దివంగత నటి సౌందర్య తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువైన నటి స్నేహ. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. వివాహం తర్వాత కూడా స్నేహ నటన కొనసాగిస్తోంది. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో స్నేహ ఆచితూచి అడుగులు వేస్తోంది.
ప్రముఖ నటుడు ప్రసన్నని Snehaవివాహం చేసుకుని చెన్నైలో సెటిల్ అయింది. స్నేహ, Prasanna దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. ఆమె జీవితం హ్యాపీగా సాగిపోతోంది. ఇదిలా ఉండగా తాజాగా స్నేహకు చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు వ్యాపార వేత్తల నుంచి ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
తాజాగా స్నేహ వారిద్దరిపై చెన్నైలోని కానత్తూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా ఫిర్యాదులో స్నేహ సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వ్యాపార వేత్తలు ఇద్దరూ ఎక్స్ పోర్ట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. చాలా రోజుల నుంచి స్నేహ కూడా ఈ కంపెనీలో డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. స్నేహ చెల్లించిన డబ్బుకు ఇంతవరకు తనకు రిటర్న్స్ ఇవ్వలేదట. ఇప్పటి వరకు స్నేహ 26 లక్షల డబ్బు ఇన్వెస్ట్ చేయగా దానిపై ఒక్క రూపాయి కూడా తనకి రిటర్న్స్ రూపంలో చెల్లించలేదని పేర్కొంది.
దీనితో స్నేహ తన డబ్బుని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని వారిని డిమాండ్ చేసింది. కానీ సదరు వ్యాపార వేత్తలు స్నేహపై బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. దీనితో స్నేహ ఇద్దరిపై కేసు నమోదు చేసింది. స్నేహ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
స్నేహ చివరగా రాంచరణ్ వినయ విధేయ రామ చిత్రంలో వదిన పాత్రలో నటించింది. 40 ఏళ్ల స్నేహ ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ తనదైన ముద్ర వేసింది. ఆ టైంలో అలాంటి చిత్రాలకు స్నేహ మాత్రమే దర్శకుల ఛాయిస్.