
బిగ్ బాస్ తెలుగు 9 ఐదో వారం ముగింపుకి చేరుకుంటుంది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. హౌజ్‌ని వీడిన వారిలో ఒక్క శ్రష్టి వర్మ తప్ప మిగిలిన వారంతా కామన్ మేన్ కేటగిరిలో వచ్చినవారే. మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. దీంతో కామన్‌మేన్ టార్గెట్‌గా ఎలిమినేషన్ జరుగుతుందా అనే చర్చ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇప్పుడు ఐదో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్ ఓటింగ్ ప్రకారం ఎవరు డల్ గా ఉన్నారనేది చూస్తుంటే క్రేజీ కంటెస్టెంట్ పేరు వినిపిస్తోంది. గ్లామర్ బ్యూటీ డేంజర్ జోనర్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు 9 ఐదో వారం ఇమ్మాన్యుయెల్, రాము రాథోడ్ తప్ప మిగిలిన వారు సంజనా గల్రానీ, తనూజ, భరణి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, కళ్యాణ్, డీమాన్ పవన్, రీతూ చౌదరీ, శ్రీజ, దివ్య నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. గురువారం వరకు వచ్చిన ఓటింగ్ ప్రకారం మెయిన్‌గా ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో లవ్ బర్డ్స్ గా రాణిస్తోన్న రీతూ చౌదరీ, డీమాన్ పవన్ ఆన్‌లైన్ ఓటింగ్‌లో బాటమ్‌లో ఉన్నారు. ఈ ఓటింగ్ ప్రకారం తనూజ టాప్‌లో ఉన్నారు. ఆమెకి దాదాపు 17 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత కళ్యాణ్ పడాల రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 15 శాతం ఓటింగ్ వచ్చింది. ఇక కమెడియన్ సుమన్ శెట్టి 13 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా భరణి, ఫ్లోరా సైనీ, సంజనా, శ్రీజ దమ్ము ఉన్నారు. చివరగా రీతూ చౌదరీ, ఆ తర్వాత డీమాన్ పవన్ ఉన్నారు. వీరిద్దరి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉంది. అయితే శుక్రవారం నమోదయ్యే ఓటింగ్ ప్రకారం ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తేలనుంది.
ప్రస్తుతానికి అటు రీతూ చౌదరీ, ఇటు డీమాన్ పవన్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిద్దరిలో రీతూ చౌదరీకే ఎక్కువగా రిస్క్ ఉందనే టాక్ వినిపిస్తోంది. దీనికితోడు ఈ ఇద్దరూ హౌజ్‌లో లవ్ బర్డ్స్ గా రాణిస్తున్నారు. రీతూ గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. అదే సమయంలో పవన్‌తో పులిహోర కలుపుతూ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. యూత్‌ని ఆకర్షిస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకుల టార్గెట్ కూడా ఇదే. ఆమె ద్వారా గ్లామర్‌ని పండించాలని. ఆమె కూడా అదే చేస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం ఓటింగ్‌లో రీతూ కంటే పవన్‌కి ఎక్కువ ఓట్లు నమోదైతే, రీతూ పరిస్థితేంటనేది సస్పెన్స్ గా మారింది. ఆమె బాటమ్‌లో ఉంటే ఎలిమినేట్ చేస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రీతూని ఎలిమినేట్ చేస్తే హౌజ్‌లో గ్లామర్, స్పైసీ యాంగిల్ మిస్ అవుతుంది. అంతో ఇంతో కంటెంట్ ఇచ్చేది ఆమె ఒక్కరే. దీంతో ఆమెని ఎలిమినేట్ చేసే సాహసం బిగ్ బాస్ చేస్తారా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇదిప్పుడు బిగ్ బాస్‌కే సవాల్‌గా మారుతుందని చెప్పొచ్చు.
అయితే రీతూ కంటే పవన్‌కి తక్కువ ఓట్లు వస్తే ఆయన్ని ఎలిమినేట్ చేస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాకపోతే లవ్ బర్డ్స్ హార్ట్ ని బ్రేక్ చేసినట్టే అవుతుంది. అలా కూడా కంటెంట్ తగ్గిపోతుందని చెప్పొచ్చు. ఈ పరంగా ఇప్పుడు ఐదో వారం ఎలిమినేషన్ అనేది చాలా కీలకంగా మారింది. ఈ ఇద్దరు కాకుండా దమ్ము శ్రీజని తప్పిస్తారా? అనేది చూడాలి. అయితే ఈ సారి ఎలిమినేషన్ ఆదివారం కాకుండా శనివారమే ఉండబోతుందని సమాచారం. ఎందుకంటే ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి. దీనికోసం ప్రత్యేకమైన ఈవెంట్ ప్లాన్ చేశారు. దీని కారణంగా ముందుగానే ఎలిమినేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేస్తారని సమాచారం. అందుకే ఎలిమినేషన్ శనివారం ఉండబోతుందని టాక్. అయితే ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఉన్నా ఆశ్చర్యం లేదంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
ఇక వైల్డ్ కార్డ్ ద్వారా ఈ సారి ఆరుగురు కంటెస్టెంట్లు హౌజ్‌లోకి రాబోతున్నారట. అందులో భాగంగా ఏపీ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన దివ్వెల మాధురీ బిగ్ బాస్ షోకి రాబోతుందని సమాచారం. ఆమెతోపాటు అలేఖ్య చిట్టి పికిల్స్ గర్ల్ రమ్య మోక్ష కంచర్ల, అలాగే సీరియల్ నటి ఆయేషా జీనత్, నిఖిల్ నాయర్, శ్రీనివాస సాయి, గౌరవ్ గుప్తా వంటి వారు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇందులో అందరి చూపు రమ్య, దివ్వెల మాధురీలపైనే ఉంది. వాళ్లు నిజంగానే వస్తారా? వస్తే ఏ మేరకు రచ్చ చేస్తారో చూడాలి. నాగార్జున హోస్ట్ గా చేస్తోన్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ సెప్టెంబర్ 7న 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన విషయం తెలిసిందే.