రాంచరణ్ నాట్ హ్యాపీ.. అసంతృప్తికి అదే కారణమా, ఇన్ సైడ్ టాక్ లీక్ ?

First Published Sep 22, 2022, 9:33 AM IST

ఆర్ఆర్ఆర్ చిత్రంలో స్టన్నింగ్ పెర్ఫామెన్స్ తర్వాత రాంచరణ్ పై అంచనాలు భారీగా పెరిగాయి. దీనితో చరణ్ ఇక నటించే ప్రతి చిత్రం పాన్ ఇండియా చిత్రమే అవుతుంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం RC15(వర్కింగ్ టైటిల్). దిగ్గజ దర్శకుడు శంకర్ తొలిసారి తెలుగులో చేస్తున్న స్టైట్ మూవీ ఇది. శంకర్ మ్యాజిక్ వర్కౌట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ విధ్వంసం ఖాయం అని మెగా ఫాన్స్ ఆశిస్తున్నారు. 

ఆర్ఆర్ఆర్ చిత్రంలో స్టన్నింగ్ పెర్ఫామెన్స్ తర్వాత రాంచరణ్ పై అంచనాలు భారీగా పెరిగాయి. దీనితో చరణ్ ఇక నటించే ప్రతి చిత్రం పాన్ ఇండియా చిత్రమే అవుతుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే రాంచరణ్ కాస్త అసంతృప్తికి లోనవుతున్నట్లు ఇన్ సైడ్ టాక్. 

సడెన్ గా శంకర్ ప్రయారిటీస్ మారిపోయాయి. శంకర్ ఫోకస్ ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 పై పడింది. రాంచరణ్ చిత్రాన్ని మధ్యలోనే వదిలేసినట్లు అయింది. రాంచరణ్ ముందుగా శంకర్ మూవీ పూర్తయ్యే వరకు మరో సినిమాపై ఫోకస్ చేయకూడదు అని భావించారు. కానీ శంకర్ ఇండియన్ 2 వర్క్ మొదలు పెట్టడంతో చరణ్ సంతోషంగా లేరని అంటున్నారు. 

దీనితో రాంచరణ్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. ఎలాగూ ఖాళీగా ఉన్నారు కాబట్టి తన నెక్స్ట్ మూవీ పై ఫోకస్ పెట్టాడట. ఇక్కడ కూడా చరణ్ కి నిరాశే మిగిలిందని అంటున్నారు. ముందుగా ప్రకటించిన గౌతమ్ తిన్ననూరి మూవీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. 

అలాగే కన్నడ దర్శకుడు నర్తన్, వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ కథలు వినిపించారట. ఇద్దరూ చెప్పిన కథలు రాంచరణ్ ని పూర్తిగా థ్రిల్ చేయలేదని అంటున్నారు. దీనితో ఫైనల్ కాల్ తీసుకోవడం ఆలస్యం అవుతోంది అట. కానీ మీడియాలో నర్తన్ తో ప్రాజెక్టు ఒకే అయినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదని అంటున్నారు.  

రాంచరణ్ ఒక భారీ కథ కావాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నర్తన్, వేణు శ్రీరామ్ కాకకుండా మరికొందరు కూడా చరణ్ కి కథలు వినిపిస్తున్నారట. కానీ ఎవ్వరూ చరణ్ ఆశించిన స్థాయిలో ఉండే కథతో మెప్పించలేకపోతున్నారని సమాచారం.  

click me!