‘లైగర్’ బ్యూటీ ఆనంద కేళి.. ట్రెండీ అవుట్ ఫిట్.. చిలిపి పోజులతో అట్రాక్ట్ చేస్తున్న అనన్య పాండే..

Published : Aug 08, 2022, 08:50 AM IST

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) ఆనంద కేళికి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ట్రెండీ వేర్ లో అట్రాక్టివ్ ఫొటోషూట్లు చేస్తున్న ఈ బ్యూటీ.. చిలిపి ఫోజులతో మతిపోగొడుతోంది. 

PREV
16
‘లైగర్’ బ్యూటీ ఆనంద కేళి.. ట్రెండీ అవుట్ ఫిట్.. చిలిపి పోజులతో అట్రాక్ట్ చేస్తున్న అనన్య పాండే..

గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపించేలా ఫొటోషూట్లు చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. యంగ్ బ్యూటీ పరువాల విందుకు నెటిజన్లు, అభిమానులు ఫిదా అవుతున్నారు. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ.. ఫొటోలకు అనన్య ఇచ్చే ఫోజులు కుర్రకారును అట్రాక్ట్ చేస్తున్నాయి.
 

26

తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోస్ కు తన అభిమానులు ఖుషీ అవుతున్నారు. వరుస ఫొటోషూట్లతో పిచ్చెక్కిస్తున్న యంగ్ హీరోయిన్.. స్టన్నింగ్ లుక్స్ లో మతిపోగొడుతోంది. ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు దగ్గరుండే ఈ బ్యూటీ.. తాజాగా గ్లామర్  పిక్స్ ను పంచుకుంది.

36

ఈ పిక్స్ లో అనన్య ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. ఆరేంజ్ ఫుల్ స్లీవ్ టీషర్ట్.. వైట్ జీన్స్ ధరించిన కుర్ర భామా చిలిపి ఫోజులతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. త్వరలో సౌత్ ఆడియెన్స్ ను అలరించబోతున్న ఈ బ్యూటీ.. క్రేజీ ఫొటోషూట్లు చేస్తూ ఆనందకేళిలో మునిగి తేలుతోంది. 

46

బాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటున్న అనన్య ‘లైగర్’(Liger) మూవీతో సౌత్ లో అడుగుపెట్టబోతోంది. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే ఆడియెన్స్ గుండెల్లో చోటుదక్కించుకుందీ బ్యూటీ. ఇప్పటికే హిందీ ఫిల్మ్స్ లో నటన,  గ్లామర్ తో ఆకట్టుకుంటున్న అనన్య తెలుగు సినిమాతో మరింత పాపులారిటీని దక్కించుకోనుంది.
 

56

 స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘లైగర్’. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా అలరించబోతోంది. మూవీని తెలుగు, హిందీలో రూపొందించగా.. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. 

66

ప్రస్తుతం లైగర్ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే కూడా ఆడియెన్స్ ను నేరుగా కలుస్తూ సినిమాపై మరింత హైప్  క్రియేట్ చేస్తున్నారు. నిన్న అహ్మదాబాద్ లో ప్రమోషన్స్ ను నిర్వహించిన సందర్భంగా అనన్య ఈ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ఫొటోషూట్ కూడా చేసింది. ఆ పిక్స్ నే అభిమానులతో పంచుకుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories