Guppedantha Manasu: ఏంజెల్ ని హద్దుల్లో ఉండమంటున్న రిషి.. తన ఫ్రెండ్ ను బాగా వాడుకుంటున్న వసుధార?

Published : Aug 28, 2023, 08:59 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. తన ప్రేమ విషయం క్లారిటీగా తెలుసుకోవడం కోసం తను ఫ్రెండ్ ని పావుగా వాడుకుంటున్న ఒక లెక్చరర్ కధ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Guppedantha Manasu: ఏంజెల్ ని హద్దుల్లో ఉండమంటున్న రిషి.. తన ఫ్రెండ్ ను బాగా వాడుకుంటున్న వసుధార?

 ఎపిసోడ్ ప్రారంభంలో నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను.. చూపిస్తాను అని రిషిని తనతో పాటు డాబా మీదకి తీసుకువెళ్తుంది ఏంజెల్. ఈ లోపు వసుధార ఏంజెల్ కి సలహా అయితే ఇచ్చాను కానీ వాళ్ళిద్దరూ క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నారంటే భరించలేకపోతున్నాను అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటూ ఏంజెల్ కి ఫోన్ చేస్తుంది వసుధార. పనిమనిషి ఫోన్ ఎత్తి రిషి సార్, ఏంజెల్ మేడం మీ ఇద్దరు డాబా మీదకి వెళ్లారు అని చెప్తుంది.
 

28

ఆ మాట వినేసరికి పొసెసివ్ గా ఫీల్  అయ్యి ఫోన్ పెట్టేస్తుంది వసుధార. డాబా మీదకు వెళ్ళిన తర్వాత అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం ఎంతో చక్కగా డెకరేట్ చేస్తుంది ఏంజెల్. ఏంటిదంతా అని సీరియస్ గా అడుగుతాడు రిషి. నీకోసమే అరేంజ్ చేశాను. ఇలా క్యాండిలైట్ డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటే ఒకరు మనసులో భావాలు ఒకరికి తెలుస్తాయట కదా అంటుంది ఏంజెల్. వసుధార చెప్పిందా అని అడుగుతాడు రిషి. నీకెలా తెలుసు అని షాకింగ్ గా అడుగుతుంది ఏంజెల్.
 

38

ఇలాంటి ఐడియాలు తనకే వస్తాయి. అయినా నీకు ఇంతకుముందే చెప్పాను. మన మధ్య పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది.  అయినా నాకు సింగల్ గా ఉండడం మాత్రమే ఇష్టం అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోబోతాడు రిషి. కనీసం భోజనం చేసి వెళ్ళు అంటుంది ఏంజెల్. నీకు ఎవరైతే సలహా ఇచ్చారో వాళ్లని తీసుకొచ్చి మీ ఇద్దరూ కలిసి భోజనం చేయండి అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి.
 

48

రిషి ఎప్పటికీ అర్థం కాడు అనుకుంటుంది ఏంజెల్. మరోవైపు రిషి, వసు రోడ్డు మీద మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు సార్ నన్ను రమ్మన్నారు అని అడుగుతుంది వసుధార. ఎందుకు అలాంటి లేనిపోని ఐడియాలన్నీ ఇచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతాడు రిషి. ఆ విషయం డిన్నర్ చేసి వచ్చాక అడుగుతున్నారా అని అడుగుతుంది వసుధార. షట్ అప్.. మేడం నేను డిన్నర్ చేయడానికి అక్కడ ఉన్నది మీరు కాదు అని కోపంగా అంటాడు రిషి.
 

58

అంటే నాతో క్యాండీ లేట్ డిన్నర్ చేయడానికి మీకు ఇష్టమే అన్నమాట. మీ మనసులో నేను కచ్చితంగా ఉన్నాను సార్ అంటుంది వసుధార. అలా ఏం లేదు మీరు అలా అనుకుంటున్నారు నేను ఒంటరిగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతాను అంటాడు రిషి. మరి అలాంటప్పుడు ఏంజెల్తో ఎందుకు డిన్నర్ చేయలేదు అంటుంది వసుధార. అది నా వ్యక్తిగతం, ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఇంకెప్పుడూ ఇలాంటి సలహాలు తనకి ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి.
 

68

మరోవైపు ఏంజెల్ పొద్దు పొద్దున్నే వసుధార వాళ్ళ ఇంటికి వస్తుంది. వసుధారకి రాత్రి జరిగిందంతా చెప్తుంది ఏంజెల్. డిసప్పాయింట్ అవ్వొద్దు. మళ్లీ మళ్లీ ప్రయత్నించు అంటుంది వసుధార. నువ్వు నాకు అన్నీ మంచి సలహాలు ఇస్తున్నావు కానీ ఒక సలహా కూడా వర్క్ అవుట్ అవ్వట్లేదు. నా ప్రజెంటేషన్ బాగోటం లేదేమో అని ఫీల్ అవుతుంది ఏంజెల్. ఏదైనా నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు థాంక్స్ ఇంకొక ప్లాన్ వేస్తాను. రిషి మనసులో ఏముందో తెలుసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంజెల్.
 

78

సారీ ఏంజెల్ నేను నీకోసం హెల్ప్ చేయట్లేదు, రిషి సార్ కోసం చేస్తున్నాను. ఆయన మనసులో నేనున్నానని తెలుసుకోవడం కోసం చేస్తున్నాను. నేను నిన్ను పావుగా వాడుకోవడం లేదు కానీ మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ గురించి తెలిసినప్పుడు నువ్వు ఎలా ఫీలవుతావో అని బాధపడుతున్నాను అనుకుంటుంది వసుధార. మరోవైపు మహేంద్ర ఫోన్ చేసి అక్కడ సిచువేషన్ గురించి అడుగుతూ ఉంటాడు. ఈలోపు రిషి ఫోన్ లాక్కొని మీ గురువుగారితోనేనా మాట్లాడుతున్నారు, ఇక్కడివి అన్ని అక్కడికి చేరవేస్తున్నారా అంటాడు.
 

88

నాకు గాని మా గురువు గారికి గాని అలాంటి అలవాటు లేదు. నేను మహేంద్ర సార్ తో మాట్లాడుతున్నాను ఆయన మిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్  గురించి మాట్లాడుతున్నారు అంటుంది వసుధార. అది నీతో ఎందుకు మాట్లాడటం అంటాడు రిషి. అది మీరు నాకు ఫోన్ చేసిన వాళ్ళని అడగండి అంటుంది వసుధార. ఈ లోపు పాండ్యన్ వాళ్ళు రావడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి.  మీ కళ్ళల్లో కోపం స్థానంలో ప్రేమని ఎప్పుడు చూస్తానో అని బాధగా అనుకుంటుంది వసుధార. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories