Radhe Shyam: రాధే శ్యామ్ పై విమర్శలు.. ముందు నుంచి చెబుతూనే ఉన్నాం అంటూ డైరెక్టర్ అసహనం

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 15, 2022, 10:03 AM IST

ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం ఇటీవల విడుదలైంది. చాలా కాలం తర్వాత ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ప్రభాస్ నటించిన ప్రేమ కథ ఈ చిత్రం.   

PREV
16
Radhe Shyam: రాధే శ్యామ్ పై విమర్శలు.. ముందు నుంచి చెబుతూనే ఉన్నాం అంటూ డైరెక్టర్ అసహనం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు.  చాలా రోజుల తర్వాత ప్రభాస్ నటించిన ప్రేమ కథ కావడంతో రాధేశ్యామ్ పై కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా విడుదలయ్యాక మిక్స్డ్ టాక్ మొదలైంది.

 

26

కొందరు ప్రేక్షకులు సినిమా బావుందని ప్రశంసించగా.. మరికొందరు మూవీ స్లోగా ఉందని, ప్రభాస్ లాంటి హీరోని పెట్టి ఫైట్స్, కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేవని విమర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాధే శ్యామ్ చిత్రానికి పర్వాలేదనిపించే వసూళ్లు నమోదవుతున్నాయి. నార్త్ లో మాత్రం రాధే శ్యామ్ చిత్రానికి ఊహించని పరిస్థితి ఎదురవుతోంది. 

36

నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సాహో నార్త్ లో వసూళ్ల వర్షం కురిపించింది. అలాంటిది ఫీల్ గుడ్ మూవీ అయిన రాధే శ్యామ్ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్స్ వస్తాయని ఆశించారు. కానీ పరిస్థితి అలా లేదు. ఇటీవల జరిగిన రాధే శ్యామ్ సక్సెస్ మీట్ లో నెగిటివ్ టాక్ పై చిత్ర దర్శకుడు రాధాకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. 

46

రాధే శ్యామ్ మూవీ ప్రేమకథా చిత్రం అని ముందు నుంచి చెబుతూనే ఉన్నాము. వెజిటేరియన్ హోటల్ కి వెళ్లి చికెన్ బిర్యానీ అడిగితే ఎలా ? ఇది ఇంటెన్స్ లవ్ స్టోరీ.. ఈ చిత్రం నుంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా ఆశిస్తారు అంటూ రాధా కృష్ణ మండిపడ్డారు. 

56

ఈ చిత్రంలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడిగా నటించారు. ప్రపంచంలోని ఎంతటి వారి జాతకాన్ని అయినా చేతి గీతలు చూసి ఇట్టే చెప్పేయగలడు. అలాంటి వ్యక్తి జీవితంలో ప్రేమ ఎదురైతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదే ఈ చిత్ర కథ. మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ బి అండ్ సి సెంటర్స్ లో మిక్స్డ్ టాక్ మూటగట్టుకుంటోంది. 

66

పూజా హెగ్డే ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా నటించింది. సీనియర్ నటి భాగ్యశ్రీ, జగపతి బాబు, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. బాహుబలి తర్వాత పెరిగిన అంచనాల నేపథ్యంలో ప్రభాస్ సినిమాలు భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్నాయి. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ నుంచి సలార్ చిత్రం రాబోతోంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. 

Read more Photos on
click me!

Recommended Stories