dear uma movie review
Dear Uma Movie Review: పృథ్వీ అంబర్, సుమయ రెడ్డి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ `డియర్ ఉమ`. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుమయ రెడ్డి నిర్మాత. ఆమె ఈ చిత్రానికి కథ అందిస్తూ నిర్మించడం విశేషం. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ శుక్రవారం(ఏప్రిల్ 18)న విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
dear uma movie review
కథః
ఉమ(సుమయ రెడ్డి) పట్లెటూరిలో పెరిిగిన అమ్మాయి. డాక్టర్ కావాలని కలలు కంటుంది. కష్టపడి చదివి ఎంబీబీఎస్ లో సీటు సంపాదిస్తుంది. తన డాక్టర్ స్టడీ పూర్తి చేసి సొంతంగా ఆసుపత్రి నిర్మించి తన తండ్రి కలను నెరవేర్చాలని అనుకుంటుంది. ఆ పనిలోఆమె బిజీగా ఉంటుంది. మరోవైపు దేవ్(పృథ్వీ అంబర్)కి మ్యూజిక్ అంటే ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదగాలనుకుంటాడు. మ్యూజిక్‌పై ఇష్టంతో చదువుల్లో వెనకబడతాడు.
అదే సమయంలో కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. మ్యూజిక్ వల్లే ఆమె దేవ్‌కి బ్రేకప్ చెబుతుంది. దీంతో హార్ట్ బ్రేక్ అవుతుంది. బాగా డ్రింక్ తీసుకుని ఇంటికెళ్లగా, తండ్రి ఇంటి నుంచి గెంటేస్తాడు. దీంతో మళ్లీ తాను రాక్ స్టార్ కావాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ అన్ని రకాలుగా ఫెయిల్ అవుతాడు. ఫ్రెండ్ ఆర్ట్ గ్యాలరీలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. అక్కడ ఓ డైరీ ద్వారా ఉమా.. దేవ్ జీవితంలోకి వస్తుంది.
దీంతో ఉమతోనే ప్రేమలో పడతాడు. ఉమకి తన ప్రేమని వ్యక్తం చేయాలని భావిస్తాడు. కానీ అంతలోనే ఆమె జీవితంలోని షాకింగ్ విషయం తెలుస్తుంది. మరి ఆ షాకింగ్ విషయం ఏంటి? మెడికల్ మాఫియాపై ఉమ చేసిన పోరాటం ఏంటి? ఆమె పోరాటానికి దేవ్ ఎలా సపోర్ట్ గా నిలిచాడు?చివరికి ఏమైందనేది మిగిలిన కథ.
dear uma movie review
విశ్లేషణః
మెడికల్ మాఫియాపై థ్రిల్లర్‌గా తెరకెక్కించిన చిత్రం `డియర్ ఉమ`. కరోనా సమయంలో చాలా ప్రైవేట్ ఆసుపత్రులు అమాయక జనాలను ఎలా దోచుకున్నారనేది ఇందులో చూపించారు. వాస్తవాలను కళ్లకి కట్టినట్టు చూపించారు. `ఠాగూర్` సినిమాని తలపించేలా కథనాన్ని రాసుకోవడం విశేషం. కథ పరంగా సుమయ రెడ్డి చెప్పాలనుకున్న సందేశం బాగుంది. నేటి ట్రెండీగా దాన్ని మలిచిన తీర బాగుంది.
దీనికి సంబంధించిన సందేశం సినిమాకి పెద్ద అసెట్. ఇక ఫస్టాఫ్ లో హీరోహీరోయిన్ల కథలను వెర్వేరుగా చూపించి, వాళ్లిద్దరు ప్రేమలో పడే సన్నివేశాలు బాగున్నాయి. ఉత్కంఠ భరితంగా, ఎమోషనల్‌గా ఉన్నాయి. హీరో లవ్ బ్రేకప్ సమయంలో కన్నీళ్లు పెట్టుకోవడం కూడా ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. మరోవైపు దేవ్, ఉమల లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కొత్తగా అనిపిస్తుంది. విభిన్న నేపథ్యాలకు చెందిన హీరో హీరోయిన్ ఒక్కటి కావడం అనేది ఇంటర్వెల్‌లో హైలైట్‌గా నిలిచింది.
dear uma movie review
సినిమా సెకండాఫ్ థ్రిల్లర్ వైపు టర్న్ తీసుకుంటుంది. ఉమ మిస్సింగ్కి సంబంధించిన కేసు ఆద్యంతం ఉక్కంఠభరితంగా సాగుతుంది. హీరో రంగంలోకి దిగడం, తన ప్రియుయురాలి కోసం ఆయన అన్వేషణ కొనసాగించడంతో కథ సీరియస్‌గా, ఉత్కంఠభరితంగా మారుతుంది. ఉమకి సంబంధించి హీరో కలవాలనుకున్న వ్యక్తులంతా మర్డర్ కావడం షాకిస్తుంటుంది.
ఇక అసలు విలన్ ఎవరు అనేది రివీల్ అయ్యే ట్విస్ట్ బాగుంది. క్లైమాక్స్ సినిమాకి బలం. అయితే డ్రామా విషయంలో ఇంకాస్త డెప్త్ ఉంటే బాగుండేది. ఎమోషనల్ సీన్ల డోస్ తగ్గింది. చాలా సీన్లు ఎమోషన్‌గా కనెక్ట్ కావడం కష్టం. అదే సమయంలో మెడికల్ మాఫియా సీన్లు కూడా ఇంకా బాగా చూపించాల్సింది. ఓవరాల్ గా మంచి సందేశం అందించే చిత్రమవుతుందని చెప్పొచ్చు.
dear uma movie review
నటీనటులుః
ఉమగా సుమయ రెడ్డి బాగా చేసింది. ఓ వైపు కథ అందిస్తూ, నిర్మిస్తూ, మెయిన్ లీడ్‌గా నటించడం విశేషం. ఆమె అదరగొట్టింది. మల్టీటాలెంటెడ్‌గా మెప్పించింది. మంచి సందేశాత్మక చిత్రాన్ని అందించింది. ఇక దేవ్ పాత్రలో పృథ్వీ అంబర్ కూడా బాగా చేశాడు. యాక్షన్‌తోపాటు ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశాడు. అజయ్ ఘోష్ తనదైన నటనతో మెప్పించాడు. కమల్ కామరాజు పాత్రసర్‌ప్రైజ్ చేస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పాత్రలు నవ్వులు పూయిస్తాయి.
dear uma movie review
టెక్నీకల్‌గాః
టెక్నీకల్‌గా మూవీ బాగుంది. రాజ్ తోట కెమెరా వర్క్ సహజంగా ఉంది. ఫ్రేమ్స్ కూడా బాగున్నాయి. రథన్ మ్యూజిక్ సినిమాకి మరో అసెట్‌గా నిలిచింది. కథకి తగ్గట్టుగా బీజీఎం, పాటలు బాగా కుదిరాయి. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. దర్శకుడు సాయి రాజేష్ మహా దేవ్ మూవీగా చాలా బాగా తెరకెక్కించాడు. సుమయ రెడ్డి కథని అంతేబాగా తెరపై ఆవిష్కరించారు. కాకపోతే అన్ని ఎమోషన్స్ డోస్ కాస్త తగ్గింది. వాటిపై ఫోకస్ పెడితే సినిమా ఇంకా అదిరిపోయేది.
ఫైనల్‌గా ః మెడికల్ మాఫియాపై మంచి సందేశాత్మక మూవీ.
రేటింగ్‌ః 2.75