Guppedantha Manasu: వసుధార చెంప పగలగొట్టిన రిషీ.. నీకు నేను ఎలా కనిపిస్తున్నానంటూ?

Published : Jun 16, 2022, 10:49 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 16వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Guppedantha Manasu: వసుధార చెంప పగలగొట్టిన రిషీ.. నీకు నేను ఎలా కనిపిస్తున్నానంటూ?

 ఈరోజు ఎపిసోడ్ లో వసు(vasu)రిషి ఒక చోట కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వసు మాట్లాడుతూ ల్యాబ్ లో నేను మాట్లాడిన మాటలు నా గుండెల్లో నుంచి వచ్చాయి సార్.. మీకు ఏమైనా జరిగితే మరుక్షణమే ఈ  వసు(vasu) ప్రాణాలతో ఉండదు అని అనడంతో రిషి షాక్ అవుతాడు. నేను నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను సార్ ఐ లవ్ యూ అని చెప్పడం తో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు.
 

26

అప్పుడు రిషి, వసు(vasu)ని లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. ఏమంటున్నావ్ ఐలవ్యూ నా ఆరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే క్లారిటీ లేదు, భయమేస్తుంది అన్నావు మరి ఇప్పుడు ఏ క్లారిటీ తో ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అంతేకాదు ఆరోజు నువ్వు నా గుండెను ముక్కలు చేసి వెళ్లిపోయావు. అప్పటి నుంచి ప్రతి క్షణం ప్రతి రోజూ నరకం అనుభవిస్తున్నాను రిషి (rishi).
 

36

రిషి మాటలకు వసుధార ఎమోషనల్ అవుతుంది. రిషిని ప్రేమిస్తున్నాను అని చెప్పడం, రిషి కొట్టడం ఇవన్నీ కూడా వసుధార (vasu)కలగంటుంది. ఇక ఆ తర్వాత నిద్ర లో ఉలిక్కిపడి లేచిన వసు అదంతా తన భ్రమ అనుకొని రిషి (rishi)గురించి ఆలోచిస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. మరొకవైపు వసు, రిషి కోసం రెస్టారెంట్ దగ్గర ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే గౌతమ్, రిషి ఇద్దరు రెస్టారెంట్ దగ్గరికి వస్తారు.
 

46

అప్పుడు రిషి నువ్వు వెళ్లి తాగు నేను వెళ్ళిపోతాను అని అనగా, అప్పుడు లేదు నువ్వు రావాలి అని పట్టుబడతాడు గౌతమ్( gautham)ఇంతలోనే ఆ హోటల్ మేనేజర్ అక్కడికి వచ్చి రిషి సార్ వసుధార గురించి నేను మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి రెస్టారెంట్ లోకి తీసుకొని వెళ్తాడు. ఈ మధ్య వసుధార (vasu)ప్రవర్తన చాలా కొత్తగా అనిపిస్తుంది అని చెబుతూ ఉండడంతో ఇంతలోనే అక్కడికి వసు వచ్చి వారి మాటలను వింటుంది.
 

56

వసు ని చూసిన రిషి(rishi) బాధపడుతూ వసు ఆలోచనలు ఎవరికీ అర్థం కావు.  తన ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది అని అంటూ కొందరు బయటకు బాగానే ఉంటారు కానీ భయపడుతూ ఉంటారు అని ఉంటాడు. రెస్టారెంట్ మేనేజర్ మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గౌతమ్(gautham) రిషి కీ ఏమి కావాలో ఆర్డర్ తీసుకొని వస్తుంది వసు. అప్పుడు రిషి కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోతాడు. గౌతం ఎంత పిలిచినా కూడా రిషి వినకుండా కార్ లో వెళ్తాడు.
 

66

ఇక కార్ లో రిషి, గౌతం (gautham)ఇద్దరూ ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు వసుధార, రిషి రెస్టారెంట్ కి వస్తాడు అని మళ్లీ ఎదురుచూస్తూ ఉంటుంది. అనుకున్న విధంగానే రిషి (rishi)అక్కడికి వస్తాడు. అప్పుడు కూడా రిషి కాఫీ ఆర్డర్ ఇచ్చి తనతో పాటు తీసుకువచ్చిన వసుధార చున్నీని అక్కడ పెట్టి థాంక్స్ అని పేపర్ లో రాసిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడికి వసు వచ్చి చూడగా రిషి లేకపోవడంతో ఆశ్చర్యపోతూ ఆ పేపర్ ని చూసి ఆనంద పడుతుంది. ఇక వసుధార ఇంట్లో ఒంటరిగా కూర్చొని జరిగిన విషయాలు అన్ని తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

click me!

Recommended Stories