Guppedantha Manasu: రిషీతో గొడవకు సిద్దమైన స్టూడెంట్స్.. కాలేజ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన జగతి!

Published : Mar 29, 2022, 09:57 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా ఒక తల్లి, కొడుకు నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. మరీ ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
17
Guppedantha Manasu: రిషీతో గొడవకు సిద్దమైన స్టూడెంట్స్.. కాలేజ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన జగతి!

గౌతమ్ దేవయాని (Devayani) కి ఫోన్ చేసి కాలేజీలో పెద్ద గొడవ జరుగుతుంది. ఇలా ఎప్పుడూ జరగలేదు అని చెబుతాడు. అంతేకాకుండా పెదనాన్న గారిని ఇక్కడికి పంపించండి అని అంటాడు. మరోవైపు వసు (Vasu) రిషి తో మినిస్టర్ గారు మీకు ఏం చెప్పినా కాదు కూడదు వద్దు అనే సమాధానాలు ఇవ్వకండి అని అంటుంది.
 

27

దాంతో రిషి (Rishi)  కోపం వచ్చి వసు (Vasu) ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత మహేంద్ర, జగతిలు మినిస్టర్ గారితో మాట్లాడుతుండగా రిషి కూడా అక్కడికి వెళతాడు. ఇక మినిస్టర్ ఈ ముగ్గురిని ఇలా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. గొప్ప వాళ్లంతా ఓకే ఫ్యామిలీ లో ఉన్నారు అని అంటాడు.
 

37

ఇక మినిస్టర్ గారు ఎప్పటిలాగే మీరు ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకు వెళ్ళాలి అని అంటాడు. ఆ మాటతో జగతి (Jagathi) రిషి వైపు చూస్తుంది. లేకపోతే ఈ ప్రాజెక్టు విషయంలో మేము జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అని మినిస్టర్ అంటాడు. దాంతో రిషి (Rishi) అ ఇష్టంగా సమాధానం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. 
 

47

ఆ తర్వాత ధనుష్ (Dhanush) అనే స్టూడెంట్ తన తోటి స్టూడెంట్స్ ను తీసుకోవచ్చి రిషి సార్ ప్రాజెక్ట్ ఎందుకు రద్దు చేశారని విడిచిపెడతాడు. అంతేకాకుండా వసును రిషి (Rsihi) సార్ పార్టీ ఏ కదా అని అవమాన పరుస్తాడు. ఆ మాటతో వసు ఒక్కసారిగా సీరియస్ అవుతుంది.
 

57

ఇక ఇంతటి వివాదం జరగడానికి కారణం వెనుక దేవయాని (Devayani) ఉంటుంది. ఈమెనే కావాలని ధనుష్ తో రచ్చ చేపిస్తుంది. ఇక వసు మాటలు ఏమీ పట్టించుకోకుండా స్టూడెంట్స్ రిషి (Rishi) సార్ డౌన్ డౌన్ అంటూ పెద్దగా అరుస్తూ ఉంటారు.
 

67

ఇక వాళ్లతో పాటు వసు (Vasu) ను చూసిన రిషి వసునే కావాలని ఇదంతా చేపిస్తుందా అని అపార్థం చేసుకుంటాడు. ఈలోపు అక్కడికి వసు వెళ్లి జరిగిన విషయం చెబుతుండగా రిషి (Rishi) మాట్లాడకు వసు అంటూ గట్టిగా విరుచుకుపడతాడు. అంతేకాకుండా వీళ్ళందర్నీ నువ్వే రెచ్చగొడుతున్నావు అని అంటాడు.
 

77

ఇక స్టూడెంట్స్ అందరూ నిరసన అలానే కంటిన్యూ చేస్తూ ఉండగా.. వసు (Vasu) రిషి దగ్గరకు వెళుతుంది. దాంతో రిషి మంట పెట్టేది నువ్వే చల్లార్చేది నువ్వే అని అంటాడు. ఆ తర్వాత ఓ స్టూడెంట్ జగతి మేడం ను కాలేజి నుంచి పంపించేశారు అంట కదా అని రిషి ను అడుగుతాడు. దాంతో జగతి (Jagathi) అక్కడికి ఎక్స్క్యూజ్మీ అంటూ వస్తుంది. ఇక రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories