Samantha: బోల్డ్ రోల్ తో సమంత హాలీవుడ్ ఎంట్రీ.. డేరింగ్ డెసిషన్, శృంగార పరమైన అంశంతో..

First Published | Nov 26, 2021, 10:49 AM IST

సమంత తప్పకుండా ఇండియా టాప్ హీరోయిన్లలో ఒకరు. నటన పరంగా సమంత తిరుగులేని ఖ్యాతి సొంతం చేసుకుంది. అయితే తన వ్యక్తిగత కారణాలతో సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

సమంత తప్పకుండా ఇండియా టాప్ హీరోయిన్లలో ఒకరు. నటన పరంగా సమంత తిరుగులేని ఖ్యాతి సొంతం చేసుకుంది. అయితే తన వ్యక్తిగత కారణాలతో సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. క్రేజీ కపుల్స్ గా ఉన్న సమంత, నాగ చైతన్య అనూహ్యంగా విడాకులతో విడిపోయారు. చిత్ర పరిశ్రమకు, అభిమానులకు ఇది ఊహించని షాక్. 

Samantha నెమ్మదిగా ఆ వేదన నుంచి బయట పడుతూ తన సినిమాలపై ఫోకస్ పెడుతోంది. మునుపటి తరహాలోనే క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తోంది. తన కెరీర్ లో ఇంకా భారీ చిత్రాలపై సమంత ఫోకస్ పెడుతోంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో ఇండియా వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం సమంతకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. 


తాజాగా సమంత తన అభిమానులకు క్రేజీ న్యూస్ ప్రకటించింది. తొలిసారి సమంత హాలీవుడ్ చిత్రంలో నటించబోతోంది. అది కూడా ప్రఖ్యాత దర్శకుడు ఫిలిప్ జాన్ దర్శత్వంలో. ఈ విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నేను 2009లో తొలిసారి ఏమాయ  చేశావే చిత్రం కోసం ఆడిషన్స్ లో పాల్గొన్నాను. మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మరోసారి ఆడిషన్స్ లో పాల్గొన్నాను. అదే నెర్వస్ నెస్ ఫీల్ అయ్యాను. 

జాన్ ఫిలిప్ సర్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ అవకాశం నాకు కల్పించిన సునీత తాటి గారికి కృతజ్ఞతలు అని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దర్శకుడు జాన్ ఫిలిప్ ఓ నవల ఆధారంగా శృంగారం అంశంపై చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్'(The arrangements of love) అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం సమంతని ఎంచుకున్నారు. సమంత నటించబోతున్న తొలి హాలీవుడ్ చిత్రం ఇదే. 

ఓ బేబీ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సునీత తాటి ఈ హాలీవుడ్ చిత్రాన్ని గురు ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించనుండడం విశేషం. ఈ చిత్రం బోల్డ్ కథాంశం తో కూడుకున్నది. నవల ప్రకారం సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి స్వతంత్రంగా ఉండాలని భావిస్తుంది. కానీ ఆమె కుటుంబ సభ్యులు అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలని బలవంతం చేస్తూ ఉంటారు. కానీ ఆమె బైసెక్సువల్ గా ఉంటుంది. ఆ బోల్డ్ పాత్రలో సమంత నటించబోతోంది. 

బై సెక్సువల్ రోల్ లో నటించడం అంటే మాటలు కాదు. ఫ్యామిలీ మాన్ 2లో నెగిటివ్ షేడ్స్ లో నటించిన సామ్ తీసుకున్న మరో డేరింగ్ డెసిషన్ 'ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్' అని చెప్పొచ్చు. హాలీవుడ్ చిత్రంలో అవకాశం అందుకున్న సామ్ కి సోషల్ మీడియా వేదికగా ప్రియమణి, రాశి ఖన్నా, కాజల్ లాంటి స్టార్ సెలెబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. Also Read: Niharika: నేను నటించడం నా భర్తకు ఇష్టం లేదు.. సమంతని ఉదాహరణగా చెబుతూ నిహారిక కామెంట్స్

Latest Videos

click me!