Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక రేటింగ్ లో మరింత దూసుకుపోతుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
సౌర్య.. నిరూపమ్ (Nirupam) తనను మెచ్చుకున్నందుకు ఎంతో ఆనంద పడుతూ ఉంటుంది. మరోవైపు నిరూపమ్ కూడా కారు లో వెళుతూ సౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలా వెళుతూ సౌర్య (Sourya) ఆటోను క్రాస్ చేస్తాడు.
28
అదే క్రమంలో హిమ (Hima) ఆ ఆటో అమ్మాయిని పరిచయం చేసుకుంటే సౌర్య (Sourya) ను వెతకమని చెప్పాలి అని మనసులో అనుకుంటుంది. మరోవైపు సౌందర్య తన కూతురు దగ్గరికి వెళ్లి మీ డాడీ కి ఇలా జరిగింది అని చెబుతుంది.
38
దాంతో స్వప్న (Swapna) తెలుసు అని చెబుతుంది. ఇక సౌందర్య (Soundarya) తెలిసినా కూడా ఎందుకు రాలేదు అని అడుగుతుంది. స్వప్న అక్కడ నువ్వు ఉంటావ్ అనే నేను రాలేదు అని కఠినంగా చెబుతుంది.
48
అదే క్రమంలో నిరూపమ్ వచ్చి అమ్మ అన్నం పెట్టవా అని అడిగగా ఇంటికి వచ్చిన పెద్దమనిషి వెళ్ళని ఆ తర్వాత పెడతా అని వాళ్ల తల్లిని అవమాన పరుస్తుంది స్వప్న (Swapna). ఆ తర్వాత నిరూపమ్ (Nirupam) అమ్మమ్మ ఇకపై మీరు ఇక్కడికి రావద్దు.
58
అమ్మ ఇక మారదు అని చెబుతాడు. అంతేకాకుండా నన్ను చూడాలి అనిపిస్తే ఫోన్ చేయండి. నేను మీ దగ్గరికి వస్తాను అని అంటాడు. దాంతో సౌందర్య (Soundarya) మనసులో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది.
68
అదే క్రమంలో సౌందర్య (Soundarya) నిరూపమ్ ను పట్టుకొని హిమను నిరూపమ్ అయితేనే బాగా చూసుకోగలడేమో అని మనసులో అనుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సౌర్య (Sourya).. వాళ్ల పిన్ని ను హాస్పిటల్ కు తీసుకు వెళుతుంది.
78
అక్కడ నిరూపమ్ ఫీజుకు బదులుగా సౌర్య ను హిమ (Hima) కు ధైర్యం నేర్పించమని హెల్ప్ అడుగుతాడు. ఆ క్రమంలో నిరూపమ్ మీ ఆటిట్యూడ్ బావుందని సౌర్యను మెచ్చుకుంటాడు. ఆ మాటతో సౌర్య (Sourya) ఫిదా అయ్యి మనసులో తెగ మురిసి పోతూ ఉంటుంది.
88
ఇక హిమ (Hima) జ్వాలా ను చూస్తుంటే నాకు మన సౌర్య ను చూసినట్లు అనిపిస్తుంది అని నిరూపమ్ తో అంటుంది. ఈ మాట అక్కడికి వచ్చిన జ్వాలా (Jwala) వింటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.