Karthika Deepam: కార్తీక్ దృష్టిలో వంటలక్కని చెడు చేసిన మోనిత... తమ్ముడ్ని ఇంటికి తెచ్చుకుందామన్న హిమ!?

Published : Sep 14, 2022, 08:53 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 14వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...  

PREV
17
Karthika Deepam: కార్తీక్ దృష్టిలో వంటలక్కని చెడు చేసిన మోనిత... తమ్ముడ్ని ఇంటికి తెచ్చుకుందామన్న హిమ!?

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...దీప వాళ్ళ అన్నయ్య, మౌనితకి వైద్యం చేస్తాడు. అప్పుడు కార్తీక్ ని చూసి, మీరు డాక్టర్ కదా మనం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో కలిసాము అని అంటాడు.అప్పుడు మోనిత, మేము ఇతనికి ముందే తెలుసా అని భయపడుతుంది. అప్పుడు ఆ డాక్టర్ మోనితను చూసి మీరు డాక్టర్ ఏ కదా అని అంటాడు. అప్పుడు మీరు మమ్మల్ని తప్పు పడుతున్నారు అని అంటుంది మోనిత. అప్పుడు డాక్టర్ వైద్యం చేస్తూ, దీప చెప్పింది నిజమే ఈవిడకి ఏ నొప్పులు లేవు అని అనుకోని మాత్రలు రాసి, కొంచెం వంటకి దూరంగా ఉండండి.
 

27

వీలైతే వంట మనిషిని పెట్టుకోండి అని అంటాడు. అప్పుడు మోనిత ఆ మందుల్ని చూసి ఆశ్చర్యపోయి ఈయన నిజంగానే ఆ వంటలక్క మనిషే  అని అనుకుని, ఎవడ్రా నువ్వు? నిన్నెవరు పంపించారు? నిజం చెప్పు నేను ఎవరు పంపించారు అని అనగా కార్తీక్,ఇతను వంటలక్క వాళ్ళ అన్నయ్య అంట అని అంటాడు.  నీకు అర్థం కావట్లేదు కార్తీక్, ఈ సాకుతో వంటలక్క మన ఇంట్లో ఉండడానికి ప్రయత్నిస్తుంది.నువ్వు ఎప్పటికి అర్థం చేసుకుంటావు కార్తీక్ ఎప్పుడు తన్నే నమ్ముతూ ఉంటావు అని అరుస్తుంది.
 

37

ఆ తర్వాత సీన్లో హిమ యూనిఫాం వేసుకుని గతం గుర్తుతెచ్చుకొని అలా నడుస్తూ ఉంటుంది. అప్పుడు సరోజక్క కనిపిస్తుంది. ఎలా ఉన్నావు సరోజక్క అని అనగా, నేను బాగున్నాను హిమ కాని అమ్మానాన్నల విషయం గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా బాధ వస్తుంది. శౌర్యమ్మ ఎలా ఉంది అని అడుగుతుంది. అప్పుడు హిమ, శౌర్య లేదక్కా అమ్మ నాన్నల చావుకి నేనే కారణమని నా మీద కోపంతో దూరంగా వెళ్లిపోయింది అని అంటుంది. సారోజక్క, పాపం తన జీవితం అంతా అలాగే ఉన్నది అని బాధపడుతుంది.
 

47

తమ్ముని చూసావా చాలా బాగున్నాడు ఆంటీ అంకుల్ ఇంట్లోనే ఉన్నాడు అని అంటుంది సరోజ అక్క. అవునా నాకు మొన్న మోనిత  ఆంటీ కనిపించారు కానీ మాట్లాడే వీలు కుదరలేదు వెళ్లి తమ్ముని చూద్దాం అని అంటుంది హిమ. ఆ తర్వాత సీన్లో మోనిత బోటిక్ లో కూర్చొని, ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ చేసి నేను డాక్టర్ కాదని చెప్పాలని ప్రయత్నించింది. తర్వాత కార్తీక్ కి కూడా గతం గుర్తు చేయడానికి ట్రీట్మెంట్ చేస్తే? గతం గుర్తు చేయడానికి అంటే కార్తీక్ ఏం చెయ్యడానికి అయినా సిద్ధంగా ఉంటాడు. ఎలాగైనా విల్లను విడగొట్టాలి అని అనుకుంటుంది మోనిత.
 

57

అప్పుడు కార్తీక్ అక్కడికి వచ్చి, అవును మోనిత, మన బాబు విషయం ఏమైంది వెతుకుదామా అని అడగగా,కార్తీక్ కి బాబు విషయం గుర్తున్నాదా? అంటే బాబు నాకు ఉపయోగపడతాడేమో అని అనుకోని బాబు దొరికాడుట కార్తీక్ ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నాను నేను వెళ్లి తీసుకొస్తాను అని అంటుంది మోనిత.నేను వస్తాను అని కార్తీక్ అనగా నువ్వు వస్తే వల వేసిన చేపని తిరిగి నీళ్లలో వేసినంత పనవుతుంది అని అనుకుంటుంది మోనిత  ఆ తర్వాత సీన్లో హిమా తమ్ముడు తో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆంటీ, అంకుల్,సరోజక్క చూసి తమ్ముడు అంటే ఎంత ప్రేమ అని మురిసిపోతారు.
 

67

అప్పుడు హిమా వాళ్ళ దగ్గరికి వెళ్లి తమ్ముడిని నాకు ఇచ్చేయండి ప్లీజ్ అని అడుగుతుంది.అప్పుడు వాళ్లు, వీడు మాకు బాగా అలవాటైపోయాడమ్మా అయినా ఇది మా చేతుల్లో లేదు. మోనిత తన బిడ్డను మాకు ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని తన ఆస్తిని కూడా ఇచ్చేసింది. ఇప్పుడు బిడ్డ ఏడీ ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం ఇవ్వాలి అర్థం చేసుకో అని అంటారు వాళ్లు. అప్పుడు హిమ మౌనంగా ఉండి, తర్వాత నానమ్మని తెచ్చి అడిగిద్దాము అని అంటుంది. ఆ తర్వాత సీన్లో దీప,వాళ్ళ అన్నయ్య కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.
 

77

తను డాక్టర్ అని నిరూపిద్దాం అనుకున్నాను కానీ తను అంతలా అరిసెసరికి ఏం చేయాలో అర్థం కాలేదు అని అంటాడు దీప వాళ్ళ అన్నయ్య. అప్పుడు దీపా తన గురించి నాకు తెలుసు అన్నయ్య, తను మామూలుది కాదు ఇప్పుడు డాక్టర్ బాబు నన్ను వచ్చి ఏమని తిడతారో. అయినా నా భర్త కోసం నేను ఇన్ని పాట్లు పడడం ఏంటి అన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య, నువ్వు దేనికి బాధపడొద్దమ్మా, నీ భర్తని నువ్వే తెచ్చుక, పరాయి ఆడదాని చేయి కూడా తగలడానికి వీల్లేదు నువ్వే కాపాడుకోవాలి అని దీపకు ధైర్యం ఇస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories