NTR: ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా స్టంట్ మ్యాన్ ఇమ్రాన్ చేశారు. ఆ సినిమాకు అతడు తీసుకున్న రెమ్యునరేషన్, అనుభవాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. మరి అదేంటంటే.?
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా స్టంట్ మ్యాన్ ఇమ్రాన్ నటించాడు. అతడు ఆ సినిమాలో తన అనుభవాల గురించి, తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ చెప్పులు లేకుండా పులితో పాటు పరిగెత్తిన ఐకానిక్ సీన్ గురించి మాట్లాడుతూ.. 'తాను ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో సెట్లోనే ఉన్నానని ఇమ్రాన్ పేర్కొన్నాడు.
25
అది ఐకానిక్ సీన్
ఎన్టీఆర్ చెప్పులు లేకుండా 50 కిలోమీటర్లకు పైగా వేగంతో పరిగెత్తారని.. ఆ సీన్ ఎలాంటి డూప్ లేకుండా చేశారని ఇమ్రాన్ అన్నాడు. ఆ సన్నివేశంలో ఎన్టీఆర్‌ను చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. ఆ సీన్ చాలా ప్రమాదకరం అని.. ముఖ్యంగా పులి వచ్చే సమయంలో త్రెడ్స్‌ను టైట్ చేసే విధానం చాలా డేంజర్‌గా ఉండేదని ఇమ్రాన్ వివరించాడు.
35
ఆ సీన్ సినిమాకు హైలైట్
ఆ సీన్ సినిమాకు ఒక హైలైట్‌గా నిలిచిందన్నాడు. ఇందులో పలు సీన్స్ తాను ఎన్టీఆర్‌కు డూప్‌గా చేశానన్నాడు. అలాగే గుర్రంతో, బైక్‌తో చేసిన స్పీడ్ షాట్స్ కూడా ఎంతో హైలైట్ అయ్యాయని అన్నాడు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో పనిచేయడం తన జీవితంలో ఒక డ్రీమ్ కమ్ ట్రూ అని, ఆయనకు తాను పెద్ద అభిమాని అని ఇమ్రాన్ ఎంతో సంతోషంగా పంచుకున్నాడు. మరోసారి ఆయనతో పనిచేయాలని ఆశిస్తున్నానని తెలిపాడు.
తన రెమ్యూనరేషన్ గురించి అడగ్గా, RRR కోసం తాను ఒకటిన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు పారితోషికం అందుకున్నానని పేర్కొన్నాడు. RRR చిత్రంలో తన బైక్‌ను ఉపయోగించి స్టంట్స్ చేయలేదని, ఒకవేళ తన బైక్‌ను ఉపయోగించి ఉంటే, టైర్ల ఖర్చులను కూడా రెమ్యూనరేషన్‌లో కలిపి చెప్పి ఉండేవాడినని ఇమ్రాన్ వివరించాడు.
55
స్టంట్ షోలకు ఖర్చు ఎంతంటే.?
సాధారణంగా, తాను కళాశాలల్లో స్టంట్ షోలు చేస్తుంటానని.. అలాంటి షోల కోసం తన బైక్‌కు నెలకు సుమారు 15,000 నుంచి 16,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపాడు. అయితే, RRR విషయంలో డబ్బు కంటే రాజమౌళితో పనిచేసే అవకాశం, అనుభవమే తనకు ముఖ్యమని ఆలోచించినట్టు ఇమ్రాన్ ఉద్ఘాటించాడు.