ఇండియన్స్ కి ఆస్కార్‌ సర్‌ప్రైజ్‌.. అకాడమీ వేడుకలో మళ్లీ మెరిసిన `ఆర్‌ఆర్‌ఆర్‌`.. ఎలా అంటే?

First Published Mar 11, 2024, 12:07 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ మరోసారి ఆస్కార్‌ వేడుకలో సందడి చేసింది. అకాడమీ ఇండియన్స్ కి స్వీట్‌ సర్ప్రైజ్‌ చేసింది. ఊహించని సర్‌ప్రైజ్‌ ఏంటో ఓ లుక్కేయండి. 

 `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ ఆస్కార్‌ సాధించిన తొలి ఇండియన్‌ ఫీచర్‌ ఫిల్మ్ గా నిలిచిన విషయం తెలిసిందే. గతేడాది ఆస్కార్‌ అవార్డు వేడుకలో ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో `నాటు నాటు` పాటకిగానూ అకాడమీ అవార్డుని గెలుచుకుంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌ ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. దీని వెనకాల రాజమౌళి కృషి ఉందని చెప్పొచ్చు. 

ఇదిలా ఉంటే ఈ సారి ఆస్కార్‌ అవార్డు వేడుకలో మరోసారి మెరిసింది `ఆర్‌ఆర్‌ఆర్‌`. ఓ రకంగా ఆస్కార్‌.. మన ఇండియన్స్ కి స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా మరోసారి ఆస్కార్‌ వేడుకలో మెరిసింది. అదెలా సాధ్యం, ఎందుకు ఆ ప్రస్తావన వచ్చిందంటే.. స్టంట్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డుని ప్రకటించే క్రమంలో ప్రత్యేకంగా వరల్డ్ గ్రేటెస్ట్ స్టంట్‌ కొరియోగ్రాఫర్లకి నివాళ్లు అర్పించే క్రమంలో వరల్డ్ ది బెస్ట్ యాక్షన్‌ సీక్వెన్స్ క్లిప్పులతో ఓ ప్రోమోని తయారు చేశారు. 
 

ఇందులో `ఆర్‌ఆర్‌ఆర్‌` యాక్షన్‌ సీక్వెన్స్ ఉండటం విశేషం. పలు హాలీవుడ్‌, ఇంటర్నేషన్‌ బెస్ట్ మూవీస్‌ యాక్షన్‌ సీన్లతోపాటు `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని క్లైమాక్స్ లోని సీన్లని చూపించారు. బ్రిటీష్‌ కోటలోకి వెళ్లే సమయంలో ఎన్టీఆర్‌, తారక్‌ కలిసి చేసిన యాక్షన్‌ సీక్వెన్స్ ని చూపించారు. అలాగే క్లైమాక్స్ లో ఫారెస్ట్ భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ మారి బ్రిటీష్‌ సైనికులతో పోరాడే సీన్లని ఇందులో చూపించడం విశేషం. 
 

చివరగా `నాటు నాటు` పాటని ప్రదర్శించారు. ఇలా ఇండియన్‌ సినిమాని ఆస్కార్‌లో ప్రదర్శించడం ఇదే మొదటిసారిగా చెప్పొచ్చు. `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీకి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించారు. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా నిలిచిందీ మూవీ. సుమారు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొంది, 1150కోట్లు వసూలు చేసింది. ఈమూవీని డీవీవీ దానయ్య నిర్మించడం విశేషం. ఇందులో అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీర్‌, అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రల్లో మెరిశారు. 
 

ఇక 96వ అకాడమీ అవార్డులు మార్చి 10న లాస్‌ ఏంజెల్స్ లో డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. `ఓపెన్‌ హైమర్‌` మూవీ ఇందులో అత్యధికంగా ఏడు పురస్కారాలను సొంతం చేసుకుంది. 
 

click me!