రంగస్థలంలో విలన్ గా మొదట అనుకున్నది నన్నే, జగపతి బాబుని కాదు..ఎందుకు తీసేశారంటే

Published : Mar 07, 2024, 03:04 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో రంగస్ధలం ఒకటి. అప్పటికి ఈ చిత్రం నాన్ బాహుబలి హిట్ గా రికార్డు సృష్టించింది.

PREV
16
రంగస్థలంలో విలన్ గా మొదట అనుకున్నది నన్నే, జగపతి బాబుని కాదు..ఎందుకు తీసేశారంటే

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో రంగస్ధలం ఒకటి. అప్పటికి ఈ చిత్రం నాన్ బాహుబలి హిట్ గా రికార్డు సృష్టించింది. మొదట్లో సుకుమార్ ఈ చిత్రాన్ని మీడియం బడ్జెట్ లో సింపుల్ విలేజ్ డ్రామాగా తెరకెక్కించాలని అనుకున్నారు.  చిత్రం భారీ బడ్జెట్ మూవీ గా మారిపోయింది. 

26

మొదట్లో సింపుల్ గా తెరకెక్కించాలనుకున్నప్పుడు బడ్జెట్ కి తగ్గట్లుగా నటీనటుల్ని ఎంపిక చేసుకోవడానికి ఆడిషన్స్ కూడా చేశారు. అప్పుడు జగపతి బాబు పేరు ఆలోచనలో కూడా లేదట. ఈ విషయాన్ని క్యారెక్టర్ రోల్స్ తో పాపులర్ అవుతున్న నటుడు అప్పాజీ అంబరీష్ తెలిపారు. 

36

అప్పాజీ అనేక చిత్రాల్లో తండ్రిగా, డాక్టర్ గా, లాయర్ గా చిన్న చిన్న పత్రాలు చేస్తూ వచ్చారు. దాదాపు 30 పైగా చిత్రాల్లో ఆయన నటించారు. రంగస్థలం ఆయనకి వచ్చిన గోల్డెన్ ఛాన్స్. విలేజ్ ప్రెసిడెంట్ పాత్ర కోసం ఆయన ఆడిషన్స్ కి హాజరయ్యారట. చిత్ర యూనిట్ ఆయన్ని ఒకే కూడా చేసింది. కానీ ఇంకా పెద్ద నటుల్ని తీసుకోవాలనే ఆలోచన మొదలైనప్పుడు జగపతి బాబు లైన్ లోకి వచ్చారు. 

46

మిమ్మల్ని ఈ చిత్రం నుంచి తీసేయడం లేదు.. జగపతి బాబుకి అసిస్టెంట్స్ ఉంటారు. అందులో ఒక క్యారెక్టర్ ఇస్తాం అని చెప్పారట. సరే అదైనా దక్కుతుంది అని అనుకున్నారట. షూటింగ్ మొదలయ్యాక ప్రొడక్షన్ టీం కి కాల్ చేస్తే ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వలేదు అని అప్పాజీ అన్నారు. 

56

రంగస్థలం చిత్రాన్ని ముందు అనుకున్న బడ్జెట్ లో తెరకెక్కించి ఉంటే తానె విలన్ రోల్ లో నటించే వాడిని అని అప్పాజీ అన్నారు. నాకు 30 చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. కొందరు ఆడిషన్స్ కి పిలిచి చాలా సిల్లీ సన్నివేశాలలో నటించి చూపించమని అడుగుతారు. 

66

కూరగాయలు కొంటూ నటించమని అడుగుతారు. నా లాంటి సీనియర్ నటుడిని ఆడిషన్స్ చేసే విధానం అదేనా అని మండిపడ్డారు. తాను కొన్ని చిత్రాల్లో డాక్టర్, ఫాదర్ రోల్స్ చేశాను. చాలా మంది అవే పాత్రలకు నన్ను పిలుస్తుండడంతో చిరాకు పుడుతోంది అని తెలిపారు. 

click me!

Recommended Stories