Adhurs Movie
వివి వినాయక్-ఎన్టీఆర్ లది హిట్ కాంబినేషన్. వీరిద్దరూ ఆది వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. తర్వాత చేసిన సాంబ పర్లేదు అనిపించుకుంది. అదుర్స్ మాత్రం సూపర్ హిట్. 2010లో విడుదలైన అదుర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది.
Adhurs Movie
ఎన్టీఆర్ కిల్లర్ గా, బ్రాహ్మణుడిగా విభిన్నమైన పాత్రలు చేశాడు. ఈ రెండు పాత్రల క్యారెక్టరైజేషన్ బాగా కుదిరింది. ముఖ్యంగా చారి పాత్రలో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కేక అని చెప్పాలి. ఎన్టీఆర్-బ్రహ్మానందం కామెడీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్.
Adhurs Movie
కాగా అదుర్స్ మూవీలో ఎన్టీఆర్ కి డూప్ గా ఎవరు చేశారనే విషయం పై ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. డ్యూయల్ రోల్ అంటే హీరోకి ఖచ్చితంగా ఉండాల్సిందే. సదరు హీరో ఆహార్యానికి దగ్గరగా ఉండే డూప్స్ నటిస్తారు. అదుర్స్ లో కూడా ఎన్టీఆర్ కి డూప్ ఉన్నాడట.
Adhurs Movie
అయితే ఒకరోజు ఎన్టీఆర్ డూప్ షూటింగ్ కి అందుబాటులో లేడట. అప్పుడు ఎన్టీఆర్ మేకప్ ఆర్టిస్ట్ కిరణ్ ని డూపుగా నటింపజేశారట. ఆ రోజుకు ఎన్టీఆర్ డూప్ గా కిరణ్ నటించాడని సమాచారం. ఎన్టీఆర్ ఎత్తుకు, లావుకి కిరణ్ దగ్గరగా ఉంటాడట. అందుకే వివి వినాయక్ అలా కానిచ్చేశాడట.
కాగా అదుర్స్ కి సీక్వెల్ అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. దర్శకుడు వివి వినాయక్ కూడా ఒకటి రెండు సందర్భాల్లో స్పందించారు. ఇప్పుడేమో వివి వినాయక్ ఫార్మ్ లో లేడు. ఆయన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి ఘోర పరాజయం మూటగట్టుకున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా పరువు పోగొట్టుకున్నాడు.
NTR
మరోవైపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఖాళీగా లేకుండా వరుసగా చిత్రాలు ప్రకటిస్తున్నాడు. దేవర తో పాటు వార్ 2 చేస్తున్న ఎన్టీఆర్... నెక్స్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నాడు. కాబట్టి వివి వినాయక్ తో ఆయన సినిమా చేయడం కలే...