Kalyan Padala తో వర్కౌట్‌ కాకపోవడంతో డీమాన్‌ పవన్‌ని పట్టుకుంది.. ట్రోల్స్ పై రీతూ చౌదరీ రియాక్షన్‌ ఇదే

Published : Jan 18, 2026, 10:42 PM IST

రీతూ చౌదరీ ఇటీవల బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి వెళ్లి రచ్చ చేసింది. తనదైన లౌడ్‌ గేమ్‌తో ఆకట్టుకుంది. డీమాన్‌ పవన్‌తో అదిరిపోయే కెమిస్ట్రీని పండించింది. కానీ కళ్యాణ్‌తోనూ వర్కౌట్‌ చేసిందట. 

PREV
15
కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌తో బాండింగ్‌పై రీతూ చౌదరీ

బిగ్‌ బాస్‌ తెలుగు షో ముగిసి దాదాపు నెల రోజులు కావస్తుంది. కానీ దానికి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. కంటెస్టెంట్లు పలు ఇంటర్వ్యూస్‌లో మాట్లాడుతున్నారు. ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా రీతూ చౌదరీ కూడా ఇంటర్వ్యూలిచ్చింది. ఆమె చుట్టూ అనేక వివాదాలు ఉన్న నేపథ్యంలో రీతూ చౌదరీ తన భావాలను పంచుకుంది. ముఖ్యంగా డీమాన్‌ పవన్‌తో బాండింగ్‌ నడిపించింది. అయితే మొదట ఆమె కళ్యాణ్‌తోనూ క్లోజ్‌ గా మూవ్‌ అయ్యింది. కానీ ఆ తర్వాత పవన్‌తోనే ఉంది రీతూ.

25
ఫైర్‌ స్టోర్మ్ వచ్చినప్పుడు చాలా బాధపడ్డా-రీతూ చౌదరీ

ఈ క్రమంలో అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఫైర్‌ స్టోర్మ్ వచ్చినప్పుడు రీతూ చౌదరీ చాలా ఇబ్బంది పడిందట. తనకు డీమాన్‌ పవన్‌ని దూరంగా ఉండాలని వారు చెప్పడంతో చాలా హర్ట్ అయ్యిందట. హౌజ్‌లో ఉండటం కష్టంగా అనిపించిందని చెప్పింది. ఆ వారం రెండు వారాలు చాలా బాధగా ఉన్నట్టు తెలిపింది. తనని బ్యాడ్‌ చేస్తున్నారనే బాధ ఎక్కువగా ఉందట. ఈ విషయాన్ని తాజాగా రీతూ చౌదరీ వెల్లడించింది. బిగ్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రీతూ ఈ విషయంపై ఓపెన్‌ అయ్యింది.

35
కళ్యాణ్‌ తో మొదట్నుంచి అలానే ఉన్నా

ఈ క్రమంలో మొదట తాను కళ్యాణ్‌తో కెమిస్ట్రీ వర్కౌట్‌ చేయాలనుకుందని, అక్కడ వర్కౌట్‌ కాకపోవడంతో డీమాన్‌ పవన్‌ని పట్టుకుందనే విమర్శలు వచ్చాయి. కొందరు కంటెస్టెంట్లు కూడా ఈ కామెంట్లు చేశారు. అయితే తమ మధ్య ఉన్న బాండింగ్‌ వేరు, బయటకు వెళ్లింది వేరు అని చెప్పింది రీతూ చౌదరీ. తాను వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కళ్యాణ్‌, తాను మొదటి నుంచి ఫ్రెండ్స్ గానే ఉన్నామని, కళ్లల్లో కళ్లు పెట్టుకొని చూసే సన్నివేశంలో తనకు ఆయనే డేర్‌ ఇచ్చాడని చెప్పింది. కానీ బయటకు వేరేలా వెళ్లినట్టుగా అనిపించిందని చెప్పింది రీతూ.

45
పవన్‌, తనూజ బాండింగ్‌ని చివర్లో చూపించారు

కళ్యాణ్‌తో బాండింగ్‌ ఫస్ట్ వీక్‌ నుంచి 13వ వారం వరకు సేమ్‌ ఉంటుంది. వర్కౌట్‌ కాదు అన్నప్పుడు మేం ఫ్రెండ్స్ గా ఉండకూడదు కదా, మరి ఎందుకు ఉంటాం. తనూజ విషయంలో డీమాన్‌ పవన్‌ అన్న కామెంట్స్ కి ఆమె స్పందిస్తూ, రీతూ ఉండటం వల్ల నువ్వు బతికిపోయావని తనూజని పవన్‌ అన్నాడు. ఎందుకంటే తనూజని ఏమైనా అంటే నేను అడ్డుకునేదాన్ని, ఏం అననిచ్చేదాన్ని కాదు, ఆ ఉద్దేశ్యంతో పవన్‌ అలా అన్నాడు. అదే సమయంలో  కళ్యాణ్‌ నన్ను ఏమన్నా అంటే తనూజ అననిచ్చేది కాదు. తనూజ, పవన్‌ మధ్య కూడా అలాంటి స్నేహమే ఉండేది, కానీ చూపించలేదు. చివర్లో చూపించారు` అని తెలిపింది రీతూ.

55
విమర్శలపై రీతూ కామెంట్‌ ఇదే

ఇక విన్నర్‌, టాప్‌ 5 కంటెస్టెంట్ల గురించి చెబుతూ, తాను టాప్‌ 5లో ఉంటానని భావించిందట. ఇమ్మాన్యుయెల్‌, తాను, పవన్‌, తనూజ టాప్‌ 5లో ఉంటామని అనుకుందట. కళ్యాణ్‌ విన్నర్‌ అవుతాడని భావించలేదట. ఇక తనపై వచ్చిన వివాదాలకు సంబంధించిన రీతూ స్పందిస్తూ, నేను ఏంటనేది నాకు తెలుసు, ఫ్యామిలీకి తెలుసు, ఎవడో వచ్చి, ఏదో అన్నాడని, వారికి నేను రియాక్ట్ కావడమేంటి? అని తాను స్పందించలేదని చెప్పింది. అయితే ఈ విషయంలో అమ్మ చెప్పేది ఒక్కటే, అందరిని ఊరికే నమ్మేస్తావ్‌, అలా నమ్మొద్దు అని చెబుతుంది. ఆ విషయంలో నేను చాలా మారాలి అని తెలిపింది రీతూ చౌదరీ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories