తరుణ్‌ ఆర్తి అగర్వాల్‌ని ప్రేమించి ఉంటే పెళ్లి చేసుకునేవాడు.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన హీరో తల్లి

Published : Jun 20, 2025, 08:13 PM ISTUpdated : Jun 20, 2025, 10:06 PM IST

లవర్‌ బాయ్‌ తరుణ్‌, హీరోయిన్‌ ఆర్తి అగర్వాల్‌కి సంబంధించిన ప్రేమ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ ఇందులోని మరో కోణం బయటపెట్టింది తరుణ్‌ తల్లి రోజా రమణి. 

PREV
16
లవర్‌ బాయ్‌గా టాలీవుడ్‌ని ఊపేసిన తరుణ్‌

లవర్ బాయ్‌గా టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన తరుణ్‌ ఇప్పుడు సినిమాలు మానేశాడు. చాలా కాలంగా ఆయన సినిమాలు చేయడం లేదు. ఆ మధ్య మళ్లీ కమ్‌ బ్యాక్ అవుతానని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. అదే సమయంలో ఇండస్ట్రీ కూడా తరుణ్‌ వైపు చూడటమే మానేసింది. 

పబ్లిక్‌గా, సోషల్‌ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా లేకపోవడంతో ఆయన్ని జనాలు కూడా మర్చిపోయే పరిస్థితి వస్తోంది. అయితే ఒకప్పుడు మాత్రం లవ్‌ స్టోరీస్‌తో వరుసగా బ్లాక్‌ బస్టర్స్ అందుకున్నారు. స్టార్‌ హీరోగా రాణించారు. అప్పట్లో తరుణ్‌ సినిమాలు వచ్చాయంటే యూత్‌ ఎగబడి చూసేవారు. 

అమ్మాయిల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉండేది. అంతగా ఆకట్టుకున్న తరుణ్‌ ఆ తర్వాత హీరోగా నిలబడలేకపోయారు. ఎక్కువగా లవ్ స్టోరీస్‌ చేయడంతో అవి రొటీన్‌ అయిపోయాయి. దీంతో మార్పు కోసం ఒకటి రెండు చిత్రాల్లో యాక్షన్‌ కూడా ట్రై చేశాడు, కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. 

దీంతో సినిమాలే మానేశాడు తరుణ్‌. ఆ మధ్య సెలబ్రిటీ క్రికెట్‌ లీడ్‌ సమయంలో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ, తాను కమ్‌ బ్యాక్‌ అవడానికి సన్నాహాల్లో ఉన్నట్టు తెలిపారు. మరి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడో చూడాలి.

26
తరుణ్‌, ఆర్తి అగర్వాల్‌ ప్రేమలో కొత్త కోణం

 ఇదిలా ఉంటే తరుణ్‌ సినిమాలతోపాటు లవ్‌ స్టోరీ విషయంలోనూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆయన హీరోయిన్‌ ఆర్తి అగర్వాల్‌తో కలిసి రెండు సినిమాలు `నువ్వు లేక నేను లేను`, `సోగ్గాడు` చేశారు. ఇందులో `నువ్వు లేక నేను లేను` మూవీ పెద్ద విజయం సాధించింది.

 ఈ మూవీతోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారిందని సమాచారం. ఇద్దరూ చాలా కాలం ప్రేమించుకున్నారని, వీరి ప్రేమనే ఇద్దరి కెరీర్ లు డిస్టర్బ్ కావడానికి కారణమని ప్రచారం జరుగుతుంటుంది. ఇప్పటికీ అదే ప్రచారంలో ఉంది. 

ఈ క్రమంలో తరుణ్‌ తల్లి, ఒకప్పటి హీరోయిన్‌ రోజా రమణి చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. తరుణ్‌ ప్రేమ గురించి ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ షాకిస్తుంది. చాలా ఇంటర్వ్యూలలో ఆమె ఆచితూచి సమాధానం చెప్పింది. అలాంటిది ఏదీ లేదని చెబుతూ వచ్చింది. 

కానీ ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఓపెన్‌ అయ్యింది. అసలు విషయాలను బయటపెట్టింది. తరుణ్‌ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారని యాంకర్‌ ప్రశ్నించారు. దీనికి రోజా రమణి స్పందించారు. తరుణ్‌, ఆర్తి అగర్వాల్‌ లవ్‌ స్టోరీకి సంబంధించిన కొత్త విషయాన్ని ఆమె బయటపెట్టారు.

36
తరుణ్‌, ఆర్తి అగర్వాల్‌ ప్రేమపై రోజా రమణి షాకింగ్‌ కామెంట్‌

రోజా రమణి దాదాపు ఏడేళ్ల క్రితం ఐడ్రీమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పింది. తరుణ్‌, హీరోయిన్‌ ప్రేమించుకున్నది నిజం కాదని, వాళ్లు పెళ్లి వరకు వెళ్లారనే దాంట్లో నిజం లేదని తెలిపారు. ఆ సమయంలో బయట రూమర్లు బాగా విస్తరించిన నేపథ్యంలో ఇది బయటకు చాలా సీరియస్‌గా వెళ్తుందని తనకు అనిపించిందట. 

తరుణ్‌ని ఇదే విషయం అడిగిందట. దీనికి ఆయన సమాధానంగా `పెళ్లి చేసుకోవాలనుకుంటే మేం చెబుతాం కదా మమ్మీ` అని అన్నాడట. ఈ విషయాన్ని రోజా రమణి ప్రస్తావిస్తూ, ఆ సమయంలో తరుణ్‌, ఆ హీరోయిన్‌ మేజర్‌గానే ఉన్నారు, నిజంగానే ప్రేమించుకున్నారనుకుంటే, పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్లు వెళ్లిపోయి పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎవరు ఆపారు? 

తరుణ్‌, ఆర్తి అగర్వాల్‌ కలిసి రెండు చిత్రాల్లోనే నటించారు.  అలా అనుకుంటే శ్రియాతో నాలుగు సినిమాలు చేశాడు తరుణ్‌. ఆమె కూడా తరుణ్‌కి చాలా క్లోజ్‌గా ఉంటుంది. ఆర్తి అగర్వాల్‌ని అయితే నేను ఎక్కువ కలవలేదు, కేవలం రెండు సార్లు మాత్రమే కలిశాను. 

ఒకసారి `నువ్వు లేక నేను లేను` ఆడియో ఫంక్షన్‌లో, ఆ తర్వాత వంద రోజుల ఫంక్షన్‌లోనే కలిశాను. ఆ రెండుసార్లు కూడా చాలా స్వీట్‌గా ఉండేది, పెద్దగా వాయిస్‌ కూడా వచ్చేది కాదు. అయినా కలిసి నటించినప్పుడు రూమర్స్ కామన్‌గా వస్తుంటాయి` అని చెప్పింది రోజా రమణి.

46
పెళ్లి చేసుకుంటానని తరుణ్ ఎప్పుడూ నన్ను అడగలేదు

ఆమె ఇంకా వివరిస్తూ, పెళ్లి చేసుకోవాలనుకున్నారనే రూమర్‌ వచ్చినప్పుడు తరుణ్‌ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మ్యారేజ్‌ ఏంటి మమ్మీ అని నన్నేఅడిగాడు. నిజంగానే వారు పెళ్లి చేసుకోవాలనుకుంటే హాయిగా లేచిపోయి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంటే పేరెంట్స్‌ ని అడగొచ్చు. 

కానీ ఈ రెండూ చేయలేదు. మేం అభ్యంతరం చెబితే వాళ్లు చేసుకోవచ్చుగా?. నిజంగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే తరుణ్‌ నన్ను అడిగి ఉండొచ్చు. కానీ ఆయన ఎప్పుడూ నన్ను అడగలేదు. ఇలాంటి రూమర్‌ వచ్చినప్పుడు వాళ్లు కలిసి యాక్ట్ చేయలేదు. దూరంగా ఉన్నారు. 

కొన్ని రోజులకు ఆమె పెళ్లి కూడా చేసుకుందన్నారనే వార్తలు వచ్చాయి, యూఎస్‌ వెళ్ళిపోయిందన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ సినిమా చేస్తుందన్నారు. ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడుతుందన్నారు, సడెన్‌గా చనిపోయినట్టు చెప్పారు. ఈ విషయంలో చాలా బాధగా అనిపించింది` అని తెలిపింది రోజా రమణి.

56
ఆర్తి అగర్వాల్‌ ఆసుపత్రిలో చేరడానికి కారణం తరుణ్‌ కాదు

ఆర్తి అగర్వాల్‌ ఆసుపత్రిలో చేరడానికి కారణం తరుణే అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో దీనిపై రోజా రమణి స్పందిస్తూ, ఆమె ఆసుపత్రిలో చేరడానికి కారణం వేరే. అది ఏంటనేది అందరికి తెలిసిందే. కానీ తరుణ్‌తో ప్రేమ వ్యవహారమే కారణమనేది మెయిన్‌ రీజన్‌ కాదు` అని తెలిపింది.

సినిమాలు లేక, సక్సెస్‌ లేక, ఫ్యామిలీలో ఇబ్బందుల వల్ల ఆర్తి అగర్వాల్‌ డిప్రెషన్‌లోకి వెళ్లిందనే మరో వాదన కూడా ఉన్న నేపథ్యంలో రోజా రమణి పరోక్షంగా ఆ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఆ తర్వాత ఆర్తి అగర్వాల్‌ బరువు తగ్గేందుకు సర్జరీ చేయించుకుంది. కానీ ఇది వికటించిందని, దీని కారణంగానే ఆమెకి హార్ట్ ఎటాక్‌ వచ్చిందని అంటారు.

 ఏదేమైనా ఆర్తి అగర్వాల్‌ లాంటి మంచి టాలెంటెడ్‌ హీరోయిన్‌ అతి తక్కువ ఏజ్‌లోనే కన్నుమూయడం విచారకరం. తన కెరీర్‌ని ఆమెనే నాశనం చేసుకుందని సినీ వర్గాలు చెబుతుంటాయి.

66
తెలుగులో అందరు సూపర్‌ స్టార్లతో నటించిన ఆర్తి అగర్వాల్‌

ఆర్తి అగర్వాల్‌ 2001లో `నువ్వు నాకు నచ్చావ్‌` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో వెంకటేష్‌కి జోడీగా చేసింది. తొలి చిత్రమే వెంకీ లాంటి స్టార్‌ హీరోతో నటించే ఛాన్స్ రావడం ఓ విశేషమైతే, ఇది అప్పట్లో పెద్ద బ్లాక్‌ బస్టర్‌ కావడం మరో విశేషం. 

దీంతో ఆర్తి అగర్వాల్‌ మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్‌ అయ్యింది. ఆ వెంటనే ఆమె తరుణ్‌తో `నువ్వు లేక నేను లేను` చేసింది. ఇది కూడా పెద్ద హిట్‌ అయ్యింది. ఇక వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.

 జూ ఎన్టీఆర్‌తో `అల్లరి రాముడు`, చిరంజీవితో `ఇంద్ర`, ఉదయ్‌ కిరణ్‌తో `నీ స్నేహం`, మహేష్‌ బాబుతో `బాబీ`, బాలకృష్ణతో `పల్నాటి బ్రహ్మనాయుడు`, వెంకటేష్‌తో `వసంతం`, రవితేజతో `వీడే`, నాగార్జునతో `నేనున్నాను`, ప్రభాస్‌తో `అడవి రాముడు`, వెంకటేష్‌తోనే `సంక్రాంతి`, తరుణ్‌తో `సోగ్గాడు`, సునీల్‌తో `అందాల రాముడు`, రాజశేఖర్‌తో `గోరింటాకు`, వేణు తొట్టెంపూడితో `దీపావళి` వంటి చిత్రాలు చేసింది.

 పవన్‌ కళ్యాణ్‌ తో తప్ప, దాదాపు అందరు స్టార్‌ హీరోలతోనూ కలిసి నటించింది. మంచి విజయాలు అందుకుంది. చివరగా ఆమె 2010లో `బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం` చిత్రంలో కనిపించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories