Pooja Hegde with Naga Chaitanya: నాగచైతన్యతో వన్స్ మోర్ అంటున్న పూజా హెగ్డే..

Published : Mar 24, 2022, 08:05 PM IST

నాగచైతన్య సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే చాలా కాలం తరువాత చైతూతో మళ్లీ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. పాన్ ఇండియా  స్టార్ గా ఎదిగిన పూజా చైతూతో సినిమా చేయడం నిజమేనా..? 

PREV
16
Pooja Hegde with Naga Chaitanya: నాగచైతన్యతో వన్స్ మోర్ అంటున్న పూజా హెగ్డే..

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతోంది. పాన్ ఇండియా మూవీస్ తో పాటు.. లోకల్ సినిమాలు కూడా వదలకుండా చేస్తోంది. అటు హిందీలో కూడా తన వంతు ప్రయత్నం చేస్తోంది బ్యూటీ. చైతన్యతో కలిసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇఛ్చిన పూజా.. చాలా గ్యాప్ తరువాత చైతూతో వన్స్ మోర్ అంటోంది. 

26

రీసెంట్ గా  రాధేశ్యామ్ మూవీతో  ఆడియన్స్ ముందుకు వచ్చారు పూజ హెగ్డే. ప్యాన్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతానే.. బాలీవుడ్ లో కూడా తన మార్క్ కోసం ట్రై చేస్తోంది పూజా. తెలుగు,తమిళ భాషల్లో పూజా నటించిన సినిమాలు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి.  

36

అటు తమిళ్ లో కూడా స్టార్ హీరో విజయ్ సరసన బీస్ట్ మూవీలో నటించింది పూజా హెగ్డే. ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె విజయ్ జోడీగా అందాల సందడి చేయనుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాలో  చరణ్ జోడీగా పూజా హెగ్డే నటించింది.  ఈ సినమా అదే నెల 29న  రిలీజ్ కాబోతోంది.  
 

46

ఇక ఈ నేపథ్యంలో పూజా హెగ్డే తరువాతి సినిమా మహేశ్ బాబుతో చేయబోతోంది.  మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోయే సినిమాలో పూజా హీరోయిన్ గా నటించబోతోంది. అటు బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు చేస్తున్న పూజా మరిన్ని సినిమాలకోసం ప్రయత్నం చేస్తోంది.
 

56

తెలుగులో పూజ హెగ్డే ఫస్టు మూవీ నాగచైతన్యతోనే మొదలైంది. ఒక లైలా కోసం సినిమాతో పూజా తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేసింది. రాను రాను స్టార్ హీరోల సరసన అవకాశాలు సాధించిన పూజా.. స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

66

అయితే మరోసారి నాగచైతన్య తో వన్స్ మోర్ అనబోతుంది పూజా హెగ్డే. చాలా కాలం గ్యాప్ తరువాత చైతూతో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వెంకట్ ప్రభు రూపొందించనున్న సినిమాలో ఈ జంట మరోసారి కనువిందు చేయననుంది. 

Read more Photos on
click me!

Recommended Stories