అభిమానుల నిరీక్షణ ముగిసింది. యావత్ దేశం ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ నాలుగేళ్ల కష్టం వెండి తెరపై ఆవిష్కృతమైంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీమియర్ షోలు ప్రపంచ వ్యాప్తంగా మొదలయ్యాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యూఎస్, ఇతర ప్రాంతాల నుంచి సినిమాకు ట్విట్టర్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం.