Bigg Boss Telugu 9 ఎండ్ కార్డ్ కు ఇంకా ఒక వారం మాత్రమే ఉండగా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి రీతూ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయింది. వెళ్తూ.. వెళ్తూ.. విన్నర్ ఎవరో తేల్చేసింది రీతూ.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరింది. రియాల్టీ షో ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. ఈ వారం హౌస్ నుంచి రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. ఇంకా హౌస్ లో 7 మంది మాత్రమే ఉండగా. రీతూ వెళ్తు వెళ్తూ.. బిగ్ బాస్ లో ఎవరెవరు ఏ స్థానంలో ఉంటారో తన అభిప్రాయం వెల్లడించింది . ఫస్ట్ ప్లేస్ ను అందరు అనుకున్నట్టగానే డీమాన్ పవన్ కు ఇచ్చేసింది రీతూ చౌదరి. ఇక రెండు, మూడు, నాలుగు స్థానాలను ఇమ్ము, కళ్యాణ్, తనూజలను పంచుకోమని చెప్పి సేఫ్ గేమ్ ఆడింది. ఇక సుమన్ శెట్టికి 6 ప్లేస్ ఇచ్చిన ఆమె.. భరణీని 7వ స్థానానికి పరిమితం చేసి షాక్ ఇచ్చింది.
24
బోరున విలపించిన రీతూ చౌదరి
బిగ్ బాస్ నుంచి రీతే ఎలిమినేట్ అవ్వడంతోనే ఆమె తట్టుకోలేకపోయింది. కామ్ గా ఏడుపును ఆపుకునే ప్రయత్నం చేసినా.. అది ఆమె వల్ల కాలేదు. ''బిగ్ బాస్ ఎందుకు నన్ను ఎలిమినేట్ చేశారు. నాకు వెళ్లాలని లేదు. ఇంకా ఉండాలని ఉంది. ఎందుకు నన్ను పంపిస్తున్నారు బిగ్ బాస్'' అంటూ బోరున విలపించింది రీతూ చౌదరి. ఆతరువాత తేరుకుని ‘’లవ్ యూ బిగ్ బాస్.. నాకు ఇన్ని రోజులు ఇక్కడ ఉండే అవకాశం ఇచ్చారు'' అంటూ కూల్ అయ్యింది. రీతూ ఎలిమినేట్ అవ్వడంతో పవన్ ఏడుపు ఆపుకోలేకపోయాడు. అతను కూడా రీతూతో కలిసి బోరుమన్నాడు. తనూజ కూడా బాగా ఏడ్చేసింది. బిగ్ బాస్ హౌస్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
34
సండే ఫన్ డే గేమ్స్..
బిగ్ బాస్ సండే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే.. కింగ్ నాగార్జున కూల్ గ్రీన్ లుక్ తో మెరిసిపోయాడు.. నాగార్జున గ్రీన్ షర్ట్ తో మ్యాచ్ అయ్యేలా.. సంజన, రీతూ, తనూజ ముగ్గురు గ్రీన్ డ్రెస్ లు అనుకోకుండా వేసుకున్నారు. ఇక నామినేషన్స్ లో ఉన్నవారిలో తనూజను ఫస్ట్ సేవ్ చేశాడు నాగ్. ఆతరువాత వారికి సరదాగా పన్నీ మూమెంట్స్ తో కూడిన బిగ్ బాస్ ఏవీని చూపించి, నవ్వుల్లో ముంచెత్తాడు. వెంటనే టీమ్ తో మరో ఫన్నీ గేమ్ ఆడించాడు నాగార్జున. ఇక వెంటనే డిమాన్ పవన్ ను సేవ్ చేశాడు.. మరో ఫన్ గేమ్ ఆడిన తరువాత భరణిని సేవ్ చేశాడు కింగ్.
బిగ్ బాస్ హౌస్ ఇంకా రెండు వారాలు ఉన్నాయి. ఈక్రమంలో హౌస్ లో 8 మంది ఉన్నారు. అంతా కలిసి మెలిసి ఉండగా, వారిలో మళ్లీ గొడవలు పెట్టే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్. ఓ డిఫరెంట్ గేమ్ ను వారితో ఆడించారు. ప్రతీ ఒక్కరి గురించి మూడు స్టెట్మెంట్స్ చదివి.. అందులో ఒకటి మాత్రమేనిజం..అది ఎవరు ఎవరి గురించి చెప్పారు అనేది కనిపెట్టాలన్నారు. ఈ గేమ్ లో ఎవరూ కరెక్ట్ గా చెప్పలేకపోయారు. కానీ ఎవరెవరు తమ గురించి తప్పుగా అనుకున్నారన్నది వారికి తెలిసిపోయింది. అయితే అందులో భరణితో పాటు కొంత మంది మాత్రం ఇప్పుడే కలిసిమెలిసి ఉంటున్నాం.. మళ్లీ గొడవలు ఎందుకు అనే అభిప్రాయం వెల్లడించారు.