Guppedantha Manasu: రాజీవ్ పై సీరియస్ అయిన రిషి.. జగతిని అవమానించిన చక్రపాణి?

First Published Dec 30, 2022, 9:18 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 30వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్లో రిషి మేడం మీరు కూడా రావాలి అనడంతో కచ్చితంగా వస్తాను అని అంటుంది జగతి. అప్పుడు వదిన పెద్దమ్మ అందరు వింటున్నారా అనడంతో ఆ వింటున్నాము అని అంటుంది. పెదనాన్న అందరిని తప్పకుండా పిలుచుకురండి అనడంతో సరే రిషి అని అంటాడు ఫణింద్ర. అప్పుడు అందరూ సంతోషపడుతూ ఉండగా మహేంద్ర అక్కడికి కొన్ని తీసుకొని వెళ్లాలి కదా అనడంతో చీర గాజులు ఆ సరుకులు అన్నీ ఉంటాయి ఇంకా ఏమేం తీసుకెళ్లాలి అత్తయ్య అని దేవయానిని ధరణి అడగడంతో జగతిని అడుగు చెబుతుంది అని అంటుంది దేవయాని. చెప్పు జగతి అనగా వెంటనే ఫణీంద్ర ఆ ఏర్పాట్లు మీరే చూసుకోండి అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

అప్పుడు జగతి దంపతులు సంతోష పడుతూ ఉండగా దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు లాడ్జిలో రిషి వసుధరావు ఫోటో చూస్తూ వసుధార అన్ని రాక నా జీవితం అద్భుతం. లేదు నువ్వు ఒక అద్భుతం. గలగల మాట్లాడుతుంది కొత్త కొత్త విషయాలు చెబుతుంది చిన్న పిల్లల మారిపోయి జ్ఞాపకాలు అన్ని చెబుతుంది అనుకుంటూ వసుధార జ్ఞాపకాలతో మురిసిపోతూ ఉంటాడు రిషి. కానీ ఎందుకో వసుధార డల్ గా కనిపించింది ఎక్కువగా మాట్లాడలేదు. తాను నా దగ్గర ఏమైనా దాస్తుందా అనుకుంటూ వసుధార ఫోటో చూస్తూ ఉండగా ఇంతలా రాజీవ్ తలుపు కొట్టడంతో కాఫీ ప్లీజ్ అనగా ఇంకేమైనా కావాలా రిషి సార్ అని అంటాడు.
 

అప్పుడు రాజీవ్ వైపు చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ అని అనడంతో మీరే ఇక్కడికి వచ్చి నన్ను ఏంటి ఇక్కడ అని మీరు అడుగుతున్నారా అని అంటాడు రాజీవ్. అప్పుడు రాజీవ్ కూల్ గా మంచంపై పడుకుని ఎందుకు వచ్చారు ఆడంతో రిషి అది నీకు అనవసరం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సీరియస్ అవుతాడు. అప్పుడు కావాలనే రాజీవ్ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రాజీవ్ నేను శుభవార్త చెబుతామని వచ్చాను అనడంతో ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళు అని అంటాడు. నేను ఏ శుభవార్తలు వినే మూడ్లో లేను అని అంటాడు రిషి. నేను మీ స్టూడెంట్ వసుధార పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను ఆడడంతో నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళు అని అంటాడు రిషి.
 

వసుధార పెళ్లిలో పెళ్ళికొడుకుని నేనే అనడంతో వెంటనే రిషి పిచ్చిపిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను అని అంటాడు. అప్పుడు రిషి ఎంత సీరియస్ అయిన కూడా రాజీవ్ అలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఫస్ట్ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు ఇక్కడే ఉన్నావంటే కొట్టినా కొడతాను అనడంతో కొడితే కొట్టండి కానీ ముఖం మీద కొట్టకండి అసలే పెళ్లి ఉంది అని అంటాడు రాజీవ్. అప్పుడు రిషి కోపంతో రాజీవ్ ని బయటకు గెంటేస్తాడు. ఇప్పుడు రాజీవ్ బయట నుంచి వసుధార మెడలో తాళిబొట్టు చూస్తే అప్పుడు నమ్ముతావేమో కదా రిషి సార్ అని అంటాడు. అప్పుడు రిషి కోపంగా అక్కడికి వెళ్లి వసుధార ఫోటో చూసి వాడు ఏం మాట్లాడుతున్నావో విన్నావా వసుధార మనిద్దరం ఒకటే వాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడో అని అనుకుంటూ ఉంటాడు.
 

 మరోవైపు చక్రపాణి వసుధార అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు చక్రపాణి కూల్ గా మాట్లాడుతూ సుమిత్ర కూతురు పెళ్లి విషయంలో నాకు అధికారం ఉండదా ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడు కూతురికి తగిన వాడిని చూసి హక్కు లేదా అనడంతో సుమిత్ర ఏంటండీ ఇంత కూల్ గా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు చక్రపాణి, సుమిత్ర ఇద్దరు వసుధార గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సుమిత్ర ఇందాక అమ్మాయి అబ్బాయి ఫోటో చూపించింది చాలా బాగున్నాడు ఆనందంతో వెంటనే చక్రపాణి సీరియస్ అవుతూ కొంచెం కూల్ గా మాట్లాడేసరికి నీకు చులకన అయ్యానా అని గట్టిగా అరుస్తాడు.

అప్పుడు పసుధార తన గదిలో ఉండి జగతి ఇచ్చిన గిఫ్ట్ తెరిచి చూడగా అందులో మంగళసూత్రం ఉండడంతో అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు వసు ఆ తాళిని చూసి సంతోష పడుతూ ఉంటుంది. ఇంతలోనే చక్రపాణి కోపంతో రగిలిపోతూ వసుధార గదిలోకి వస్తాడు. ఏంటమ్మా పెళ్లికి ఒపించమని మీ అమ్మని రాయబారానికి పంపించావా అని అడుగుతాడు. మీరు మీరు ఏం మాట్లాడుకున్నా నాకు అక్కర్లేదు నేను ఈ పెళ్లికి మాత్రం ఒప్పుకోను అని అనడంతో వసుధార షాక్ అవుతుంది. అప్పుడు నాన్న నేను మీ పెద్దరికం గౌరవిస్తున్నాను కానీ మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అనడంతో చక్రపాణి వసుధారని ఏమి అనలేక సుమిత్ర మీద సీరియస్ అవుతాడు. ఇంతలోనే జగతి ఫోన్ చేయడంతో వసుధార చేతిలో నుంచి ఫోన్ లాక్కుంటాడు చక్రపాణి. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయగా వసుధార అక్కడ అంతా ఓకేనా అని జగతి అనడంతో, వెంటనే చక్రపాణి గట్టిగటిగా అరుస్తూ అమ్మ తల్లి టీచరమ్మ అప్పుడు జగతితో నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటాడు చక్రపాణి.
 

అప్పుడు నాన్న ఫోన్ ఇవ్వు నాన్న అనడంతో చక్రపాణి వసుధార మీద సీరియస్ అవుతాడు. అప్పుడు జగతి నేను చెప్పేది వినండి చక్రపాణి గారు అనడంతో చక్రపాణి వినిపించుకోకుండా జగతి మీద అరుస్తూ ఉంటాడు. రిషి గురించి నోటికి వచ్చిన విధంగా మాట్లాడడంతో పేరు ఊరు లేని వాడు కాదు రిషి నా కొడుకు డిబిఎస్టి కాలేజ్ ఎండి అనడంతో చక్రపాణి షాక్ అవుతాడు. టీచరమ్మా ఏం స్కెచ్ వేసావ్ టీచరమ్మ అని ఓవర్ గా మాట్లాడుతూ ఉంటాడు చక్రపాణి. అసలు నీ మొగుడు ఎవడో నీ సంసారం ఏంటో అసలు నీ ఊరు ఏంటో నీకే తెలియదు అనడంతో వసుధార షాక్ అవుతుంది. అప్పుడు ఎవర్నో పిలుచుకొని వచ్చి నా కొడుకు అని చెప్పి నా కూతురు గొంతు కోస్తున్నావా అని అంటాడు. అప్పుడు జగతి, చక్రపాణి గారు మర్యాదగా మాట్లాడండి రిషి నా కన్న కొడుకు అనడంతో అయితే ఈ పెళ్లికి అసలు ఒప్పుకోను అని అంటాడు.

click me!