టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేన హీరోయిన్ల లిస్ట్ లో అనుష్క పేరు తప్పకుండా ఉంటుంది. స్టార్ హీరోలపక్కన్న అంతే ఇమేజ్ తో మెరుపులు మెరిపించాలన్నా.. విమెన్ ఓరియెంటెడ్ సినిమాలతో రచ్చ చేయాలన్నా.. అనుష్క తరువాతే ఎవరైనా. అంతగా టాలీవుడ్ లో తన ముద్ర వేసింది స్వీటి.
అనుష్క చేసిన అరుంధతి రుద్రమదేవి, భాగమతి సినిమాలు స్టార్ హీరోల సినిమాలకు పోటీగా కలెక్షన్స్ ను రాబట్టాయి. స్టార్ హీరోలకు సమానంగా అనుష్క ఇమేజ్ ను పెంచాయి. ఇక ఒక హీరోతో అనుష్కను చూడాలి అంటే ఆడియన్స్ అనుష్క పక్కన చూడాలి అనుకునేది ప్రభాస్ నే. వీరిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై అంతలా వర్కౌట్ అవుతుంది.
ప్రభాస్-అనుష్క కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ భారీ విజయాలు గా నిలిచాయి. మిర్చి, బాహుబలి సనిమాలు అయితే ఫ్యాన్స్ చేత కేరింతలు పెట్టించాయి. ఒక క్రమంలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అన్నటాక్ కూడా గట్టగా నడిచింది. ఫారెన్ లో ఇల్లు కూడా కట్టుకున్నారు అని ఇండస్ట్రీ గుసగుసలాడింది అప్పట్లో.
Anushka Shetty
బాహుబలి 2' తరువాత ఈ జోడీ తెరపై కనిపించలేదు. ఆతరువాత స్వీటి రెండు సినిమాలు చేసి.. కామ్ అయ్యింది. దాదాపు రెండేళ్లుగా అసలు బయటకే రాలేదు. రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ సక్సెస్ పార్టీకోసం రాజమౌళి స్వీటిని స్పెషల్ గా ఆహ్వానించాడు. దాంతో పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది అనుష్క.
ఇక ఈ జంట కలిసి చేసే మరో సినిమా కోసం ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ జంటను మళ్లీ తెరపై చూడటానికి మరెంతో సమయం లేదనే ఒక టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. వీరిద్దరు మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నారట.
ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి డైరెక్టర్ మారుతి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టు టాక్ గట్టిగా నడుస్తోంది. ప్రస్తుతం వారిని సెట్ సచేసే పనిలో ఉన్నాడు. కృతి శెట్టిని ఒక హీరోయిన్ గా దాదాపు కన్ ఫార్మ్ చేశాడట.. మరో హీరోయిన్ గా మాళవిక పేరు వినిపిస్తంది.
ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం అనుష్కను తీసుకోబోతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ గట్టిగా నడుస్తోంది. కొంతకాలంగా అనుష్క సినిమాలకి దూరంగా ఉంటుది. ఇప్పటికే స్వీటీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మరి ప్రభాస్ తో అనుష్క కాంబినేషన్ నిజమేనా కాదా.. అనేది తెలియాలంటే.. కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.