Guppedantha Manasu: వసుధార దగ్గర మాట తీసుకున్న రిషి... వసుకు ధరణి సలహా?

First Published Sep 22, 2022, 10:14 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 22వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
 

Guppedantha Manasu

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...గౌతమ్ మహేంద్రలు హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు గౌతమ్, రిషిని వచ్చి కూర్చొని అంటాడు. అప్పుడు మహీంద్ర మనసులో, రిషికి నా మీద కోపం తగ్గలేనట్టు ఉన్నది నాతో మాట్లాడడేమో అని అనుకుంటాడు. అంతలో రిషి అక్కడికి వచ్చి డాడ్ భోజనం చేశారా అని అడుగుతాడు. అప్పుడు మహేంద్ర మనసులో ఎంత ఆనందపడి, చేశాను రిషి అని అంటాడు. అప్పుడు రిషి, మహీంద్రా చేయ పట్టుకుని నాకు కోపం ఎక్కువ అని మీకు తెలుసు కదా డాడ్ కానీ నాకు కోపం ఎక్కువ సేపు ఉండదు మళ్ళీ తగ్గిపోతుంది.సారీ మిమ్మల్ని అనరాన్ని మాటలు అన్నాను అని అంటాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు గౌతం రిషి ని ఆపి, రే రిషి వసుధార నీ ఏమైనా అన్నావా అని అడగగా నేను తిడతాను, తిట్టను నా ఇష్టం నీకెందుకురా అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. 

Guppedantha Manasu

ఆ తర్వాత సీన్లో వసు కాలేజీ లోకి వచ్చి కాలి రూంలోకి వెళ్లి యాంగ్రీ ప్రిన్స్ అని రాస్తుంది. రిషి సార్ ఇక్కడికి వస్తారా వస్తే బాగుండు అని అనుకోని వస్తారు,వస్తారు అని బోర్డు నిండా రాస్తూ ఉంటుంది. అప్పుడు రిషి దాన్ని చూసి ఈ పొగరు ఎందుకు ఇక్కడ ఉన్నది అనుకోని బెంచ్ మీద కూర్చుంటాడు. వచ్చానులే అని అంటాడు రిషి. అప్పుడు వసు అది చెరిపేద్దామని చూడగా,అది చెరపకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని అంటాడు రిషి.అయినా వసుధార జరిపిసి వస్తుంది. ఈ మధ్యన నేను చెప్పిన మాటకు విలువ ఇవ్వకుండా సొంత నిర్ణయాలు బాగా తీసుకుంటున్నావు అని అంటాడు. దేని గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటుంది వసు. అప్పుడు రిషి, నేను చెప్తుంది బోర్ కొడుతుంది అనుకోకుండా విను వసుధార, ఏ విషయం జరిగినా సరే నాకు నీ మీద ప్రేమ తగ్గదు. నేను నిన్ను ప్రేమించడం మానను కానీ నేను నీకు మూడు రోజులు గడువిస్తున్నాను నాకు నీ దగ్గరనుంచి,నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం రావాలి.
 

Guppedantha Manasu

ఆ ప్రశ్న ఏంటో నీకు తెలుసు జవాబు కూడా నీకు తెలుసు మూడు రోజుల్లో నువ్వు చెప్పే సమాధానం బట్టి మన జీవిత భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నేను నిన్ను నమ్ముతున్నాను వసుధార అని అనగా వసు,జగతి మేడం గురించి అనుకుని సార్ ప్లీజ్ అని అంటుంది.నాకు తెలుసు వసుధార నీకు కష్టంగా ఉంటుందని కానీ మన ప్రేమ కోసం అయినా నువ్వు చేయాలి అని చేయి పట్టుకుంటాడు. అప్పుడు వసు ఏడుస్తూ ఉంటుంది నా ప్రేమలో నిజంగా ఏ స్వార్థం లేదు సార్ అని అంటుంది. అప్పుడు రి నాకు తెలుసు వసుధార,కానీ మర్చిపోకు, మూడు రోజులు గడువిస్తున్నాను.నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వసు, మా ఇద్దరి ప్రేమ కోసం మహేంద్ర సార్ కి ఇచ్చిన మాటను పక్కన పెట్టేయాలా అని బాధపడుతూ ఉంటుంది. 

Guppedantha Manasu

అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రిషి ఒకరి దగ్గర పెన్ డ్రైవ్ తీసుకుంటాడు.ముందే ఇవ్వాల్సింది లేట్ అయిపోయింది అని అంటాడు వాడు. అప్పుడు ఆ పెన్ డ్రైవ్ తీసుకుంటూ రిషి, ఈ విషయం ఇంకా ఎవరికీ చెప్పొద్దు అని లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత సీన్లో ధరణి ఇంటికి వచ్చి ఈ పల్ల బ్యాగు మర్చిపోయావు వసుధార, తీసుకో అని చెప్పి ఇస్తుంది. దీనికోసం ఎంత దూరం వచ్చారా మేడం అని వసు అనగా, లేదు వసు నీకు అత్తయ్య గురించి తెలిసింది కదా! ఎప్పుడు ఏదో ఒక చిచ్చు పెడదామనే చూస్తారు. నువ్వు జాగ్రత్తగా ఉండు ఏ విషయంలో అయినా తనని అనుకూలంగా మార్చుకుంటారు. ఈమధ్య రిషి కూడా ఇంట్లో డల్ గా కనిపిస్తున్నాడు జాగ్రత్తగా ఉండు మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో ఏ గాపు రాకుండా చూసుకొ అని అంటుంది. అప్పుడు వసు మా ఇద్దరి కోసం ఇంతలా ఆలోచిస్తున్నందుకు థాంక్స్ మేడం అని చెప్తుంది. అప్పుడు ధరణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వసు తలుపేసి లోపలికి వచ్చేసరికి ధరణి బైట నుంచి నొప్పితో అరుస్తుంది.

Guppedantha Manasu

ఏమైంది అని బయటికి వెళ్లి చూసేసరికి ఒక బండి వాడు ధరణి నీ గుద్దేసి పోతాడు. ఆ తర్వాత సీన్లో ధరణిని దేవయాని ఇంటికి తీసుకువచ్చి డాక్టర్ని పిలుస్తారు. అప్పుడు డాక్టర్ కట్టు కడుతుంది. అప్పుడు దేవయాని కోపంతో నువ్వు ఎక్కడికి వెళ్లావు? నువ్వు వెళ్ళిన చోట ఈ వసుధార ఎందుకు ఉన్నది అని అడగగా మహీంద్రా, ఇప్పుడు ఆ ప్రశ్నలు ఎందుకు వదినగారు నొప్పితో ఉన్నది కదా అని అంటాడు. అప్పుడు దేవయాని నేను అడుగుతున్నాను కదా చెప్పు అని అంటుంది. కూరగాయల కోసం వెళ్ళాను అత్తయ్య గారు అని అనగా కూరగాయలు ఏవి అని అడుగుతుంది దేవయాని.నొప్పి తో లేగిసేసరికి అక్కడే పడిపోయాయి అని చెప్తుంది ధరణి. ఏంటో నీ మాటలు నమ్మాలనిపించడం లేదు ఫ్రిడ్జ్ నిండా కూరగాయలు ఉన్నాయని ఉంటుంది దేవయాని.

v

ఇంతలో కట్టు కట్టేసి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవయాని మనసులో, ఈ వంకతో ఈ వసుధరా మళ్ళీ ఇంట్లోకి వచ్చేసింది ఎప్పుడు వెళ్తాదో అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో వీళ్ళను మళ్ళీ అలాగైనా విడగొట్టాలి అనీ దేవయాని హాల్ లో అనుకొని జగతిని కాఫీ పెట్టమని అడుగుతుంది.అప్పుడు జగతీ,ధరణి కోసం వేడి నీళ్లు పెడుతున్నాను అక్కయ్య.మీకు తర్వాత పెడతాను మీకు అని అనగా, అంటే నాకన్నా అదే ఎక్కువ అయిపోయిందా ఆ చిన్న నొప్పికి దానికి అంత సేవలు చేయాల్సిన అవసరం లేదు అని దేవయాని అనగా వసుధారా,అక్కడికి వచ్చి, నేను ధరణి మేడమ్ కి నీళ్లు పెడతాను మేడం మీరు వెళ్లి కాఫీ పెట్టండి అయినా ప్రతి ఒక్కరికి మా మేడం పెట్టే కాఫీ తాగే అదృష్టం ఉండదు కదా అని అనగా ఏంటి వసుధార మాటలు చాలా బాగా వస్తున్నాయి, నువ్వు అయినా ఇక్కడ ఎందుకు ఉన్నావు రిషి చూస్తే మళ్ళీ బాధపడతాడు దేవయాని అనగా,పర్లేదు మేడం మా సార్ ని ఎలాగో మాట్లాడిపించాలో నాకు తెలుసు మీరేం బాధపడకుండా వెళ్లి కాఫీ తాగండి అని అంటుంది.
 

Guppedantha Manasu

 ఇంతలో గౌతమ్ వచ్చి నాకు కూడా కాఫీ కావాలి అని అంటాడు. మహేంద్ర కూడా అక్కడికి వస్తాడు. మహేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు గౌతమ్ మహేంద్రని ఆపి ఉండండి అంకుల్ అని కూర్చోబెడతాడు. అప్పుడు గౌతమ్ దేవయానితో, రిషి అక్కడికి వెళ్ళాడో తెలుసా పెద్దమ్మ అని అనగా తెలీదు ఈ మధ్య నాకేం చెప్పట్లేదు అని అంటుంది దేవయాని. అప్పుడు గౌతమ్, ఏమో పెద్దమ్మ రిషి ఈ మధ్య సడన్గా డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ఏ టైం లో ఏ సర్ప్రైజ్ ఇస్తాడో తెలియడం లేదు అని అంటాడు.
 

Guppedantha Manasu

అప్పుడు దేవయాని భయపడి ఏ నిర్ణయం తీసుకున్నాడు అని అనగా తెలియదు పెద్దమ్మ చెప్పాను కదా సప్రైస్ ఇస్తాడేమో అని అంటే నువ్వేం ఫ్రెండ్ ఇవ్వరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవయాని. నా ఫ్రెండ్షిప్ ని అనుమానిస్తున్నారా అని బయటకు అని మనసులో పెద్దమ్మ ఎందుకు ఇంత భయపడుతున్నారు.రిషి తో పాటు ఈవిడిని అర్థం చేసుకోవడం కూడా కష్టమే అని అనుకుంటాడు గౌతమ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!

click me!