శెట్టినా? సనన్ నా? త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్న ప్రభాస్... బాలయ్య షోలో సీక్రెట్ లీక్ చేసిన చరణ్!

First Published | Dec 30, 2022, 7:28 AM IST


ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనేది ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ గా ఉంది. ఈ మిలియన్ డాలర్ ప్రశ్నకు కొంతలో కొంత క్లారిటీ వచ్చింది. ప్రభాస్ మిత్రుడు రామ్ చరణ్ స్పష్టత ఇచ్చారు. 
 

Unstoppable With Prabhas

నటసింహం బాలయ్య హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ షో(Unstoppable with Prabha)s లేటెస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా ప్రభాస్ వచ్చిన విషయం తెలిసిందే. బోల్డ్ షోగా పేరు తెచ్చుకున్న అన్ స్టాపబుల్ కి ప్రభాస్ రావడం విపరీతమైన క్రేజ్ వచ్చిపడింది. ముఖ్యంగా ప్రభాస్ జీవితంలో సమాధానం లేని ప్రశ్నలుగా ఉన్న ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై ఆయన కొంతలో కొంత క్లారిటీ ఇస్తారేమో అన్న ఆలోచనలు జనాల్లో కలిగాయి. 
 

Unstoppable With Prabhas


అనుకున్నట్లుగానే ఈ టాపిక్స్ బాలయ్య(Balakrishna) చర్చకు తెచ్చాడు. ప్రభాస్ నుండి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఏజ్ బార్  అవుతున్నా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? అని అడగ్గా.. నాకు రాసి పెట్టి లేదు సర్, అని ప్రభాస్ సమాధానం చెప్పాడు. మీ అమ్మకు చెప్పిన సమాధానాలు చెప్పొద్దు, అన్నారు బాలయ్య. దానికి ప్రభాస్ గట్టిగా నవ్వేశారు. 
 


Unstoppable With Prabhas


ఇటీవల శర్వానంద్ గెస్ట్ గా వచ్చాడు. ఎప్పుడు పెళ్లంటే... ప్రభాస్ తర్వాత అన్నాడని బాలకృష్ణ ప్రభాస్ తో చెప్పారు. అయితే నేను సల్మాన్ ఖాన్ తర్వాత అని చెప్పాలేమో, అని ప్రభాస్ టైమింగ్ కౌంటర్ తో ఆకట్టుకున్నారు. అయితే ఫ్రెండ్ రామ్ చరణ్ కాల్ మాత్రం ప్రభాస్ ని కంగారు పెట్టింది. ఎక్కడ తన సీక్రెట్స్ లీక్ చేస్తాడేమో అని ప్రభాస్ భయపడ్డారు. 
 

Unstoppable With Prabhas

చరణ్(Ram Charan) కి కాల్ చేసిన బాలయ్య... ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ చెప్పాలి, అని అడిగాడు. చరణ్... ఏం చెప్పమంటావు డార్లింగ్ అని ప్రభాస్ నే తిరిగి అడిగాడు. నీకు తెలుసుగా ఏదో ఒకటి చెప్పేయ్ పేర్లేదు, అని ప్రభాస్ అన్నాడు. ఒకటి మాత్రం చెప్పగలను సర్... ప్రభాస్ త్వరలో ఒక గుడ్ న్యూస్ తనే స్వయంగా చెప్పబోతున్నాడు, అని చెప్పాడు. 
 

Unstoppable With Prabhas


చరణ్ సమాధానానికి బాలయ్య.. చాలు ఇక నేను అల్లుకుపోతా అన్నాడు. ప్రభాస్(Prabhas) మాత్రం డార్లింగ్ ఏంటి, ఇలా ఇరికించావు. పూర్తిగా చెప్పేయ్ డార్లింగ్ సగం సగం చెప్పి నా కొంప ముంచుకు. ఇండియా మొత్తం అల్లుకుపోతారు. అది ఏదో కంప్లీట్ చేయమని చరణ్ ని వేడుకున్నాడు. 

Unstoppable With Prabhas

బాలయ్య గారికి ఏం దాచకుండా చెప్పేయ్... నువ్వు ఆయన షోకి వచ్చావంటే అన్నీ చెప్పడానికే వచ్చావు అనుకుంటా, అని చరణ్ అన్నారు. చరణ్ ని బాలకృష్ణ మరో క్లారిటీ అడిగారు. ప్రభాస్ ప్రేమిస్తున్న ఆ అమ్మాయి రెడ్డి, రాజు, చౌదరి, నాయుడు లేదా శెట్టి, సనన్ నా? నాకు జస్ట్ హింట్ ఇవ్వు అన్నాడు. దానికి చరణ్... ఒకటి మాత్రం చెప్పగలను సర్... చరణ్ త్వరలో ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు, అన్నాడు.

Unstoppable With Prabhas

బాలయ్య-ప్రభాస్ ఎపిసోడ్లో రామ్ చరణ్ ఫోన్ కాల్ ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. అదే సమయంలో చరణ్ చెప్పినట్లు ప్రభాస్ ఫ్యాన్స్ కి శుభవార్త చెప్పబోతున్నారా... అనే ఆత్రుత మొదలైంది. చాలా కాలంగా అనుష్కతో ప్రభాస్ పెళ్లి అంటూ పుకార్లు ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ పేరు తెరపైకి వచ్చింది.

Latest Videos

click me!