ఎప్పటికీ ఆ పిలుపుకు నేను నోచుకోలేనా అని ఎమోషనల్ గా అడగగా రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడు వసుధార అక్కడికి రావడంతో ఇద్దరు మౌనంగా ఉండటం చూసి ఏంటి మేడం ఇద్దరు మౌనంగా ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు రిషి మేడం గారికి ఏం కావాలో జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు గౌతమ్, రిషి, మహేంద్ర ల ఫోటో చూస్తూ అంకుల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని తెలిస్తే వాడు ఎప్పటికీ నన్ను క్షమించడు ఫ్రెండ్ గా అసలు యాక్సెప్ట్ చేయడు అని భయపడుతూ ఉంటాడు గౌతం. ఇంతలోనే మహేంద్ర గౌతమ్ కి ఫోన్ చేసి థ్యాంక్స్ చెబుతాడు.