విశ్లేషణ : దర్శకుడు పూరి తనయుడు కాబట్టి ఆకాష్ పూరిపై అందరి ఫోకస్ ఉంటుంది. తన మొదటి చిత్రంతో పోల్చుకుంటే ఆకాష్ ఈ మూవీలో మెచ్యూరిటీ ప్రదర్శించాడు. చలా సన్నివేశాలు ఆకాష్ పెర్ఫామన్స్ తో హైలైట్ గా మారాయి. ఆకాష్ ప్రతి డైలాగ్ డెలివరీలో కాన్ఫిడెన్స్ కనిపించింది. సినిమా ప్రధానంగా ఆకాష్ భుజాలపై సాగినట్లుగా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ కేతిక శర్మ తన గ్లామర్ తో ఈ చిత్రం ద్వారా చాలా మంది అభిమానులని సొంతం చేసుకోవడం ఖాయం. యువతలో ఆమె క్రేజ్ పెరుగుతుంది. నటన కూడా డీసెంట్ గానే ఉంది. ఇక రమ్య కృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా నటించింది. రమ్యకృష్ణ నటన ఈ చిత్రంలో మరో హైలైట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ ఎంగేజింగ్ గా , ఆకట్టుకునే విధంగా ఉండడం ఈ చిత్రాన్ని మరో బలం అని చెప్పొచ్చు. ఆకాష్, కేతిక మధ్య ప్రేమ కూడా ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఇక ఈ చిత్రంలో నెగిటివ్స్ మాట్లాడుకుంటే.. రొమాంటిక్ అనే టైటిల్ ఈ చిత్రానికి యాప్ట్ కాదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని నిమిషాలు, సెకండ్ హాఫ్ లో కొన్ని నిమిషాలు మినహా రొమాన్స్ ఎక్కడా కనిపించదు. మొత్తం యాక్షన్ సన్నివేశాలే ఉంటాయి. ఆకాష్ తన ఏజ్ కు మించిన పాత్ర పోషించినట్లుగా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ విషయంలో హీరో ప్రవర్తించే విధానం, కొన్ని సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏమాత్రం మింగుడు పడని విధంగా ఉంటాయి.