అవును నాకూ ఆ అనుభవమైంది... క్యాస్టింగ్ కౌచ్ పై అను ఇమ్మానియేల్ షాకింగ్ కామెంట్స్ 

Published : Aug 28, 2023, 08:42 AM IST

చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నదనేది ఒప్పుకోవాల్సిన నిజం. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ ఓపెన్ అయ్యారు. తాజాగా అను ఇమ్మానియేల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.   

PREV
17
అవును నాకూ ఆ అనుభవమైంది... క్యాస్టింగ్ కౌచ్ పై అను ఇమ్మానియేల్ షాకింగ్ కామెంట్స్ 


26 ఏళ్ల అను ఇమ్మానియేల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. 2011లో స్వప్న సంచారి చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. 'యాక్షన్ హీరో బిజూ' హీరోయిన్ గా మొదటి చిత్రం. ఇక మజ్ను మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నాని హీరోగా నటించిన మజ్ను హిట్ టాక్ సొంతం చేసుకుంది. 


 

27

అనంతరం పవన్ కళ్యాణ్ కి జంటగా అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ తో నాపేరు సూర్య వంటి భారీ చిత్రాల్లో నటించింది. అయితే ఇవి రెండు డిజాస్టర్ కావడంతో అను స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ కోల్పోయింది. ఇటీవల రావణాసుర చిత్రంతో పలకరించింది. అది కూడా నిరాశపరిచింది.

37
Anu Emmanuel

అయితే కార్తీకి జంటగా జపాన్ చిత్రంలో అను ఇమ్మానియేల్ నటిస్తున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో జపాన్ తెరకెక్కుతుంది. జపాన్ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో అను ఇమ్మానియేల్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడారు. 

 

47

చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నాకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఈ సమస్యను కుటుంబ సభ్యుల సహకారంతో మనం ఎదుర్కోవాలి. ఇలాంటి ఒత్తిడికి గురైనప్పుడు కుటుంబ సభ్యులతో చెప్పాలి. వాళ్ళ అండ తీసుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు. 

57

కాగా గత ఏడాది అను ఇమ్మానియేల్ పై ఎఫైర్ రూమర్స్ పెద్ద ఎత్తున వినిపించాయి.హీరో  అల్లు శిరీష్ తో డేటింగ్ చేస్తున్నారన్న ప్రచారం సాగింది. ఇద్దరూ ముంబైలో మకాం పెట్టారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ రూమర్స్ పై అను ఇమ్మానియేల్ స్పందించారు. 

 

67

ఆ వార్తలు నా వరకు వచ్చాయి. మా అమ్మ గారు నాతో చెప్పారు. ఆమె న్యూస్ ఎక్కువగా ఫాలో అవుతారు. ఇలా వార్తలు వస్తున్నాయని అమ్మ చెప్పి బాధపడింది. నిజానికి ఊర్వశివో రాక్షసివో చిత్రానికి ముందు శిరీష్ ని కలిసిందే లేదు. ఆ చిత్ర పూజా సెరిమోని రోజు పరిచయమయ్యారు.
 

77

అల్లు శిరీష్ తో నాకు స్నేహం ఉంది. ప్రేమించే చనువు కానీ, ఆకర్షణ కానీ లేదు. శ్రీ, సింధు పాత్రల్లో రియలిస్టిక్ గా కనిపించడానికి కష్టపడ్డాము. ఒక లవ్ ఎంటర్టైనర్ లో నటించినా కూడా ఇలాంటి పుకార్లు సృష్టిస్తారు. నా పేరు సూర్య సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా నటించాను. అప్పటి నుండి అల్లు అరవింద్ ఫ్యామిలీతో నాకు పరిచయం ఉందని గతంలో చెప్పుకొచ్చారు.

click me!

Recommended Stories