NTR vs Lokesh: చంద్రబాబుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ... రెండుగా చీలిన టీడీపీ

First Published | Nov 26, 2021, 10:23 AM IST

మేనత్తకు అవమానం జరిగితే కారణమైన వాళ్ళ మీదకు ఎన్టీఆర్ కత్తి పట్టుకుపోతాడనుకుంటే ప్రవచనాలు పలికాడు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆయనకు మిత్రులు కాబట్టే అలా లైట్ తీసుకున్నాడు. అదే సీతయ్య (హరికృష్ణ) బ్రతికి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా.. తన చెల్లిని అవమానించిన వారికి చుక్కలు చూపించేవాడు. అంతా రచ్చ రచ్చ అయ్యేదని వర్ల రామయ్య అన్నారు.

భువనేశ్వరికి జరిగిన అవమానానికి నిరసనగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన వర్ల రామయ్య ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మేనత్తకు అవమానం జరిగితే కారణమైన వాళ్ళ మీదకు కత్తి పట్టుకుపోతాడు అనుకుంటే ప్రవచనాలు పలికాడు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆయనకు మిత్రులు కాబట్టే అలా లైట్ తీసుకున్నాడు. అదే సీతయ్య (హరికృష్ణ) బ్రతికి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా.. తన చెల్లిని అవమానించిన వారికి చుక్కలు చూపించేవాడు. అంతా రచ్చ రచ్చ అయ్యేదని వర్ల రామయ్య అన్నారు.  


టీడీపీ పార్టీ పగ్గాలు కావాలనుకునే ఎన్టీఆర్, కష్ట సమయంలో దూరంగా ఉండి, తీరిక దొరికినప్పుడు వచ్చి పార్టీ కావాలంటే ఇస్తారా.. అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వర్ల రామయ్య ఇలా జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేయడం వెనుక బాబు హస్తం ఉందని రాజకీయ విశ్లేషకులతో పాటు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. పార్టీ అధినాయకత్వంలో కొడుకు నారా లోకేష్ కి పోటీగా వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కి చెక్ పెట్టడానికి భువనేశ్వరి ఎపిసోడ్ ను బాబు ఉపయోగించుకుంటున్నారని గట్టిగా నమ్ముతున్నారు. 


ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్ పై ఎప్పటి నుండో ఉక్కుపాదం మోపుతున్న చంద్రబాబు తీరుకు విసిగిపోయిన ఫ్యాన్స్ నిరసన గళం విప్పారు. సోషల్ మీడియా వేదికగా బాబుతో పాటు నారా లోకేష్ ని టార్గెట్ చేశారు. ట్విట్టర్ లో #CBNShouldApologizeJrNTR అనే ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ ట్యాగ్ నేషనల్ వైడ్ గా ట్రెండు అవుతుంది. చంద్రబాబుతో పాటు వర్ల రామయ్య ఎన్టీఆర్ కి క్షమాపణలు చెప్పాలని లేదంటే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.క్షమాపణలు చెప్పకుంటే వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరూ.. టీడీపీకి ఓటేసేది లేదని, గట్టిగా వక్కాణిస్తున్నారు. దీనితో బాబు ప్లాన్ బెడిసి కొట్టినట్లు కొందరు అభిప్రాయం వెల్లడిస్తున్నారు. 


మరో వైపు లోకేష్, బాబు ఫ్యాన్స్ కూడా తగ్గడం లేదు. ఎన్టీఆర్ వలన పార్టీకి కొత్తగా ఒరిగేది ఏమీ లేదని, పార్టీ కోసం పనిచేయని ఎన్టీఆర్ అవసరం లేదని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్ లో టీడీపీ పార్టీలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్, లోకేష్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోగా, ఈ పరిణామం టీడీపీకి చేటు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇక టీడీపీకి ఎన్టీఆర్ ని దూరం పెట్టాలని బాబు ఎప్పుడో డిసైడ్ అయ్యారు. ఎన్టీఆర్ ఫ్యామిలీలో ప్రతిఘటించే వారికి చెక్ పెడుతూ వస్తున్నాడు ఆయన. అది సీనియర్ ఎన్టీఆర్ తో మొదలై, హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఎదురైంది. 

అంతెందుకు ఎన్టీఆర్ పార్టీలోకి రావడం బాలకృష్ణకు కూడా ఇష్టం లేదు. ఓపెన్ గానే ఈ విషయం ఆయన వెల్లడించారు. ఇక బాలకృష్ణ చిన్నల్లుడు కూడా ఎన్టీఆర్ వలన పార్టీకి కొత్తగా ఒరిగేది ఏమీ లేదని, ప్రస్తుతం పార్టీలో హేమాహేమీలు ఉన్నారని, వాళ్ళు పార్టీని చూసుకుంటారు అన్నారు. ఎన్టీఆర్ వలన లోకేష్ పదవికి గండం ఉందని భావిస్తున్న చంద్రబాబు... అప్పుడప్పుడు తన నేతల చేత జూనియర్ ఎన్టీఆర్ పై ఈ తరహా దాడి చేయిస్తూ ఉంటారు.

Also read RRR movie: హార్ట్ ఆఫ్ ది ఆర్ ఆర్ ఆర్... జనని సాంగ్ చూడండి, సినిమా ఏమిటో తెలిసిపోతుంది... రాజమౌళి కామెంట్స్!

Akso read డిసెంబర్, జనవరి 2021 లో రిలీజ్ అయ్యే తెలుగు చిత్రాల లిస్ట్

Latest Videos

click me!