ఈరోజు ఎపిసోడ్ లో హిమ చదువుకుంటూ ఉండగా ఇంతలో ఆనందరావు, సౌందర్య అక్కడికి వచ్చి బాగా చదువు హిమ చదివి మీ నాన్న లాగా గొప్ప డాక్టర్ అవ్వు అని అంటారు. అప్పుడు హిమ నేను డాక్టర్ని అవుతాను సౌర్య ఇంటికి వస్తే శౌర్య కలెక్టర్ అవుతుంది మరి తమ్ముడు ఏమవుతాడు నానమ్మ అని అంటుంది. అప్పుడు ఆనందరావు వాడు పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకుంటే అది చేపిద్దాం అని అనగా వెంటనే సౌందర్య ఇప్పుడు వాడి సంగతి ఎందుకు లేవే ముందు నువ్వు చదువుకో అని అంటుంది. ఆ తరువాత హిమ ఆనంద్ తో ఆడుకోవడానికి ఎక్కడి నుంచి వెళ్లిపోవడంతో అప్పుడు ఆనందరావు సౌందర్య, సౌర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.