అచ్చు గుద్దినట్లు సీనియర్ ఎన్టీఆర్ లాగే యంగ్ టైగర్.. మేజర్ చంద్రకాంత్ మరోసారి కళ్ల ముందుకు..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 15, 2022, 11:22 AM IST

ఆర్ఆర్ఆర్ చిత్రానికి, మేజర్ చంద్రకాంత్ చిత్రానికి ఆసక్తికరమైన పోలిక ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.   

PREV
18
అచ్చు గుద్దినట్లు సీనియర్ ఎన్టీఆర్ లాగే యంగ్ టైగర్.. మేజర్ చంద్రకాంత్ మరోసారి కళ్ల ముందుకు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో జక్కన్న తనదైన శైలిలో ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు. సోమవారం రోజు ఆర్ఆర్ఆర్ టీం ఈ చిత్రంలోని 'ఎత్తర జెండా' అంటూ సాగే హుషారైన డాన్స్ నంబర్ రిలీజ్ చేసింది. 'పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమరవీరుల్ని తలచుకుంటూ' అంటూ రాజమౌళి వాయిస్ ఓవర్ తో ఈ సాంగ్ మొదలవుతుంది. 

28

ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర యోధులని కోడె గిత్తలతో పోల్చుతూ, వారిని స్మరించుకుంటూ సాగే పాట ఇది. స్వాతంత్ర సమరయోధుల గురించి అంటే.. అంతా ఎమోషనల్ గా భావిస్తారు. కానీ ఇది హుషారుగా సాగే గీతం. 

38

ఈ హుషారైన పాత్రలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నాటు నాటు తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్ మరోసారి పర్ఫెక్ట్ సింక్ లో డాన్స్ తో అదరగొట్టారు. వీరితో జతకట్టిన అలియా భట్ పాటకు కొత్త కళ తీసుకువచ్చింది. ఈ సాంగ్ లో రాంచరణ్, ఎన్టీఆర్ గెటప్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొన్ని గెటప్స్ లో ఎన్టీఆర్ ని చూస్తే వాళ్ళ తాతగారు సీనియర్ నందమూరి తారక రామారావు కళ్ళ ముందు మెదలాల్సిందే. 

 

48

రామారావు నటించిన మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని 'పుణ్యభూమి నా దేశం' సాంగ్ తో 'ఎత్తారు జెండా' సాంగ్ కి పోలికలు ఉన్నాయి. కాకపోతే అది ఎమోషనల్ గా సాగే గీతం.. ఇది హుషారుగా సాగే పాట. పుణ్యభూమి నాదేశం సొంత లో ఎన్టీఆర్ వివిధ స్వాతంత్ర సమరయోధుల గెటప్స్ లో కనిపించి అలరించారు. ఈ సాంగ్ లో కూడా ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ స్వాతంత్ర సమరయోధుల గెటప్స్ లో పూర్తిగా కనిపించకున్నా వారిని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. 

58

ఉదాహరణకు ఎత్తర జెండా సాంగ్ లో బ్యాగ్రౌండ్ లో సుభాష్ చంద్రబోస్ కనిపిస్తూ ఉంటారు. ఆయనకు యంగ్ టైగర్ నివాళి అర్పిస్తూ, కలకత్తా కోడె గిత్త అని కీర్తిస్తూ శాలువా కప్పుకుని కనిపిస్తాడు. ఈ గెటప్ లో ఎన్టీఆర్ ని చూస్తే వాళ్ళ తాతగారు గుర్తుకు రావాల్సిందే. అచ్చు గుద్దినట్లు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ లాగా  మారిపోయాడు. 

68

స్వాతంత్ర సమరయోధుడు విల్లియప్పన్ చిదంబరం పిళ్ళైకి నివాళి అర్పించే సమయంలో కూడా ఎన్టీఆర్ పంచె కట్టులో కనిపిస్తారు. ఈ గెటప్ లో కూడా ఎన్టీఆర్ తాతగారిని తలపించేలా ఉన్నారు. ఇలా ఒక్కొక్క స్వాతంత్ర సమరయోధులని స్మరించుకుంటూ సాగే ఈ పాటకు మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పుణ్యభూమి సాంగ్ కు చాలా పోలికలు ఉన్నాయి. 

78

రాజమౌళి ఎలాగూ.. రాఘవేంద్ర రావు శిష్యుడు. బహుశా ఈ సాంగ్ చిత్రీకరణ విషయంలో తన గురువుని ఫాలో అయ్యాడేమో. మేజర్ చంద్రకాంత్ చిత్రం రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. 

88

ఎత్తర జెండా సాంగ్ లో సుభాష్ చంద్రబోస్, చిదంబరం పిళ్ళై, ఛత్రపతి శివాజీ, టంగుటూరి ప్రకాశం పంతులు, సర్దార్ వల్లభాయ్ పటేల్, కిత్తూర్ రాణి చిన్నమ్మ, భగత్ సింగ్ పోరాట యోధుల్ని స్మరించుకున్నారు. 

click me!

Recommended Stories