అలాంటి ఫోటోలు పోస్ట్ చేసేది దానికోసమేనా.. హీరోయిన్ ని డైరెక్ట్ గా అడిగేసిన రీతూ చౌదరి 

Published : Mar 07, 2024, 05:03 PM IST

జబర్దస్త్ తో తో గుర్తింపు పొందిన రీతూ చౌదరి ప్రస్తుతం యాంకర్ గా కూడా రాణిస్తోంది. రీతూ చౌదరి సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో రచ్చ చేయడం చూస్తూనే ఉన్నాం. రీతూ ప్రస్తుతం దావత్ అనే చాట్ షోకి హోస్ట్ గా చేస్తోంది.

PREV
16
అలాంటి ఫోటోలు పోస్ట్ చేసేది దానికోసమేనా.. హీరోయిన్ ని డైరెక్ట్ గా అడిగేసిన రీతూ చౌదరి 

జబర్దస్త్ తో తో గుర్తింపు పొందిన రీతూ చౌదరి ప్రస్తుతం యాంకర్ గా కూడా రాణిస్తోంది. రీతూ చౌదరి సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో రచ్చ చేయడం చూస్తూనే ఉన్నాం. రీతూ ప్రస్తుతం దావత్ అనే చాట్ షోకి హోస్ట్ గా చేస్తోంది. ఈ షోకి పలువురు సెలెబ్రిటీలు హాజరవుతున్నారు. 

26

తాజాగా యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ అతిథిగా హాజరైంది.  మార్చి 15న ఆమె నటించిన తంత్ర చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. అదే విధంగా పొట్టేలు చిత్రంలో కూడా అనన్య నటిస్తోంది. మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది.  

36

తంత్ర చిత్రంలో హారర్ అంశాలు ఉన్నప్పటికీ తాను రొమాంటిక్ గా గ్లామర్ గా కూడా నటించినట్లు తెలిపింది. అనన్య ఇటీవల పొట్టేలు చిత్రంలో లిప్ లాక్ సీన్ లో నటించడం పై వివరణ ఇచ్చింది. తాజాగా రీతూ చౌదరి కూడా అనన్యని కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. 

46

మీరు అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా అని రీతూ అడిగేసింది. అనన్య సమాధానం ఇస్తూ అవును పెదవులకు చేయించుకున్నాను.. ఇప్పుడు అది పోయినట్లు ఉంది అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. రీతూ మరో ప్రశ్న అడుగుతూ పరోక్షంగా అనన్య ని టార్గెట్ చేసింది. కొంతమంది సెలెబ్రిటీలు హాట్ హాట్ గా.. బాగా ఎక్స్ పోజింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంటారు. 

56

మేము సినిమాల్లో ఎక్స్ ఫోజింగ్ కి రెడీ, బోల్డ్ సీన్స్ కూడా చేస్తాం అని హింట్ ఇవ్వడానికేనా అని డైరెక్ట్ గా అడిగేసింది. దీనికి అనన్య నవ్వేసింది. చాలా మంది అలా చేస్తున్నారని తెలిపింది. అయితే ఈ ప్రశ్నకి పూర్తి సమాధానం ఏమని ఇచ్చిందో తెలియాలంటే కంప్లీట్ ఎపిసోడ్ ప్రసారం కావాలి. 

66

అదే విధంగా అనన్య ఇండస్ట్రీలో ఎదురయ్యే అవమానాలని కూడా రివీల్ చేసింది. కొన్ని బ్రాండ్స్ కారుల్లో వెళితేనే గౌరవం ఇస్తారు. అదే విధంగా మన చుట్టూ అసిస్టెంట్స్ ఉంటేనే పట్టించుకుంటారు. అలాంటి వైఖరి టాలీవుడ్ లో ఉంది అని అనన్య పేర్కొంది. ఇక తనని ఇండస్ట్రీలో సమంత, అలియా భట్ ఆదర్శం అని పేర్కొంది. 

click me!

Recommended Stories