NTR-Prasanth Neel
ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న క్షణాలు వచ్చేసాయి. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), హీరో ఎన్టీఆర్‌ల సినిమా (NTR31) మొదలైంది. ఈరోజు శుక్రవారం పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోస్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కుటుంబసభ్యులు దీనికి హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు.
NTR-Prasanth Neel
ఇక ఈ చిత్రం ప్రారంభం సందర్భంగా సోషల్ మీడియాలో ‘#NTRNeel’ హ్యష్‌ట్యాగ్ వైరల్‌గా మారింది. 2026 జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్ర టీమ్ తెలిపింది. అయితే అదే సమయంలో ఈ చిత్రం గురించి కొన్ని ఫొటోలు,పోస్టర్ రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కథ కు సంభందించిన కొన్ని క్లూలు పోస్టర్ లోనే చెప్పేశారు అని అర్థమవుతుంది. ఏమిటా క్లూలు..
NTR-Prasanth Neel
నీల్- ఎన్టీఆర్ మూవీ పోస్టర్ ని గమనిస్తే వెనుక వరల్డ్ మ్యాప్ ఉంది. దానిలో ఒకవైపునకు 1969 అని రాసుంది. దానికి ఆపోజిట్ లో గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది. టాప్ లెఫ్ట్ కార్నర్లో చైనా, భూటాన్, బెంగాల్- కోల్ కతా అని రాసుంది. ఇవన్నీ చూస్తుంటే.. 1969 ఓపియం మాఫియాకి రిలేట్ చేస్తోంది. దాంతో ఈ ఓపియం డ్రగ్ మాఫియాలో ఎన్టీఆర్ డ్రగ్ లార్డ్ అయ్యే అవకాశాలు ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
NTR-Prasanth Neel
అలాగే ఇప్పటికే ఎన్టీఆర్ ని 70 ఏళ్ల వృద్ధుడిగా కూడా చూపించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అంటే అతను ఈ ఓపీయం మార్కెట్ లో కింగ్ పిన్ అయ్యే అవకాసం ఉంది. ఆ తర్వాత యంగ్ ఎన్టీఆర్ కూడా ఈ మాఫియాలో కీలక పాత్రధారి కావచ్చు అని వినిపిస్తోంది. 1969 రోజుల్లో కలకత్తా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ కి దగ్గరగా ఉండటంతో.. ఓపియం స్మగ్లింగ్ కి అడ్డాగా ఉండేదంట. ఆ పోర్టు నుంచే స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది.
NTR-Prasanth Neel
వాస్తవానికి అప్పట్లో చైనా ఓపియం మాఫియా సభ్యులు కోల్ కతాలో కూడా యాక్టివ్ గా ఉండేవారు. కలకత్తాలో ఉండే లోకల్ సిండికేట్స్ తో కలిసి ఓపియం స్మగ్లింగ్ చేసేవి. కలకత్తా వీధుల్లో ఓపియం విచ్చలవిడిగా దొరికేదని చెబుతారు. అలా ఈ ఓపియం నేపథ్యంలో గ్యాంగులు ఏర్పడటం.. వాటి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ లింకులు సౌత్ ఈస్ట్ ఆసియాకే కాకుండా.. యూరప్ దాకా విస్తరించాయి అంటారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీ ఈ పాయింట్ మీదే వస్తుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
NTR-Prasanth Neel
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జోష్ మీదున్న ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తారా అని ఆయన ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కథ గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘‘దీన్ని అందరూ ఓ యాక్షన్ సినిమాలా భావిస్తారని నాకు తెలుసు. కానీ, నేను నా జానర్‌లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికిది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుంది. ఇది నాకు చాలా కొత్త కథ అని చెప్పగలను’’ అని వెల్లడించారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
NTR-Prasanth Neel
ఇటీవల ఈ సినిమా టైటిల్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్31’ (NTR31) వర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ (Dragon) పేరు ఖరారు చేసినట్లు వార్తలు వినిపించాయి. ఈ పేరుతో కొన్ని పోస్టర్లు ఎక్స్‌లో దర్శనమిచ్చాయి. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నట్లు సమాచారం.