Guppedantha Manasu: వసుధారను బాధ పెట్టిన రిషీ.. ఇగో మాస్టర్ కు జగతి సలహా!

First Published Sep 26, 2022, 9:31 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 26వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి వాసుదారనీ బయటకు తీసుకొని వస్తాడు.ఇక్కడికి తీసుకువచ్చారు ఎందుకు సార్ అని వసు  అడగగా, నీకు ఈ చెట్లు, ఆకాశం, నేల అన్న స్నేహితులు కదా, అందుకే వాళ్ళ ముందే నిన్ను అడగాలని నేను అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు వసు మనసులో, రిషి సార్ ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నారు అని అనుకుంటుంది.అప్పుడు రిషి, ఏంటి వసుధార,నేను కొత్తగా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నావా? ఈ ప్రపంచంలో అందరూ నన్ను అపార్థం చేసుకున్న నేను బాధపడలేదు.అందరూ నన్ను దూరం పెట్టిన నేను ఏమి అనలేదు కానీ నువ్వు దూరం పెట్టావు. నువ్వు కూడా నాకు అబద్ధం చెప్పావు అని వీడియో చూపించి, సాక్షి గురించి నాకు ఎందుకు చెప్పలేదు వాసుధార. 

 అంటే నా దగ్గర నిజం దాద్ధామని అనుకున్నావా, నేను ఆ రోజు నిన్ను మరీ మరీ అడిగాను ఏమైంది అని కానీ నీకు ఏది గుర్తులేదు అని చెప్పేసావు అని అంటాడు. అప్పుడు వసు, ఆ వీడియోని చూసి ఆశ్చర్యపోయి అలా కాదు సార్ మీకు నిజం చెప్తే మీరు కోపంతో ఎక్కడ సాక్షిని ఏమైనా అంటారా అని భయంతో చెప్పలేదు. మీకు కోపం ఎక్కువ కదా అందుకే భయపడి చెప్పలేదు అని అంటుంది.అప్పుడు రిషి, నీ భయం గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తావా! నేను ఆరోజు ఎంత భయపడ్డానో తెలుసా, నువ్వు ఎక్కడ కనిపించలేదు నీకు ఏమవుతుందో అని, అసలు సాక్షి అంత సాహసం ఎందుకు చేసింది, అసలు తన ఉద్దేశం ఏంటో నీకేం తెలుసు నాకేం తెలుసు.దాపరికలు లేని ప్రేమ మనిద్దరి మధ్య ఉండాలి అని నేను కోరుకున్నాను, ఇప్పుడు నువ్వు అబద్దమా, నేను అబద్దమా, లేకపోతే మన ప్రేమే అబద్ధమా! అని అనగా వసు,ప్రేమంటే అన్నింటినీ ఓర్చుకోవడం సార్ మీ మనసును బాధ పెట్టడం ఇష్టం లేక నేను సాక్షి విషయం మీకు చెప్పలేదు అని అంటుంది.

అప్పుడు రిషి, నేను బాధపడతానో లేదో నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు, అయినా నువ్వు నాకు ఈ విషయం చెప్పకుండా దాచావు అంటే నేనేం అర్థం చేసుకోవాలి అని అంటాడు. ఈ విషయాన్ని, ప్రేమ గురించి అపార్థం చేసుకునే అంతవరకు తీసుకువెళ్లొద్దు సార్ అని అంటుంది వసు. అప్పుడు రిషి, నా ప్రమేయం లేకుండా డాడ్ తో గురుదక్షిణ ఒప్పందం కుదుర్చుకున్నావు, నాకు చెప్పాలని కూడా అనిపించలేదా! ఆ విషయమూ చెప్పవు, ఈ విషయమూ చెప్పవు. నీ మనసులో నా స్థానం ఏంటి, జగతి మేడంని నాతో అమ్మ అని పిలిపించాలని నాతో ప్రేమగా దగ్గర ఎయ్యవా?దానికోసమే నన్ను వాడుకున్నావా? నాతో ప్రేమ ప్రయాణం అంతా ఆ విషయం కోసమేనా? అని అనగా, వసు ఆశ్చర్యపోయి, నేను ఎలాంటి ప్రణాళికలు వేయలేదు సార్, నా ప్రేమ స్వచ్ఛమైనది అని అనగా రిషి మళ్ళీ, జగతి మేడం కొడుకుని ప్రేమించావని అడుగుతాడు. 

అప్పుడు వసు బాధపడుతూ, ఇంత కఠినంగా మీరు ఎలా మాట్లాడగలరు సర్ అని అంటుంది. అప్పుడు రిషి, ఇంత కఠినంగా మాట్లాడుతున్నానంటే నేనెంత గాయపడి ఉంటానో నీకు తెలుసా! అయినా మనిద్దరి మధ్య ప్రేమ.. అని ఆ మాట పూర్తికాకముందే వసు రిషి చెయ్య పట్టుకొని,మనిద్దరి మధ్య ప్రేమ ఎప్పటికీ పోదు సర్ అది స్వచ్ఛమైనది అని అంటుంది.అప్పుడు రిషి, నీ మీద ప్రేమ తగ్గింది వసుధార.ఈ రిషేంద్ర భూషణ్ ఒకసారి ప్రేమిస్తే ఆకాశమంత ప్రేమిస్తాడు ఒక విషయాన్ని ఇంకొక విషయంతో ముడిపెట్టడు అని అంటాడు. అప్పుడు వసు, సాక్షి విషయంలో నా కారణం ఏంటో మీకు చెప్పాను కదా సార్ అని అనగా, నాకు కోపం ఎక్కువ అని నేను ఒప్పుకుంటాను, కానీ నేను ఏ చోట కోపం ప్రదర్శించాలో నాకు తెలుసు! ఇంకా జగతి మేడం టాపిక్ సాక్షి టాపిక్ వదిలే, జరిగినవన్నీ మనసులో నుంచి తీసేయ్! నన్ను బాధించే పనులు మాత్రం ఇంకెప్పుడూ చేయొద్దు, నా దగ్గర నువ్వు ఏ విషయం దాచకూడదు. జగతి మేడం ఒక మంచి లెక్చరర్, తెలివైన వారు అని గౌరవం.

నిన్ను నన్ను కలిపిన ఒక వారధి గా ఆమె గురించి నాకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అంతకుమించి ఈ ప్రేమ, అనురాగం,లాంటివి ఏమీ లేవు,రావు వాసుధార. నేను ఇంతకుముందు చెప్పాను మళ్లీ చెప్తున్నాను, ఇప్పుడు నుంచి ఇంక మేడం ప్రస్తావన తేవద్దు ఇంకా బయలుదేరుదాం రా అని కారులో కూర్చుంటాడు రిషి.వసు బాధతో అక్కడే ఉంటుంది,త్వరగా రా అని అంటాడు రిషి. వసు కార్లోకి ఎక్కిన తర్వాత ఒకరు పూలు అమ్ముతూ ఉంటారు. ఆవిడ రిషి కార్ దగ్గరికి వచ్చి పూలు తీసుకుంటారా అమ్మ అని అడగగా రిషి మనసులో, తీసుకుంటాను అని చెప్పొచ్చు కదా వాసుధార అని అనుకుంటాడు.
 

అప్పుడు వసు మనసులో, తీసుకోవచ్చు కదా సార్ నాకోసం అని అనుకుంటుంది. గతంలో ఒకసారి రిషి దగ్గర వసు మల్లెపూలు తీసుకున్న సంఘటన గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు రీషి ఆ పూలు కొని వసు కి ఇచ్చి, నువ్వు అనుకున్నది కాదన్నాను కానీ నిన్ను కాదు అనలేదు అని అంటాడు.ఆ తర్వాత సీన్లో వసు ఆ పూల గురించి ఆలోచిస్తూ పూలదండతో గుండె సింబల్ ని వేసి, లోపల వి,ఆర్ అని రాసి ఫోటో తీసి రిషికి పడుతుంది. అప్పుడు రీషి ఆ ఫోటోని చూసి వసుకి ఫోన్ చేస్తాడు. సార్ ఏమైనా నన్ను తిడతారా, అయినా మన సారే కదా అని ఫోన్ ఎత్తుతుంది.
 

 ఆ ఫోటో ఏంటి అని రిషి అనగా, బాగుంది కదా సార్ అయినా నా మీద కోపం తగ్గిందా అని అడుగుతుంది వసు. అప్పుడు రిషి, నాకు కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ వసుధార. అయినా మా ఇంటికి వచ్చేస్తావా నాతోనే ఉండిపోవచ్చు కదా ఎప్పటికీ!నువ్వు ఇంటికి నాకోసం రావడానికి సిద్ధమా అని అడగగా వసు మౌనంగా ఉంటుంది. సరే నువ్వు ఎటు తేల్చుకోలేదన్నమాట అని ఫోన్ పెట్టేస్తాడు రిషి. అప్పుడు జగతి రిషి దగ్గరికి వచ్చి, బంధాలు గాజు వస్తువులు లాంటివి పోగొట్టుకుంటే మళ్లీ తిరిగి రావు అని అనగా, పోగొట్టుకోవడం నాకు అలవాటే లెండి మేడం చిన్నప్పటి నుంచి అని అంటాడు రిషి.
 

 వసుధారని పోగొట్టుకోవద్దు రిషి తను నీకు ముఖ్యమైన బంధం కదా అని జగతి అనగా, బంధం అనేది ఇరువైపు నుంచి ఉండేది అటువైపు వాళ్లకి కూడా బాధ్యత ఉంటుంది. అయినా ఇదంతా వసుధార చేతిలోనే ఉంది అని అంటాడు రిషి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!

click me!