక్షన్లపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయని చెప్పొచ్చు. 
 

1515

`ఆర్‌ఆర్‌ఆర్‌` ట్రైలర్‌లోని విజువల్స్ ఆడియెన్స్ ని కనువిందు చేస్తున్నాయి. ఈ సినిమా ఓ విజువల్‌ వండర్‌లా ఉండబోతుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. RRR Trailer.

also read: కుంభస్థలాన్ని కొట్టడమే.. హోరెత్తిపోయిన RRR ట్రైలర్, బాక్సాఫీస్ కి చుక్కలే

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories