కాజల్ అగర్వాల్ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. లాంగ్ కెరీర్ అనుభవిస్తున్న ఈ తరం హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. వివాహమైనా కూడా ఆమెకు డిమాండ్ తగ్గలేదు.
211
Kajal Aggarwal
లక్ష్మీ కళ్యాణం మూవీతో కాజల్ అగర్వాల్ హీరోయిన్ అయ్యారు. దర్శకుడు తేజా ఆమెను పరిశ్రమకు పరిచయం చేశారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం అంతగా ఆడలేదు.
311
Kajal Aggarwal
దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ మూవీతో మొదటి హిట్ అందుకుంది. మగధీర మూవీతో స్టార్ హీరోయిన్ అయ్యారు. చిరంజీవి కాజల్ ని వద్దని అన్నారట. చిరంజీవిని రాజమౌళి కన్విన్స్ చేసి కాజల్ కి మగధీర ఛాన్స్ ఇచ్చాడట.
411
Kajal Aggarwal
మగధీర అనంతరం కాజల్ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అయ్యారు. టాప్ స్టార్స్ పక్కన నటించారు. బాలీవుడ్ లో కూడా చిత్రాలు చేశారు.
511
Kajal Aggarwal
కెరీర్ స్వింగ్ లో ఉండగానే కాజల్ వివాహం చేసుకున్నారు. 2020 అక్టోబర్ నెలలో కాజల్ తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి.
611
Kajal Aggarwal
ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. పెళ్ళికి ముందు ఒప్పుకున్న భారతీయుడు 2 మూవీ పూర్తి చేస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
711
Kajal Aggarwal
కాజల్ చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ బాలయ్య 108వ చిత్రం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ మేరకు యూనిట్ అధికారిక ప్రకటన చేశారు.
811
Kajal Aggarwal
కెరీర్లో ఫస్ట్ టైం ఆమె బాలయ్యతో జతకడుతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక రోల్ చేస్తుంది.
911
Kajal Aggarwal
ఇటీవల కాజల్ బాలీవుడ్ మీద ఆరోపణలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో విలువలు, నైతికత లేదన్నారు. నేను ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ సౌత్ పరిశ్రమ ఆదరించింది అన్నారు.
1011
Kajal Aggarwal
సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమల్లో మంచి వాతావరణం ఉంది. అందుకే అక్కడ గొప్ప చిత్రాలు, నటులు, టెక్నిషియన్స్ తయారవుతున్నారని అన్నారు. మరో హీరోయిన్ ప్రియాంక చోప్రా సైతం ఇదే అభిప్రాయం వెల్లడించారు.
1111
Kajal Aggarwal
కాజల్ అగర్వాల్ సమ్మర్ వేర్లో గ్లామరస్ ఫోటో షూట్ చేశారు. పలుచనైన వదులాటి బట్టల్లో పరువాల విందు చేశారు. కాజల్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.