మనసులో మాత్రం "మీరేదో చెప్పాలనుకుంటున్నారు కానీ అదేంటో అర్థం కావట్లేదు" అని అనుకుంటుంది. ఈ మాటల్లో ఏదైనా సందేశం ఉందా? అని అనుకుంటుంది. ఈలోగా రిషి,"నువ్వు దిగవలసిన గమ్యం వచ్చింది" అని వసు అని దింపేసస్తాడు. దాని తర్వాత సీన్లో రిషి కుటుంబ సభ్యులందరూ కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటారు. అప్పుడు రిషి,"ఎలాగా అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను వినండి" అని చెప్పి పెద్దమ్మ!, వీలు కుదిరినప్పుడు సాక్షి వాళ్ళ తల్లిదండ్రులని ఇంటికి రమ్మనండి అని అంటాడు.