రీతూ వర్మ అంటే సాంప్రదాయానికి పెద్ద పీట వేసే హీరోయిన్‌గా కనిపిస్తుంది. ఆమె సినిమాల్లో బోల్డ్ రోల్స్ చేయడం చాలా అరుదు. ఫోటో షూట్లు కూడా ఏమాత్రం హద్దులు మీరని విధంగా ఉంటాయి. సింపుల్‌గానే పోజులిస్తూ కట్టిపడేస్తుందీ అందాల భామ.
తాజాగా రీతూ వర్మ అభిమానులకు షాకిచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లామర్‌కి హద్దులు చెరిపేసింది. అందాల ఆరబోతకు గేట్లు ఎత్తేసింది. హాట్ షోకి నో బౌండరీస్ అనే డైలాగ్‌లను నిజం చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు చూస్తేంటే మతిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు.
బ్లూ జీన్స్ లో మెరిసింది రీతూ వర్మ. టాప్ జాకెట్ బటన్స్ విప్పేసి టాప్ అందాలతో హోయలు పోయింది. చేతులు పైకెత్తి నడుమందాలు చూపిస్తూ మత్తెక్కించే చూపులతో రీతూ వర్మ ఇచ్చిన పోజులు కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్నాయి.
ఇటీవల నానితో కలిసి `టక్ జగదీష్` చిత్రంతో ఆకట్టుకుంది రీతూ వర్మ. ఇందులోనూ ఏమాత్రం అందాలు ఆరబోయలేదు. గ్లామర్‌కి దూరంగా ఉండే రీతూ వర్మ సడెన్‌గా ఇలా కొత్త లుక్‌లో మెరవడంతో నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారట.
`టక్ జగదీష్`తో మెప్పించిన రీతూ వర్మ త్వరలో `వరుడు కావలెను` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రీతూ వర్మ ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. అందులో భాగంగానే ఇలా గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది రీతూ.
సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది. దీంతో యూట్యూబ్‌లో పాపులర్ అయిన రీతూ వర్మ ఎన్టీఆర్ నటించిన `బాద్షా` చిత్రంతో నటిగా మారింది. ఇందులో చిన్న పాత్రలో మెరిసింది. దీని తర్వాత `ప్రేమ ఇష్క్ కాదల్`లో నటించి ఆకట్టుకుంది. ఇలా `నా రాకుమారుడు`, `ఎవడే సుబ్రమణ్యం` చిత్రాల్లో కనిపించింది.
`ఎవడే సుబ్రమణ్యం`తో విజయ్ దేవరకొండతో ఏర్పడిన పరిచయం `పెళ్లిచూపులు`కు దారితీసింది. ఇందులో విజయ్‌తో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంతో అటు విజయ్, ఇటు రీతూ పాపులర్ అయ్యారు.
అనంతరం `కేశవ`, `నిన్నిలా నిన్నిలా` చిత్రాల్లో మెరిసింది. విజయాలు అందుకుంది. మరోవైపు తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి `వెలైల్లా పట్టదారి 2`, `కన్నుమ్ కన్నుమ్ కొల్లైయధిథాల్`(కనులు కనులను దోచాయటే) చిత్రాల్లో మెరి విజయాలు అందుకుంది. ప్రస్తుతం `వరుడు కావలెను` చిత్రంతోపాటు తెలుగు, తమిళంలో రూపొందుతున్న `ఒకే ఒక జీవితం`లో శర్వానంద్ సరసన నటిస్తుంది రీతూ వర్మ.