జబర్దస్త్ రాకేష్‌- సుజాత పెళ్లి ఫోటోలు.. రోజా, గెటప్‌ శీను, యాంకర్‌ రవి సందడి..

Published : Feb 24, 2023, 05:45 PM IST

జబర్దస్త్ రాకేష్‌, సుజాత ఒక్కటయ్యారు. మూడు ముళ్ల బంధంతో వీరిద్దరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఆయా ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందులో తారలు పాల్గొని సందడి చేశారు.  

PREV
17
జబర్దస్త్ రాకేష్‌- సుజాత పెళ్లి ఫోటోలు.. రోజా, గెటప్‌ శీను, యాంకర్‌ రవి సందడి..

జబర్దస్త్ షోతో పాపులర్‌ అయ్యారు రాకింగ్‌ రాకేష్‌. తనదైన కామెడీ పంచ్‌లతో ఆకట్టుకున్నాడు. స్టార్‌ కమెడీయన్‌ అయ్యారు. ఆయనకు జబర్దస్త్ షోలో పరిచయమైంది సుజాత. టీవీ యాంకర్‌గా ఉన్న సుజాత `బిగ్‌ బాస్‌` షోలో పాల్గొంది. అక్కడ నుంచి జబర్దస్త్ లోకి వచ్చింది. అలా వీరిద్దరు కలిసి స్కిట్‌ చేశారు. అలా పరిచయం, ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వెళ్లింది. 
 

27

రాకేష్‌, సుజాత వివాహం తాజాగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. బంధుమిత్రులు, సినీ ప్రముఖులు, ముఖ్యంగా జబర్దస్త్ టీమ్‌ హాజరు కాగా వైభవంగా ఈ పెళ్లివేడుక జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

37

ఇందులో జబర్దస్త్ మాజీ జడ్జ్, ప్రస్తుత ఏపీ మంత్రి రోజా, తన భర్త సెల్వమణితో కలిసి హాజరయ్యారు. నూతన వధువరులను ఆశీర్వదించారు. జబర్దస్త్ లో తాను రోజాని అమ్మగా భావించే రాకేష్‌ దంపతులు రోజా, సెల్వమణీ ఆశీర్వాదాలు తీసుకున్నారు. 

47

మరోవైపు ఈ పెళ్లి వేడుకలో జబర్దస్త్ టీమ్‌ కూడా పాల్గొని సందడి చేసింది. వారిలో గెటప్‌ శ్రీను కూడా పాల్గొన్నారు. ఆయన తన సతీసమేతంగా హాజరయ్యారు. నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. 
 

57

మరోవైపు యాంకర్‌ రవి సైతం తన సతీసమేతంగా ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. రాకేష్‌, సుజాతలకు తన విషెస్‌ తెలియజేశారు. వీరితోపాటు ఇతర ప్రముఖులు కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తుంది. 

67

దాదాపు 20 ఏళ్ళక్రితం హైదరాబాద్ వచ్చి మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేశాడు రాకేష్. జబర్థస్త్ లో గత పదేళ్ళు గా స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. అటు సుజాత కూడా జోర్ధార్ వార్తలతో బాగా ఫేమస్ అయ్యింది.   రాకేష్.. ధనరాజ్ టీమ్ లీడర్ గా ఉన్న టైమ్ లో రాకేశ్ అతని టీమ్ లో ఓ సభ్యుడిగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొన్నాళ్లకు కిరాక్ ఆర్పీ-రాకింగ్ రాకేష్ పేరుతో టీమ్ లీడర్ కూడా అయ్యాడు. ఆర్పీ వెళ్లిపోవడంతో సింగిల్ టీమ్ లీడర్ గా మారిపోయాడు.

77

సుజాత న్యూస్ రీడర్ గా ఫేమస్ అవ్వడంతో పాటు.. బిగ్ బాస్ లో కూడా అవకాశం సాధించి మరింత ఇమేజ్ సాధించుకుంది. వీరిద్దరి పరిచయం ప్రేమ తరువాత రాకేశ్ టీమ్ లోనే కంటెస్టెంట్ గా కొనసాగుతోంది. రాకేష్ తో ఈమెకు ముందు నుంచి పరిచయం ఉంది. అయితే ఆమె కూడా జబర్దస్త్ షోలో అడుగుపెట్టడం, రాకేష్ టీమ్ లోనే స్కిట్స్ చేస్తూ వచ్చింది. ఇక రాకేష్ సుజాతతో కలిసి చాలా సార్లు జబర్ధస్త్ స్టేజ్ మీద చాలా సార్లు వీరి ప్రేమ వ్యావహారం బయట పెట్టారు. ఈక్రమంలోనే ఆమధ్య ఏంగేజ్ మెంట్  చేసుకున్న ఈజంట.. ప్రస్తుతం పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories