Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌

Published : Dec 10, 2025, 08:12 AM IST

మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్‌ బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ రాణించింది. అయితే ఆమె సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్‌ చిత్రాలను మిస్‌ చేసుకుంది. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం. 

PREV
15
ఐశ్వర్య రాయ్‌ చేసిన మిస్టేక్స్

మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ హిందీలో తర్వాత తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఆమె తమిళ చిత్రంతోనే హీరోయిన్‌గా మారింది. `ఇరువుర్‌`(ఇద్దరు)తో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తమిళంలో `జీన్స్`, `కండుకొండయన్‌ కండుకొండయన్‌`, `రావనన్‌`, `రోబో`, `పొన్నియిన్‌ సెల్వన్‌` వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఐశ్వర్య రాయ్‌ తన కెరీర్‌లో రెండు అతిపెద్ద మిస్టేక్స్ చేసింది. రెండు ఇండస్ట్రీ హిట్లని మిస్‌ చేసుకుంది. అందులో ఒకటి తమిళంలో కాగా, మరోటి తెలుగులో కావడం గమనార్హం.

25
`నరసింహ` మూవీ మిస్‌ చేసుకున్న ఐష్‌

ఐశ్వర్య రాయ్ కి `ఇరువుర్‌` తర్వాత తమిళంలో మరో బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి నటించే ఛాన్స్ ఆమెని వరించింది. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన `నరసింహ`(పడయప్ప) చిత్రంలో నీలాంబరి పాత్రకి మొదట ఐశ్వర్యనే అడిగారట. కానీ ఆమె చేయలేదట. నెగటివ్‌ షేడ్ పాత్ర కావడంతో పెద్దగా ఆసక్తి చూపించలేదట. అప్పుడప్పుడే హీరోయిన్‌గా ఆఫర్లు వస్తుండటంతో ఇలాంటి టైమ్‌లో ఇలాంటి పాత్ర చేస్తే కెరీర్‌కి ఇబ్బంది అవుతుందని భావించిందట ఐష్‌. అలా ఇండస్ట్రీ హిట్‌ని మిస్‌ చేసుకుంది.

35
నీలాంబరిగా దుమ్ములేపిన రమ్యకృష్ణ

కెఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన `నరసింహ` సినిమాలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్‌గా సౌందర్య నటించింది. శివాజీ గణేషన్‌ ముఖ్య పాత్ర పోషించారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. 1999 ఏప్రిల్‌ 10 ఈ సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు తమిళనాడులో ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా బ్రేక్‌ చేసింది. ఇదిలా ఉంటే నీలాంబరి పాత్ర కోసం ఐశ్వర్య రాయ్‌ తర్వాత నగ్మ, మీన వంటి వారిని కూడా అడిగారట. కానీ వాళ్లు కూడా రిజెక్ట్ చేశారు. ఆ ఛాన్స్ రమ్యకృష్ణకి దక్కింది. ఆమె దుమ్ములేపింది. సినిమాకి సెకండ్‌ హీరోగా నిలిచింది. ఈ సినిమా రమ్యకృష్ణ కెరీర్‌కి బిగ్‌ టర్నింగ్‌ పాయింట్‌ అయ్యిందని చెప్పొచ్చు. అలా ఐష్‌ ఇండస్ట్రీ హిట్‌ని మిస్‌ చేసుకుంది.

45
ప్రేమంటే ఇదేరాని మిస్‌ చేసుకున్న ఐశ్వర్య

దీనికి ముందే ఐశ్వర్య రాయ్‌ తెలుగులో మరో ఇండస్ట్రీ హిట్‌ని మిస్‌ చేసుకుంది. ఆమె తెలుగులో `ప్రేమంటే ఇదేరా` మూవీలో నటించే అవకాశం దక్కింది. వెంకటేష్‌ హీరోగా జయంత్‌ సీ పరాన్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇందులో ప్రీతి జింటా పాత్రకి ముందుగా ఐశ్వర్య రాయ్‌ని అనుకున్నారు. ఆమె ఓకే చెప్పింది. అంతా ఓకే అయ్యింది. కానీ చివరి నిమిషంలో హ్యాండిచ్చిందట. హిందీలో చేసిన సినిమాలు ఆడకపోవడంతో దీన్ని రిజెక్ట్ చేసింది. దీంతో ఆ స్థానంలో చాలా మంది హీరోయిన్లని అనుకున్నారు. ఫైనల్‌గా ప్రీతి జింటాని ఎంపిక చేశారు. 1998 అక్టోబర్‌ 30న విడుదలైన ఈ సినిమా సైతం ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. వెంకటేష్‌ కెరీర్‌లో మరో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.

55
సౌత్‌లోరెండు బ్లాక్‌ బస్టర్స్ మిస్‌ చేసుకున్న ఐష్‌

ఇలా ఐశ్వర్య రాయ్‌ సౌత్‌లో రెండు అసలైన బ్లాక్‌ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ని మిస్‌ చేసుకుంది. ఈ రెండు చిత్రాలను రిజెక్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేసింది. ఈ సినిమాలు సౌత్‌లో ఆమె కెరీర్‌నే మార్చేయగలిగే మూవీస్‌ కావడం విశేషం. ఒకవేళ చేసి ఉంటే ఇక్కడ స్టార్‌ హీరోయిన్‌గా రాణించేది. కానీ ఆ అవకాశాన్ని వదులుకుంది. హిందీకే పరిమితమయ్యింది. అయితే `నరసింహ`కి రిజెక్ట్ చేసినా ఆ తర్వాత రజనీతో `రోబో` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సైతం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories