సీన్‌ సీన్‌కు ఉత్కంఠ, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లు, ఓటీటీలో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్

Published : Jul 29, 2025, 04:55 PM IST

క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే ఆడియన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి ఓటీటీలోకి వచ్చేసింది ఓమూవీ. సస్పెన్స్ తో పాటు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లతో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో రెడీగా ఉంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎక్కడ చూడవచ్చు.

PREV
15

పని ఒత్తిడిలోంచి కాస్త విరామం లభించినప్పుడు ఓటీటీ వేదికగా మంచి సినిమాలు చూడాలని ఆలోచించే ప్రేక్షకుల కోసం తాజాగా మలయాళ థ్రిల్లర్ మూవీ ఒకటి ట్రెండింగ్ లో ఉంది. ఈమూవీ మరేదో కాదు ‘రోంత్’. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా హాట్‌స్టార్‌ ఓటీటీలో ప్రసారం అవుతోంది.

25

రోంత్ సినిమా 2025 జూన్ 13న థియేటర్లలో విడుదలైది. చాలా తక్కువ బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈసినిమా ఆడియన్స్ లో మంచి పేరును సంపాదించుకుంది. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టిన ఈసినిమా. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 9 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ మూవీ ఓటీటీ లో కూడా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది.

35

2 గంటల 2 నిమిషాల నిడివి కలిగిన ఈసినిమా ఫస్ట్ 10మినిట్స్ నుంచే ఉత్కంఠకు దారి తీసే విధంగా కథ నడుస్తుంది. ఒకే రాత్రి జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రూపుదిద్దుకుంది. సినిమా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది.‘రోంత్’ సినిమాను వినీత్ జైన్, రతీష్, రెంగిత్ ఈవీఎం, జోజో జోస్ నిర్మించారు. దీనికి షాహి కబీర్ దర్శకత్వం వహించారు.

45

ఇక రోషన్ మ్యాథ్యూ, దిలీష్, లక్ష్మీ మీనన్, కృష కురుప్, రోషన్ అబ్దుల్, రాజేష్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈసినిమాకు అనిల్ జాన్సన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమాకు సంబంధించిన టెక్నికల్ డిపార్ట్‌మెంట్ కూడా తమ పనితనంతో సినిమాకు ప్రాణం పోశారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే, ఇంటెన్స్ ఎమోషన్స్, ఆకట్టుకునే నటన ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.

55

IMDB వేదికపై ఈ చిత్రానికి 7.4 రేటింగ్ లభించింది. ‘రోంత్’ సినిమా మలయాళం మాత్రమే కాకుండా తెలుగు, హిందీ భాషలలో కూడా అందుబాటులో ఉంది, అందువల్ల ఇతర భాషల్లో కూడా ఈసినిమాకు మంచి ఆదరణల లభించింది. నిజానికి చిన్న బడ్జెట్‌ సినిమాగా రూపొందినప్పటికీ, కథ, దానికి ఇచ్చిన ట్రీట్‌మెంట్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.

Read more Photos on
click me!

Recommended Stories