అప్పుడు దాచిన రహస్యం... సోషల్ మీడియాలో సంచలనంగా హీరోయిన్ శ్రియ శరన్ బేబీ బంప్ ఫోటో!

Published : Apr 11, 2023, 11:05 AM IST

హీరోయిన్ శ్రియ శరన్ పాత జ్ఞాపకాలు పంచుకున్నారు. 2021 లో నిండు గర్భిణిగా ఉన్న ఫోటో పోస్ట్ చేశారు. అప్పట్లో శ్రియ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిన నేపథ్యంలో ఈ ఫోటో ప్రాధాన్యత సంతరించుకుంది.    

PREV
16
అప్పుడు దాచిన రహస్యం... సోషల్ మీడియాలో సంచలనంగా హీరోయిన్ శ్రియ శరన్ బేబీ బంప్ ఫోటో!
Shriya Saran


స్టార్ లేడీ శ్రియ శరన్ ప్రెగ్నెన్సీ   విషయం దాచిన విషయం తెలిసిందే. కెరీర్ కొంచెం నెమ్మదించాక 2018లో రష్యాకు చెందిన ఆండ్రీని శ్రియ పెళ్లి చేసుకున్నారు. సడన్ గా తనకు కూతురు ఉన్నట్లు చెప్పి బాంబు పేల్చింది. శ్రియ అసలు గర్భవతి ఎప్పుడయ్యారని ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. 

26
Shriya Saran


2021 జనవరి 10న శ్రియకు అమ్మాయి పుట్టింది. ఈ విషయాన్ని ఆమె 10 నెలల తర్వాత 2021 అక్టోబర్ లో తెలియజేశారు. లాక్ డౌన్ సమయంలో శ్రియ గర్భం దాల్చారు. 2020లో ఏడాది పాటు పూర్తిగా లాక్ డౌన్ నడిచింది. షూటింగ్స్, మీటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. ప్రొఫెషన్ కి కూడా బ్రేక్ వచ్చిన నేపథ్యంలో శ్రియ తన ప్రెగ్నెన్సీ  రివీల్ చేయలేదు. రహస్యంగా బిడ్డను కన్నారు.పెళ్లైన శ్రియ గర్భవతి అయిన విషయం దాచాల్సిన అవసరం ఏమొచ్చిందని అభిమానులు మదన పడ్డారు. 
 

36
Shriya Saran

శ్రియ దీనికి ఊహించని సమాధానం చెప్పారు. గర్భం దాల్చడం వలన శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా బరువు పెరిగి లావు కావచ్చు. బరువు పెరగడం అనేది సామాన్యులకు చిన్న విషయమే. కానీ సెలబ్రిటీల విషయంలో దాన్ని భిన్నంగా చూస్తారు. ప్రెగ్నెన్సీ, డెలివరీ కారణంగా నేను లావైతే బాడీ షేమింగ్ కి గురి కావచ్చు. అవన్నీ మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి.

46
Shriya Saran


బాడీ షేమింగ్, సోషల్ మీడియా ట్రోలింగ్ కి భయపడి నేను ప్రెగ్నెన్సీ  విషయం బయటకు చెప్పలేదు. నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి అనుకున్నాను.. అంటూ శ్రియ వివరణ ఇచ్చారు. అప్పుడు గర్భిణిగా ఉన్నపుడు దిగిన ఫోటో తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అది వైరల్ అవుతుంది. 

56


స్టార్ హీరోయిన్ గా శ్రియ హైట్స్ చూశారు. రెండు తరాల సూపర్ స్టార్స్ తో నటించిన ఘనత శ్రియ సొంతం.  ప్రస్తుతం తెలుగులో శ్రియ అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు.అయితే ఆమెకు బాలీవుడ్ లో వయసుకు తగ్గ పాత్రలు రావడం విశేషం. సీనియర్ స్టార్స్ పక్కన ఆమెకు ఆఫర్స్ దక్కుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీలో శ్రియ నటుడు అజయ్ దేవ్ గణ్ భార్యగా తళుక్కున మెరిశారు. దృశ్యం 2 (హిందీ) లో మరోసారి జతకట్టారు. 

66

కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేశారు. గొప్ప డాన్సర్ అయిన శ్రియ అప్పట్లో అబ్బాయిల కలల రాణిగా వెలిగిపోయారు. ఇటీవల శ్రియ ప్రధాన పాత్రలో గమనం టైటిల్ తో మూవీ విడుదలైంది.గమనం చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం విశేషం. నటన పరంగా కూడా అద్భుతం చేయగల శ్రియ మరికొంత కాలం నటించాలని, అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
 

click me!

Recommended Stories