వైజాగ్ నగరానికి పాన్ ఇండియా కళ.. బన్నీ, చరణ్ ఒకేసారి.. భలే కుదిరిందే

Published : Mar 11, 2024, 11:21 AM IST

వైజాగ్ నగరం అంటే టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు ఫేవరిట్ సిటీ. వైజాగ్ లో తమ చిత్రాల షూటింగ్ జరపాలని ప్రతి హీరో కోరుకుంటారు. అక్కడ బీచ్ వాతావరణం, ప్రకృతి అందాలు అంతలా ఆకర్షిస్తాయి.

PREV
16
వైజాగ్ నగరానికి పాన్ ఇండియా కళ.. బన్నీ, చరణ్ ఒకేసారి.. భలే కుదిరిందే

వైజాగ్ నగరం అంటే టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు ఫేవరిట్ సిటీ. వైజాగ్ లో తమ చిత్రాల షూటింగ్ జరపాలని ప్రతి హీరో కోరుకుంటారు. అక్కడ బీచ్ వాతావరణం, ప్రకృతి అందాలు అంతలా ఆకర్షిస్తాయి. తాజాగా మెగా ఫ్యామిలీ అభిమానులకు జోష్ తీసుకువచ్చే సంఘటన జరిగింది. 

26

మెగా ఫ్యామిలీకి చెందిన పాన్ ఇండియా హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్ ఒకేసారి వైజాగ్ లో సందడి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్ర షూటింగ్.. రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ ఒకేసారి వైజాగ్ లో షూటింగ్ జరుపుకోనున్నాయి. ఇది యాధృచ్చికంగా జరిగినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. 

36

ఇప్పటికే అల్లు అర్జున్ వైజాగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అభిమానులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో బన్నీకి ఘనస్వాగతం పలికారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వైజగ్ లో బన్నీపై సుకుమార్ కీలక సన్నివేశాలని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం అల్లు అర్జున్ వారం రోజుల పాటు విశాఖపట్నంలోనే ఉంటారు. 

46
Ram Charan

ఇక రాంచరణ్ కూడా గేమ్ ఛేంజర్ షూటింగ్ కోసం వైజాగ్ లో అడుగు పెట్టబోతున్నారు. అల్లు అర్జున్, రాంచరణ్ పాన్ ఇండియా క్రేజ్ వచ్చిన తర్వాత తొలిసారి తమ చిత్రాల షూటింగ్ వైజాగ్ లో చేస్తుండడంతో ఫ్యాన్స్ లో ఆ జోష్ మామూలుగా లేదు. 

56
Game Changer

చాలా కాలంగా గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఇకపై వేగం పెంచాలని డైరెక్టర్ శంకర్ కూడా భావిస్తున్నారు. ఆల్రెడీ శంకర్ పై, నిర్మాత దిల్ రాజుపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వైజాగ్ షెడ్యూల్ గేమ్ ఛేంజర్ కి పాజిటివ్ వైబ్స్ తీసుకువస్తుందని అంతా భావిస్తున్నారు. పాన్ ఇండియా పొలిటికల్ థ్రిల్లర్ గా శంకర్ ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

66

ఒకే నగరంలో షూటింగ్ జరుపుకుంటున్న బన్నీ, చరణ్ ఒకసారి కలుసుకుంటే ఫ్యాన్స్ కి అంతకి మించి కావాల్సిందేముంది. పుష్ప 2 ఆగష్టు లో రిలీజ్ అవుతుండగా.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు.  

Read more Photos on
click me!

Recommended Stories