రాజమౌళి హీరోల్లో నితిన్, సునీల్ మాత్రమే స్పెషల్..ఎందుకో తెలుసా ?

First Published | Aug 9, 2024, 5:23 PM IST

రాజమౌళితో ఇప్పటి వరకు ఎన్టీఆర్, నితిన్, ప్రభాస్, రవితేజ, రాంచరణ్, నాని, సునీల్ లాంటి హీరోలు నటించారు. వీరిలో నితిన్, సునీల్ ఒకరకంగా స్పెషల్ అని చెప్పొచ్చు.

డైరెక్టర్ రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. కానీ జక్కన్న ఇంకా పూర్తి స్థాయిలో వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేయలేదు. వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించాలని రాజమౌళి.. మహేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. 

రాజమౌళితో ఇప్పటి వరకు ఎన్టీఆర్, నితిన్, ప్రభాస్, రవితేజ, రాంచరణ్, నాని, సునీల్ లాంటి హీరోలు నటించారు. వీరిలో నితిన్, సునీల్ ఒకరకంగా స్పెషల్ అని చెప్పొచ్చు. ఒక్కో డైరెక్టర్ ఒక్కో స్టైల్ ఫాలో అవుతారు. కొందరు కథ రెడీ చేసుకుని హీరోని వెతుక్కుంటారు. మరికొందరు హీరోని ఫిక్స్ చేసుకున్నాక ఆ హీరోకి తగ్గ కథ రెడీ చేసుకుంటారు. 


రాజమౌళి ఎక్కువగా ఫాలో అయ్యేది ముందు హీరోని ఎంపిక చేసుకునే విధానమే అట. తాను తెరకెక్కించిన దాదాపు అన్ని చిత్రాలకు ఇదే పద్ధతి ఫాలో అయ్యానని రాజమౌళి అన్నారు. కానీ రెండు చిత్రాలు తప్ప. ఆ రెండు చిత్రాలు సై, మర్యాద రామన్న. ముందుగా ఈ రెండు చిత్రాల కథ రెడీ అయిపోయిందట. 

సై చిత్రానికి ఎవరు సరిపోతారు అని ఆలోచిస్తున్నప్పుడు నితిన్ గుర్తుకు వచ్చాడు. అప్పట్లో నితిన్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది. అలా సై చిత్రానికి నితిన్ ఫిక్స్ అయ్యాడు. ఇక మగధీర తర్వాత ఒక చిన్న చిత్రం చేద్దామని మర్యాదరామన్న కథ రాసుకున్నారట. ఈ కథకి సునీల్ అయితే బావుంటాడని అతడిని సెలెక్ట్ చేసుకున్నారు. సో రాజమౌళి సినిమాల్లో నఅందరు హీరోలు ఎంపికైన విధానం వేరు.. నితిన్, సునీల్ మాత్రమే ఎంపికైన విధానం వేరు. 

Latest Videos

click me!