ఇక ఫ్యాన్స్ ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలని గోల చేస్తుంటే కొంచెం క్లాస్ పీకి వారి కోరిక తీర్చాడు. ప్రతి రోజూ సినిమా గురించి అప్డేట్ ఇవ్వడం కుదరదు. మీరు అలా గోల చేయడం వల్ల దర్శకుడిపై, నిర్మాతలపై ఒత్తిడి పెరుగుతుంది. దయచేసి ఎదురుచూడండి. ఒకవేళ అప్డేట్ ఉంటే మా భార్య కంటే ముందే మీకు చెబుతా. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాయి. నా నెక్స్ట్ మూవీని ఈ నెలలోనే లాంచ్ చేస్తున్నాం. మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఏప్రిల్ 5, 2024న రోలీజ్ అంటూ ఎన్టీఆర్ అభిమానులని ఖుషి చేశాడు.