ఈరోజు ఎపిసోడ్లో అయినా అంత కంగారుగా అడుగుతావేంటి అని విక్రమ్ అనగా ఇక్కడ నా పరిస్థితి నీకేం తెలుసు స్వామి పొరపాటున కొరియర్ మా వాళ్ళ చేతిలో పడింది అనుకో అనగా అమ్మో ఇంకా ఏమైనా ఉందా గొడవలు జరిగిపోతాయి అని అంటాడు విక్రమ్. అది నీకు నాకు మాత్రమే సంబంధించిన విషయం అని అంటాడు. 10 సెకండ్లు అయిపోయింది నేను చెప్పాల్సింది. అయిపోయింది బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్. అప్పుడు మా ప్రేమ్ అన్నయ్య పొరపాటున చూశాడంటే నా పని అయిపోతుంది అనుకుంటూ టెన్షన్ గా ఉంటుంది దివ్య.