Srikanth: నటుడు శ్రీకాంత్ తన కెరీర్‌లో ఎదుర్కున్న సవాళ్ల గురించి, అలాగే తన కెరీర్‌పై చిరంజీవి ప్రభావం గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న నన్ను.. చిరంజీవి పిలిచి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీలో తెలుసుకుందామా..
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తన సినీ కెరీర్‌లో ఎదుర్కున్న సవాళ్లు, చిరంజీవి ప్రభావం గురించి ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవిని తొలిసారిగా తన తండ్రి ద్వారా కలిసినప్పుడు, చిరంజీవి తనను ఒక తమ్ముడిలా చూసుకున్నారని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నాడు. తమ మధ్య ర్యాపో అప్పటినుంచి పెరుగుతూ వచ్చిందన్నారు.
25
వరుసగా ఏడెనిమిది ఫ్లాప్‌లు..
శ్రీకాంత్ కెరీర్‌లో ఒకానొక సమయంలో వరుసగా ఏడెనిమిది సినిమాలు ఫ్లాప్‌లు, యావరేజ్‌లు పడ్డాయి. అప్పటివరకు సక్సెస్‌లను మాత్రమే చూసిన తాను, హఠాత్తుగా ఎదురైన ఈ డౌన్‌ఫాల్‌తో మానసికంగా కృంగిపోయానని, ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని కూడా ఆలోచించానని శ్రీకాంత్ చెప్పాడు. మూడు నెలల పాటు చిరంజీవిని కలవడం మానేశాను. అప్పుడు చిరంజీవి.. శ్రీకాంత్‌కు కబురు పంపి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు రప్పించారట.
35
గంటపాటు మాట్లాడమని చెప్పి..
అక్కడ చిరంజీవి.. శ్రీకాంత్‌ను గంటపాటు మాట్లాడమని చెప్పి, తన సమస్య ఏమిటో తెలుసుకున్నారు. ఆ రోజు చిరంజీవి ఇచ్చిన మెసేజ్ శ్రీకాంత్ జీవిత దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసిందట. సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి జీవితంలో సహజమని, వాటిని ఒకే విధంగా స్వీకరించాలని చిరంజీవి బోధించారట.
ఒక విజయం వస్తే పొంగిపోకుండా, అపజయం వస్తే కృంగిపోకుండా ఉండాలని ఆయన సలహా ఇచ్చారట. జీవితం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని, ఎత్తుపల్లాలు ఉంటాయని, వాటిని అలవాటు చేసుకోవాలని చిరంజీవి వివరించారట. ఈ మాటలు కేవలం సినిమా కెరీర్‌కు మాత్రమే కాకుండా, సాధారణ జీవితానికి కూడా వర్తించే అమూల్యమైన పాఠమని శ్రీకాంత్ అన్నాడు.
55
డిప్రెషన్, నిరాశ పోయాయి..
ఆ రోజు నుంచి తనలో డిప్రెషన్, నిరాశ లాంటివి పోయాయని, జీవితాన్ని హ్యాపీగా గడపడమే తన లక్ష్యమని శ్రీకాంత్ తెలిపాడు. ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ గురించి ప్రస్తావిస్తూ జీవితంలో సంతృప్తి పొందడం ముఖ్యమని పేర్కొన్నాడు.