Roja Birthday pics: తనకంటే పెద్దదైన కేక్‌తో `జబర్దస్త్` రోజా బర్త్ డే సెలబ్రేషన్‌.. సిగ్గులు మొగ్గేసిందిగా..

Published : Nov 18, 2021, 05:39 PM IST

నటి రోజా ఇప్పుడు `జబర్దస్త్` రోజాగా మారిపోయింది. హీరోయిన్‌గా అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి హీరోయిన్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రోజు పుట్టిన రోజు జరుపుకున్నారు. ఇప్పుడు ఆమె పుట్టిన రోజు సెలబ్రేషన్‌కి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.   

PREV
111
Roja Birthday pics: తనకంటే పెద్దదైన కేక్‌తో `జబర్దస్త్` రోజా బర్త్ డే సెలబ్రేషన్‌.. సిగ్గులు మొగ్గేసిందిగా..

నటిగా, ఎమ్మెల్యేగా, `జబర్దస్త్` షోకి జడ్జ్ గా సేవలందిస్తున్నారు రోజా. నిత్యం అటు ప్రజల్లో, మరోవైపు టీవీ షోస్‌తో ఆడియెన్స్ కి దగ్గరవుతున్నారు. జనంలో ఉంటున్నారు. హీరోయిన్‌ నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన ఆమె బుధవారం పుట్టిన రోజు జరుపుకున్నారు. తన 49వ బర్త్ డేని కుటుంబ సభ్యులు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో గ్రాంగ్‌గా నిర్వహించారు. ఈసందర్బంగా దిగిన బర్త్ డే పిక్స్ ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది రోజా. ప్రస్తుతం ఇవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  roja birthday celabration photos

211

రోజా ఇందులో తనకంటే హైట్‌ ఎక్కువున్న కేక్‌ని కట్‌ చేయడం విశేషం. ఈ కేక్‌ హైలైట్‌గా నిలిచింది. మరోవైపు డెకరేషన్‌లో భాగంగా వేసిన ప్లవర్‌ ని పట్టుకుని రోజా ఇచ్చిన పోజులు ఆకట్టుకుంటున్నాయి. roja birthday celabration photos

311

బర్త్ డే వేడుకలో భర్త, దర్శకుడు సెల్వమణి, కూతురు అన్షు మాలికా, కుమారుడు కౌశిక్‌ పాల్గొన్నారు. వీరితోపాటు తన పిల్లల ఫ్రెండ్స్, అలాగే దగ్గరి కుటుంబ సభ్యులు రోజా బర్త్ డే వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఆద్యంతం కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ రోజా బర్త్ డే పిక్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. 
 

411

రాజకీయాల్లో ఓ ఫైర్‌ బ్రాండ్‌గా ఉన్న రోజా 1972 నవంబర్‌ 17న తిరుపతిలో జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీలతా రెడ్డి. సినిమాల్లోకి వచ్చాక రోజాగా పేరు మార్చుకున్నారు. పొలిటికల్‌ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన రోజా కుచిపూడి డాన్స్ నేర్చుకుంది. సినిమాల్లోకి ఎంటర్‌ అవడానికి ముందు ఆమె నాట్యకారిణిగా పలు షోస్‌ ఇచ్చారు. 
 

511

రోజా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి రాజేంద్రప్రసాద్‌ నటించిన `ప్రేమ తపస్సు` చిత్రంతో నటిగా మారింది. అనంతరం తమిళంలోకి అడుగుపెట్టి దర్శకుడు ఆర్‌. కె సెల్వమణి దర్శకత్వం వహించిన `చెంబరుతి` చిత్రంలో నటించింది. ఇందులో ఆమె ప్రశాంత్‌తో కలిసి నటించడం విశేషం. శరత్‌ కుమార్‌తో `సూరియన్‌` చిత్రంతో మరో విజయాన్ని అందుకుంది. 

611

ఇలా తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజా మలయాళంలో మమ్ముట్టి, తమిళంలో రజనీకాంత్‌ వంటి అగ్ర హీరోలతో కలిసి నటించి స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. రజనీతో `వీరా` సినిమాలో అదరగొట్టింది. అర్జున్‌తో `అయుధ పూజై` చిత్రంలో నటించింది.

711

ఇక తెలుగులో `ముఠామేస్త్రీ`, `ముగ్గురు మొనగాళ్లు`, `భైరవ ద్వీపం`,`బొబ్బిలి సింహం`, `అన్నమయ్య`, `అన్నా`, `పెద్దన్నయ్యా`, `క్షేమంగా వెళ్లి లాభంగా రండి`, `శుభలగ్నం`, `శ్రీ కృష్ణార్జున విజయం` వంటి  విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళంతోపాటు కన్నడ, మలయాళంలోనూ నటించి మెప్పించింది రోజా. 

811

హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. అదే సమయంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారి `అరసు`, `పారిజాతం`, `శంభో శివ శంభో`, `గోలీమార్‌`, `మొగుడు`, `కోడిపుంజు`, `వీరా` వంటి చిత్రాల్లో నటించి అదరగొట్టింది. పలు నెగటివ్‌ రోల్స్ కూడా చేసి మెప్పించింది. 

911

1999లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంది. 2009లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయింది. అనంతరం వైసీపీలో చేరింది. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందింది. రెండేళ్ల క్రితం జరిగిన మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి విజయం సాధించింది.
 

1011

ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతూనే పాపులర్‌ కామెడీ షో `జబర్దస్త్`కి జడ్జ్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో విజయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు అడపాదడపా ఇతర షోల్లోనూ మెరుస్తుంది రోజా. 

1111

`జబర్దస్త్` రోజా బుధవారం తన 49వ పుట్టిన రోజుని జరుపుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా, అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి. roja birthday celabration photos

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories