సెకండ్ హాఫ్ కూడా ఎక్కడా సినిమా నెమ్మదించకుండా ప్రేక్షకుడిని తనతో పాటు తీసుకుపోతుంది. ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ సైతం ఊహకు మించి అంటున్నారు. కథలో మలుపలు , ఎమోషన్స్, ఎన్టీఆర్, చరణ్ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ గురించి సినిమా చూసిన ప్రేక్షకులు ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఇద్దరు హీరోలు నువ్వా నేనా అన్నట్లు నటించారనేది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం.