Guppedantha Manasu: నాకు వసుధార కావాలి మేడం అంటూ జగతికి షాక్ ఇచ్చిన రిషి..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 26, 2021, 11:02 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమౌతున్న గుప్పెడంత మనసు ( Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటిస్థానంలో దూసుకెళ్తోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ చూద్దాం.  

PREV
19
Guppedantha Manasu: నాకు వసుధార కావాలి మేడం అంటూ జగతికి షాక్ ఇచ్చిన రిషి..?

రిషి (Rishi) తన ఇంట్లో తన నాన్న, పెదనాన్న లతో కాలేజీ గురించి చర్చలు చేస్తున్న సమయంలో మహేంద్ర వర్మకు వసుధార నుండి ఫోన్ వస్తుంది. ఇక ఫోన్ రిషి చూడటంతో మహేంద్ర వర్మ (Mahendra varma) బయటికి వెళ్లి మాట్లాడుతాడు. రిషికి వెంటనే అనుమానం వస్తుంది.
 

29

వసు మహేంద్ర వర్మ తో ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయాక కలవాలి సర్ అని అనడంతో మహేంద్ర వర్మ కూడా వసుతో (Vasu) అదే మాట చెబుతాడు. సాయంత్రం రెస్టారెంట్ లో మాట్లాడుకుందామని చాలా విషయాలు చెప్పేవి ఉన్నాయని జగతి (Jagathi) మేడమ్ ను తీసుకురావద్దని అంటాడు.
 

39

అప్పుడే రిషి (Rishi) అక్కడికి రావడంతో మహేంద్రవర్మ (Mahendra) షాక్ అవుతాడు. అంత సీక్రెట్ ఏముంటుంది మీ మధ్య అని అడగటంతో కాలేజీ గురించి మాట్లాడుతున్నాము అని కవర్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. వెంటనే రిషి మీరు చెప్పకున్నా నేను తెలుసుకుంటానని అనుకుంటాడు.
 

49

కాలేజీలో పుష్ప (Pushpa) , వసు ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటారు. మొత్తానికి ఎగ్జామ్ పూర్తవడంతో సంతోషంగా ఉంటుంది వసుధార. పుష్పతో కాసేపు మాట్లాడుతుంది. మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెబుతుంది. కానీ తన మనసులో రిషి (Rishi) తనను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది.
 

59

అప్పుడే మహేంద్రవర్మ (Mahendra) ఫోన్ చేసి వసుతో మాట్లాడుతాడు. రెస్టారెంట్ కు రమ్మని అంటాడు.  మరోవైపు రిషి (Rishi) తన కాబిన్ లో కూర్చొని వసు కోసం ఎదురు చూస్తాడు. రాకపోయేసరికి తన గురించి ఆలోచిస్తూ తనని సెక్యూరిటీతో పిలిపిస్తాడు.
 

69

అప్పుడే జగతి (Jagathi) వచ్చి ఎగ్జామ్స్ పేపర్స్ గురించి మాట్లాడుతుంది. సెక్యూరిటీ వచ్చి వసుధార లేదని అనటంతో వెంటనే రిషి (Rishi) షాక్ అవుతాడు. చెప్పకుండా వెళ్ళిపోయిందని రావాల్సింది నాతోనే కదా అని అనేసరికి జగతి ఆలోచనలో పడుతుంది.
 

79

మళ్ళీ కవర్ చేస్తూ వసును (Vasu) కలవాలని జగతిని రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళమని తాను కూడా వస్తానని చెబుతాడు. ఇక ఫణీంద్ర వర్మ కారు పాడవడంతో రిషి కారు తీసుకెళ్తాడు. జగతి (Jagathi) వచ్చి రిషిని తన కారులో రమ్మని కోరుకుంటుంది. రిషి వెళ్లకుండా కాసేపు తాను మిస్సయిన కొన్ని వాటి గురించి వివరిస్తాడు.
 

89

మొత్తానికి జగతి (Jagathi) రిక్వెస్ట్ చేయడంతో తన కారులో వెళ్తాడు. జగతి డ్రైవింగ్ చేస్తూ రిషిని చూసుకుంటూ ఇవి అద్భుతమైన క్షణాలు అనుకొని చాలా మంచి రోజు అనుకోని రిషి (Rishi) నా కారులో వస్తున్నాడు అనుకుంటూ మురిసిపోతుంది.
 

99

పక్కనే కూర్చున్న రిషి (Rishi) జగతిని చూసి నడపడమని అంటుంటాడు. జగతి అదే పనిగా రిషిని చూస్తుండటంతో రిషి తాను డ్రైవింగ్ చేస్తానని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. కాసేపు వసు (Vasu) గురించి మాట్లాడుతూ.. సడన్ గా నాకు వసుధార కావాలి మేడం అంటాడు. వెంటనే ఆ మాటకు జగతి షాక్ అవుతుంది.

click me!

Recommended Stories